Delhi: తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్.!
Publish Date:Oct 5, 2026
Advertisement
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు. సోమవారం ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. 2013 బ్యాచ్‌కు చెందిన అద్వైత్ కుమార్ సింగ్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కోఆర్డినేషన్ (కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు) ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రెసిడెంట్ కమిషనర్ పదవికి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం.1441, సాధారణ పరిపాలన (Spl.A) శాఖ, తేదీ 03.10.2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అద్వైత్ కుమార్ సింగ్‌కు తెలంగాణ భవన్‌తో ఇప్పటికే అనుభవం ఉంది. 2026 ఫిబ్రవరిలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయనను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో రాష్ట్రం–కేంద్రం మధ్య సమన్వయం చేయడం ఆయన ప్రధాన బాధ్యతల్లో ఒకటి. తెలంగాణకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాలు, వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేయడంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇటీవల హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించిన అంశాలపై కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖతో జరిగిన సమావేశంలోనూ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఇప్పటివరకు రెసిడెంట్ కమిషనర్‌గా డా. శశాంక్ గోయల్ బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఆయనతో పాటు అద్వైత్ కుమార్ సింగ్ కూడా పాల్గొంటూ వచ్చారు. తాజా ఉత్తర్వులతో రెసిడెంట్ కమిషనర్ బాధ్యతలను అదనంగా చేపట్టిన అద్వైత్ కుమార్ సింగ్, తన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ బాధ్యతలను కూడా కొనసాగించనున్నారు.
[ Delhi Telangana Bhavan, Advait Kumar Singh as Resident Commissioner, CM Revanth reddy, Dr. Shashank Goyal as Commissioner, Telangana goverment, Telangana police, Hyderabad police ]
http://www.teluguone.com/news/content/delhi-telangana-bhavan-25-233434.html





