Publish Date:May 15, 2025
ఆపరేషన్ సిందూర్ భారత జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీని ఈనెల మే 16న విజయవాడలో నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నిర్ణయించారు.
Publish Date:May 15, 2025
వైసీపీ అధినేత జగన్‌కు సొంత జిల్లాలో భారీ షాక్ తగిలింది. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. గతకొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు తెలిపారు.
Publish Date:May 15, 2025
జగన్ ఇలాకా కడప జిల్లాలో పసుపు దళం పార్టీ పండుగ చేసుకోనుండటం హాట్ టాపిక్‌గా మారింది. కడపలో టీడీపీ మహానాడు మూడు రోజుల పాటు నిర్వహించడానికి నిర్ణయించింది. 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న తొలి మహానాడుకు కడప వేదిక అవ్వడంతో జిల్లా తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది.
Publish Date:May 15, 2025
ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారి పోటీ చేసే వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తిరిగి సెగ్మెంట్ మారేందుకు కసరత్తు మొదలు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో గెలుపొందిన యర్రగొండపాలెం నియోజకవర్గానికి తిరిగి వెళ్లేందుకు ఆయన తెర వెనుక రాజకీయాలు మొదలుపెట్టారంట.
Publish Date:May 15, 2025
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Publish Date:May 15, 2025
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా గడిచిన ఐదేళ్ల కాలంలో తన హవా చాటిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, తన సోదరుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే గా ఉండగా.. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీలను శాసించేవారు.
Publish Date:May 15, 2025
ఏపీ లిక్కర్ స్కాంలో గోవిందప్ప లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారని, మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది.
Publish Date:May 15, 2025
ఆపరేషన్ సిందూర్ ఆపి అమెరికాకు మోకాలొడ్డిన ప్రధాని మోడీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈ ఆపరేషన్ ద్వారా ఇండియా పాకిస్థాన్ కు కలిగించిన నష్టం నుంచి కోలుకోవడానికి రెండుమూడు దశాబ్దాలు పడుతుందంటూ.. యుద్ధ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలు, విశ్లేషణలు భారత ప్రభుత్వం ఎంత సంయమనంతో వ్యవహరించిందో.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు సాధించిందో అవగతమౌతోంది.
Publish Date:May 15, 2025
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్టైలే డిఫరెంట్. అభివృద్ధి పనుల విషయంలో ఆయన టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ ముందుకు కదులుతారు. తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు రూరల్ లో దాదాపు 41 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో మొత్తం 339 అభివృద్ధి పనులను రికార్డు సమయంలో పూర్తి చేసి అన్ని పనులనూ ఓకే రోజు ప్రారంభిస్తున్నారు.
Publish Date:May 15, 2025
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న వేళ అకస్మాత్తుగా భారత్,పాక్ ల మధ్య కాల్పుల విరమణ జరగడం..కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలనూ అంగీకరింపచేయడం తన ఘనతేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భుజాలను తానే చరిచేసుకుని, తనను తానే ఓ గొప్ప శాంతి దూతగా అభివర్ణించేసుకోవడం తెలిసిందే.
Publish Date:May 15, 2025
భారత్ పై టర్కీ డ్రోన్స్ తో పాక్ దాడి చేసింది. నాలుగురోజుల ఆపరేషన్ సింధూర్ తో భారత్ గట్టి జవాబు ఇచ్చింది. వందల సంఖ్యలో టర్కీడ్రోన్స్ ను భారత్ కూల్చివేసింది. 2023 లో టర్కీలో వచ్చిన భూకంపానికి ఆ దేశం కకావికలం అయి దిక్కుతోచని స్థితిలో పడిన సమయంలో ఏ దేశం ముందుకు రాని స్థితిలో భారత్ ఆపరేషన్ దోస్తు అంటూ ఆహారం,మందులు ఇతర సహాయం అందించింది.
Publish Date:May 14, 2025
జూన్, జూలై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గడవు ముగిసనా ఎన్నికలు జరగక పోవడం వలన స్థానిక సంస్థలకు రావలసిన కేంద్ర నిధులు ఆగిపోయాయి. దీంతో కులగణన అయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని గత ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలొచ్చాయి.
Publish Date:May 14, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (మే15) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.