సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కవిత నిరసన.!

Publish Date:Oct 5, 2026

Advertisement

 సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నాయకులతో కలిసి సింగరేణి భవన్‌ను ముట్టడించి నిరసన తెలిపారు. కార్మికుల సమస్యలపై సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించాలని, సీఎండీ స్వయంగా వచ్చి కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నామని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం తప్పించుకుంటోందని ఆరోపించారు. 

డిపెండెంట్ ఉద్యోగాలు కార్మికుల హక్కు అని, అది యాజమాన్యం వేసే బిచ్చం కాదని స్పష్టం చేశారు. కార్మికుల కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో యాజమాన్యం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సింగరేణిలో కచ్చితంగా నెలకు రెండు రోజులు మెడికల్ బోర్డు నిర్వహించాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. సింగరేణి లాభాల్లో 35 శాతం బోనస్‌ను కార్మికులకు ఇవ్వాలని అన్నారు. కార్మికులు సంస్థ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్నారని, సంస్థకు వచ్చే లాభాల్లో వారికి న్యాయమైన వాటా దక్కాల్సిందేనని పేర్కొన్నారు.

 అలియాస్ పేర్లు ఉన్న కార్మికులను విజిలెన్స్ పేరుతో వేధించవద్దని కవిత అన్నారు. కార్మికులను వేధిస్తూ అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యం తక్షణమే స్పందించాలని కవిత కోరారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి సింగరేణి సీఎండీ స్వయంగా వచ్చి తమతో చర్చలు జరపాలని, కార్మికుల డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

 డిమాండ్లు..

* జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయాలి

* విజిలెన్స్ పేరుతో ఆపిన డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలి

* ప్రతి కార్మికుడికి సొంత ఇంటి పథకం కోసం 2 గుంటల భూమి ఇవ్వాలి

* సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించాలి

* సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలి

* కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ సిఫార్సుల మేరకు జీతాలు ఇవ్వాలి

* ప్రభుత్వం సింగరేణికి బాకీ పడిన రూ.62 వేల కోట్లు వెంటనే చెల్లించాలి


[ Kavitha Protest, TRS, HMS, Singareni Bhavan, Singareni workers, SCCL, Singareni CMD Dr. Jyoti Buddhaprakash, CM Revanth reddy, Deputy cm Mallu Bhatti Vikramarka, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.