మూడుదశాబ్దాల వర్గీకరణ పోరాటానికి శుభం కార్డు!

Publish Date:Aug 2, 2024

Advertisement

ఎస్సీ వర్గీకరణకోసం మూడుదశాబ్దాల పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో  శుభం కార్డు పడింది.సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ప్రధాన ధర్మాసనం గురువారం (ఆగస్టు 1)  వర్గీకరణకు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యుల  ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది వినా మిగిలిన ఆరుగురు న్యాయమూర్తులు వర్గీకరణను సమర్ధిస్తూ తీర్పు వెలువరించారు. సమానత్వహక్కుకు వర్గీకరణ భంగం కాదని తీర్పు పేర్కొంది.

అలాగే ఆర్టికల్ 341/2కు భంగంకలగకూడదనీ, ఆర్టికల్ 15,16 లలో వర్గీకరణను వతిరేకించే అంశాలు లేవని ఆ తీర్పులో పేర్కొన్నారు.   దీనివల్ల ఉప వర్గాలకు న్యాయం చేకూరుతుందని, రాష్ట్రాలకు ఉప వర్గీకరణ లో అవకాశం ఇవ్వాలని, ఎస్సీల్లో క్రిమీలేయర్ గుర్తించడానికి అవకాశం ఇస్తూ తీర్పు చెప్పడం చారిత్రాత్మకం. మాదిగలకు గుర్తింపు తెచ్చిన మందకృష్ణ మాదిగ 1972 నుంచి ఉమ్మడి ఏపీలోమారిన ప్రతి సీఎం వద్దకు  వెళ్లి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.వర్గీకరణకు సహకరించాలని కోరేవారు.

2011జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ల జనాభా 1.38 కోట్లమంది ఉన్నారు. వారిలో మాలలు 55.70లక్షలు, మాదిగలు67.02 లక్షల మంది ఉన్నారు.అంటే 11లక్షలమంది మాదిగలు ఎక్కువ ఉన్నారు.మాలమాదిగలు 80 శాతంగా ఉండగా,మిగిలిన 20 శాతంగాఉన్న  57 ఉపకులాల్లోఉత్తరాంధ్ర రెల్లి కులానిది మూడో స్థానం.70శాతంగా ఉన్న మాదిగ,దాని ఉపకులాలు రిజర్వేషన్లు 10శాతం పొందుతున్నారు. 30శాతంగా ఉన్న మాలలు వారి ఉపకులాలు 90శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని వారి వాదన.

2000-2004మధ్య చంద్రబాబు వర్గీకరణ అమలు చేసారు. కాని మాలమహానాడు వ్యతిరేకించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  హైకోర్టు వర్గీకరణ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 2004లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం హైకోర్ట్ తీర్పు ను సమర్దిస్తూ తీర్పు వెలువరించింది. ఆ తర్వాత ఆనేక పోరాటాలు,ఉద్యమాలు నడిచాయి.చివరికి ఎన్నికల ముందు ప్రధాని మోదీ హైదరాబాద్లో జరిగిన విశావరూప సదస్సుకు హాజరై వర్గీకరణ ను సమర్దిస్తూ మాట్లాడారు. వర్గీకరణకు మద్దతు తెలిపారు.  మందకృష్ణ మాదిగ  ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మం గెలిచిందని వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని పోరాటంలో అమరులైన వీరులకు అంకిత మిస్తున్నామన్నారు.

ఈ విజయంలో  చంద్రబాబు పాత్ర కీలకమనీ, వర్గీకరణ విజయం క్రెడిట్ ఆయనకే   చెందుతుందన్నారు.  ప్రధాని  మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబులు వర్గీకరణ తీర్పు పై హర్షం వ్యక్తం చేసారు. ఇలా ఉండగా వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును మాలమహానాడు వ్యతిరేకించింది. న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. ఏది ఏమైనా సుప్రీం ప్రధాన ధర్మాసనం తీర్పుతో వర్గీకరణ వివాదానికి శుభం కార్డు పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.