భారతీయులకు స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఇవీ..!

Publish Date:Jan 9, 2024

Advertisement


భారతదేశ యువతకు ఆధ్యాత్మికతను, స్వాతంత్ర్య పోరాట పటిమను, దేశభక్తిని సమపాళ్లలో రగిలించిన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన భారతదేశాన్ని, భారతీయులను గూర్చి ఇలా చెప్పారు..

వివేకి స్వాతంత్ర్యాన్ని కోరుతాడు. ఇంద్రియ సుఖాలన్నీ నిస్సారాలని అతడు గుర్తిస్తాడు. సుఖదుఃఖాలకు అంతు లేదని తెలుసుకొంటాడు. ఎందరో ధనికులు క్రొత్త క్రొత్త సుఖాలు కావాలని ఆత్రపడుతున్నారు? ఉన్న సుఖాలన్నీ పాతబడి పోయాయి. కాబట్టి వారికి క్రొత్తరకమైన సుఖాలు కావాలి. క్షణకాలం పాటు పొందే తృప్తి కోసం వారెన్నెన్ని పిచ్చి వస్తువులను కొనుగోలు చేస్తున్నారో? ఆ తృప్తి కలిగిన వెంటనే దానికి విపరీత ఫలం కూడా ఎలా కలుగుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. 

 ప్రజలలో అధిక సంఖ్యలో  గొఱ్ఱెల మంద లాంటివారు ఉన్నారు. ముందుపోతున్న గొఱ్ఱె గోతిలో పడితే, వెనుక వస్తున్న గొఱ్ఱెల కూడా ఆ గోతిలోకే దూకుతాయి. అదేవిధంగా సంఘంలోని ఒక పెద్ద, ఏ పని చేస్తాడో ఆ పనినే తక్కిన వారంతా గుడ్డిగా చేస్తారు. తాము ఏం చేస్తున్నదీ వారు ఆలోచించరు. ప్రాపంచిక విషయాలు అసారాలని గుర్తించడం ప్రారంభించగానే, తాను మాయ చేతి ఆటబొమ్మగా గానీ, మాయాకర్షణలకు లోబడి గానీ ఉండకూడదన్న భావం మనిషికి కలుగుతుంది. దయతో నాలుగు మాటలు చెప్పగానే, మానవుడు నవ్వడం ప్రారంభిస్తాడు. కటువైన మాటలు నాలుగు చెవిన పడగానే ఏడవడం మొదలు పెడతారు. పేరుకూ, ప్రతిష్టకూ బానిస అవుతారు. ఈ బానిసతనానికి లోపల యథార్థమైన మనిషి  పూడుకొనిపోయి ఉంటాడు.  ఈ బానిసతనాన్ని గుర్తించినప్పుడు స్వాతంత్ర్యం కావాలన్న తీవ్రమైన కోరిక కలుగుతుంది. 

నిప్పు కణికను నెత్తి మీద పెట్టినప్పుడు దాన్ని తోసివేయడానికి మనిషెంత అల్లాడిపోతాడో..  మాయకు తాను బానిసగా ఉన్నానని నిజం తెలుసుకొన్నవాడు కూడా బంధ విముక్తుడు కావడానికి అంతగా ఆత్రపడతాడు.

ముముక్షత్వం పొందాలన్న కోరికను మనుషులు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అన్ని విషయాలలో  వివేకంగా ఉండటం. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిత్యమో, ఏది తాత్కాలికమో ఆలోచించడం. దేవుడొక్కడే నిజం, ఆయనే శాశ్వతం.. మిగిలినదంతా క్షణభంగురమే! అంతా నశించి పోతుంది. మనుషులు  మరణిస్తారు. పశువులు, భూములు అంతరిస్తాయి. సూర్యచంద్రులు, నక్షత్రాలు, ప్రతి వస్తువు. అనుక్షణం మారిపోతూ ఉంటుంది. ఈరోజు పర్వతాలుగా ఉన్నవి  నిన్న సముద్రాలుగా ఉన్నాయి. మళ్ళీ అవి రేపు సముద్రాలవుతాయి. సమస్త విశ్వం మార్పుల కుప్ప, కానీ ఏనాటికీ మార్పు చెందని వాడొకడున్నాడు. అతడే భగవంతుడు! మనం ఆయనను ఎంతగా సమీపిస్తే, మన మీది మాయ ప్రభావమంత తగ్గిపోతుంది. మనం ఆయనను సమీపించినప్పుడు, ఆయనతో కూడా నిలిచినప్పుడు మాయను జయిస్తాం. ఈ దృశ్యమాన ప్రకృతి మన అధీనమవుతుంది. మనపై దాని ప్రభావం ఉండదు. ఇదీ వివేకానందుడు భారతీయులకు చెప్పిన మాట.


                                *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ నియంత్రణ మరియు తక్షణ శక్తి వంటి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ప్రధాన లక్షణాలు మరియు దీనిని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఉత్తమ ఆహార పదార్థాల గురించి పూర్తి సమాచారం.
తీవ్రమైన మానసిక ఆందోళన మరియు ఒత్తిడితో బాధపడుతున్న యూజర్లలో దాదాపు 47 శాతం మంది భావోద్వేగ మద్దతు కోసం ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వృద్ధులలో విపరీతమైన మందుల వాడకం (పాలీఫార్మసీ) మరియు సంక్లిష్టమైన రెజిమెన్స్ వల్ల వైద్యులపై పడుతున్న భారం గురించి తాజా అధ్యయన విశేషాలను తెలుసుకోండి.
అల్గారిథమ్‌ల గందరగోళం మరియు ఆటోప్లే పాటలతో విసిగిపోయిన మ్యూజిక్ ప్రియులు మళ్లీ సీడీల (CDs) వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? సీడీల పునరాగమనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలపై ప్రత్యేక కథనం.
ఆంధ్ర స్టైల్ శెనగపప్పు మటన్ కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. రుచికరమైన మరియు ప్రోటీన్ నిండిన ఈ ట్రెడిషనల్ రెసిపీ తయారీ విధానం పూర్తి వివరాలతో.
ఏ ఇంటికైనా ఆ ఇంట్లోని పిల్లల ప్రవర్తనే వారి పరువు ప్రతిష్టలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కొడుకు మంచివాడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో చిన్నారులను స్మార్ట్‌ఫోన్‌లు, టీవి,  వీడియో గేమ్స్ నుండి దూరం చేయడం  తల్లిదండ్రులకూ ఒక పెద్ద ఛాలెంజ్ గా  మారింది.
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా,
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.