LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఒక వైపు సిట్ వేగం పెంచింది. వరుస అరెస్టులతో కేసు దర్యాప్తును ఫుల్ స్పీడ్ తో సాగిస్తోంది. అదే సమయంలో మరో పక్క నుంచి ఈడీ కూడా వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ కేసులో కింగ్పిన్ గా భావిస్తున్న రాజ్ కేశిరెడ్డిని విచారణకు అనుమ తించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారుల నుంచి వివరాలు సేకరించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఇక నేరుగా రంగంలోకి దిగుతోంది. అందులో భాగంగానే  ఇప్పుడు ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని విచారించేందుకు సిద్ధమౌతోంది. ఆయన వాంగ్మూలం నమోదు చేసేందుకు  అనుమతి ఇవ్వాల్సిందిగా విజయవాడ ఏసీపీ కోర్టులో ఈబీ పిటిషన్ దాఖలు చేసింది.   మద్యం కుంభకోణం కేసులో ఏ1 రాజ్ కేశినెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం (మే 16) విజయవాడ ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన న్యాయవాది ఏకంగా కోర్టులోనే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అసలు సూత్రధారులు తప్పించుకుని రాజ్ కేసిరెడ్డిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కోర్టులోనే రాజ్ కేశిరెడ్డి తరఫు న్యాయవాది వ్యాఖ్యానించడంతో రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారనున్నారన్న అభిప్రాయం పరిశీలకులలో  వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఈ కేసులో ఈడీ కూడా రాజ్ కేశిరెడ్డిని విచారించేందుకు రెడీ అవుతుండటంతో  ఇక ఈ కేసులో ఉన్న అసలు సూత్రధారుల గుట్టు రట్టు కావడం ఖాయమని అంటున్నారు. అలాగే ఈ కేసులో ఈడీ కూడా దూకుడు పెంచుతున్న నేపథ్యంలో  ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయనీ, సంచలన అరెస్టులు జరుగుతాయనీ అంటున్నారు.  
  తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహూకరించారు. దాదాపు 5 కేజీల బంగారంతో చేయించిన కటి హస్తం, వరద హస్తాలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఇవాళ ఉదయం  సంజీవ్ గోయెంకా తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు ధరించి  శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, అధికారులు స్వామి వారి శేష వస్త్రం తో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు
ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదు అనడానికి మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఒక ఉదాహరణ. ఒకప్పుడు అపర కుబేరుడిగా వెలుగొందిన ఆయన ఇప్పుడు సాధారణ ఖైదీగా జైలు ఊచలు లెక్కిస్తున్నారు. గతంలో తన కుమార్తె వివాహాన్ని  నభూతో నభవిష్యత్ అన్నట్లుగా కోట్లు గుమ్మరించి అంగరంగ వైభవంగా చేశారు. ఆ సందర్భంగా ఆయన తన కుమార్తను  తల నుంచి కాళ్ల వరకూ వజ్రాభరణాలతో అలంకరించిన తీరు అప్పట్లో వార్తల పతాక శీర్షికల్లో నిలిచింది. అటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు మైనింగ్ అక్రమాల కేసులో దోషిగా చంచల్ గూడ జైల్లో కటకటాలు లెక్కిస్తున్నారు.   మాజీమంత్రి గాలి జనార్థన్‌ రెడ్డి ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషిగా నిర్ధారణై చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఇదే కేసులో ఇప్పటికే  నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించినందున దానిని పరిగణనలోనికి తీసుకుని శిక్ష తగ్గించాలంటూ గాలి జనార్ధన్ రెడ్డి కోర్టును కోరినా ఫలితం లేకపోయింది. అదలా ఉంటే.. గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో ఆటోమేటిగ్గా ఆయన శాసనసభ సభ్యత్వం కూడా రద్దైపోయింది.  ఇక ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి జైలులో తనకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. అయితే సీబీఐ కోర్టు ఆయన అభ్యర్థనను తోసి పుచ్చింది. నేరం రుజువై, దోషిగా నిర్ధారణ అయ్యి శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలూ కల్పించడం కుదరదని సీబీఐ కోర్టు స్ఫష్టం చేసింది. దీంతో గాలి జనార్ధన్ రెడ్డి చెంచల్ గూడ జైలులో సాధారణ ఖైదీగా మాత్రమే పరిగణించబడతారు. అంటే మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్ రెడ్డిని చెంచల్ గూడ జైలులోని ఇతర సాధారణ ఖైదీలాగానే ట్రీట్ చేస్తారు. సాధారణ ఖైదీ మాదిరిగానే ఆయన జైలు ఖైదీ యూనిఫారంనే ధరించాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలూ ఉండవు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఈ కేసులో శిక్ష పడిన ఆయన సమీప బంధువు శ్రీనివారెడ్డి, రాజ్ గోపాల్, అలీఖాన్ ను కూడా అదే జైలులో, అదే బ్యారక్ లో ఉన్నారు. 
  మంత్రులు కమిషన్లు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని  స్వయంగా ఒప్పుకున్నారు. ఎవరు ఎంత కమీషన్ తీసుకున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని  కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని స్వమంగా మంత్రే ఒప్పుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  18 నెలల రేవంత్ పాలనలో ఎవరెవరు ఎంతెంత కమీషన్లు తీసుకున్నారో వెంటనే దర్యాప్త చేయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మంత్రులు తీసుకున్న కమీషన్ల వివరాలను ప్రజల ముందుంచాలని కేంద్రమంత్రి వెల్లడించారు. కాశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడికి కౌంటర్‌గా ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టి జవాబు చెప్పామని అన్నారు. పీవోకేలో ఉగ్రవాద శిబిరాలను నెలమట్టం చేశామని పేర్కొన్నారు. భారత్ రాఫెల్ విమానాలను ధ్వంనం చేశామంటూ.. దిక్కుతోచని స్థితిలో పాక్ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. దాయాదుల దాడులకు త్రివిధ దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయని కిషన్ రెడ్డి తెలిపారు.   
  క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై  ఫిబ్రవరిలో కేసు నమోదైంది. కాకాణి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గతంలో ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. మాజీ మంత్రి కాకాణి   కోసం పోలీసులు గాలిస్తున్నారు.  క్వార్జ్ కేసులో రెండు నెలలుగా కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూర్‌లో నెల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకాణి బంధువుల ఇళ్లు, ఫాంహౌజ్‌లలో గాలిస్తున్నారు. మరోవైపు క్వార్జ్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్వార్జ్ కేసులో మాజీ మంత్రి కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రజ అనే మహిళ అకౌంట్‌లోకి భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్స్‌ జరిగినట్లు గుర్తించారు.  ఆమె ఇంటికి కూడా పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అలాగే ఈ కేసులో 12 మందిని పోలీసులు గుర్తించారు. అందులో కాకాణి అల్లుడు కూడా ఉన్నారు. వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా.. వారు లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులు అంటించి వస్తున్నారు. రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చాక వారు స్పందించకపోతే వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  
ALSO ON TELUGUONE N E W S
Cast: Naveen Chandra, Reyaa Hari, Shashank, Abirami, Dileepan, Riythvika, Aadukalam Naren, Ravi Varma, Arjai, Kireeti Damaraju Crew:  Cinematography by Karthik Ashokan Music Direction by D.Imman Edited by Srikanth N.B Written & Directed by Lokkesh Ajjls Produced by Ajmal Khan, Reyaa Hari   Naveen Chandra has been starring in interesting films from time to time. The actor does leading roles and even supporting roles mixing them all up according to the script requirements. With his versatlity, he is able to deliver some memorable performances creating a good name for himself in Telugu Cinema. Now, his intense thriller Eleven released in theatres and let's discuss about it in detail.    Plot:  ACP Aravind (Naveen Chandra) keeps growing in stature as a police officer all over. On the other hand, another ACP Ranjith (Shashank) gets the serial killer case. The killer keeps burning the bodies without any evidence. Why is he doing so? Ranjith fails to get closer but still he gets severely injured in a car accident. Now, Aravind takes over the case and he has to solve the mystery behind these killings. He finds out that killer is going after twins. Why? Watch the movie to know more.   Analysis:  Naveen Chandra is good in his role. As a person who doesn't smile much and highly career-oriented Naveen did a very good job. His performance holds the key for the entire plot to work and he did justice. Reyaa Hari, also the producer, played dual role and she needs to get more training. Her character had the scope but she could not deliver what it needed. All others did okay and no one really could deliver anything special to write about.    The film director Lokesh Ajjls followed many template cliches in building the screenplay and narrative is flat throughout without the moments that really catch our attention. Even the story feels too jaded and outdated with call backs to films like Memories, Rakshasudu and few others. While Abirami character had much more potential, the makers did not really explore her character or dynamic with the main leads perfectly.    Also, the writing doesn't really go into the depth of the characters. Each and every frame feels like we have seen it before and doesn't really inspire to give our attention fully. The mystery has not been constructed well enough to grab our attention at all places. It feels like a mishmash of all the previous mystery and investigative thrillers assembled into one. While the orginality and novelty is the biggest asset of such thrillers, Eleven feels too convoluted.    Rather than trying to connect us with the characters, director handles the narrative superficially and hence, the mystery seems predictable and twists never create the interest that the makers wanted to. On the whole, Eleven could have been a much better thriller with more onus of screenplay and script writing.    Bottomline:  Eleven falls short of being a good thriller.    Rating: 2/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them.  
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కెరీర్ లోనే ప్రెస్టేజియస్ట్ మూవీగా 'పెద్ది'(Peddi)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చరణ్ ఈ మూవీలోపలు రకాల ఆటల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిగా చేస్తున్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది. మేకర్స్ ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్ లో చరణ్ క్రికెట్ ఆడినా కూడా చరణ్ చెప్పిన డైలాగ్స్ తో రక  రకాల ఆటలు ఆడతాడని అనుకుంటున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్(Janhvi Kapoor)జత కడుతుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(Sivarajkumar)కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ మరియు వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా బుచ్చిబాబు(Buchibabu)దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా బుచ్చిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఉత్తరాంధ్ర నేపథ్యంలో పెద్ది తెరకెక్కుతుంది. ఈ సినిమాలో క్రికెట్ కేవలం బ్యాక్ డ్రాప్ మాత్రమే. ఎమోషన్ చాలా బలంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు క్రితమే ఈ కథని సిద్ధం చేసుకున్నాను. చరణ్ గారు ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతు లుక్ విషయంలో ఎన్నో జాగ్రతలు తీసుకుంటున్నారు. రెహ్మాన్ గారు సైతం ఒక్కో సాంగ్ కి 20 నుంచి 30 దాకా ట్యూన్స్ ఇస్తున్నారు.  చిన్నప్పట్నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. దీంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని ఎంతో ఆశగా ఉండేది. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తు లైఫ్ లో సెటిల్ అయితే చూడాలనేది వాళ్ళ కోరిక. అందుకే హైదరాబాద్ లో ఎంబిఏ కోసం చేరాను. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా క్లాస్ లు వినేవాడిని. ఆ తర్వాత నా అభిరుచిపై దృష్టి పెట్టి సుకుమార్ వద్ద 100 %లవ్, ఆర్య 2 , రంగస్థలం చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసానని చెప్పుకొచ్చాడు. బుచ్చిబాబు ఫస్ట్ మూవీ 'ఉప్పెన' అనే విషయం తెలిసిందే.          
మూవీ: జాలీ ఓ జింఖానా నటీనటులు: ప్రభుదేవా, మడోన్నా సెబాస్టియన్, పూజిత పొన్నాడా, అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్ లీ, రోబో శంకర్, జాన్ విజయ్, సాయిధీనా, యాషికా ఆనంద్ తదితరులు ఎడిటింగ్:  రమర్ సినిమాటోగ్రఫీ: ఎమ్ సి గణేశ్ చంద్ర మ్యూజిక్: అశ్విన్ వినయగమూర్తి నిర్మాతలు: రాజేంద్ర ఎమ్ రాజన్ రచన, దర్శకత్వం: శక్తి చిదంబరం ఓటీటీ: ఆహా ప్రభుదేవా ప్రధాన పాత్రలో మడోన్నా సెబాస్టియన్, పూజిత పొన్నాడ, అభిరామి, యోగిబాబు కలిసి నటించిన 'జాలీ ఓ జింఖానా' గతేడాది డిసెంబర్ లో తమిళంలో రిలీజైంది. నిన్నటి నుండి ప్రముఖ ఓటీటీ 'ఆహా' లో రిలీజైంది.  కథ:  చెన్నైలోని ఓ చర్చికి భవాని వెళ్తుంది. అక్కడి ఫాదర్ కి తను చేసిన తప్పుకి ప్రయాశ్చితం కావాలని కోరుకుంటుంది. తంగసామి తన కూతురు చెల్లమ్మ, మనవరాళ్ళైన భవాని, శివాని, యాజినీతో ఓ హోటల్ నడుపుతుంటాడు. తెన్ కాశీకి చెందిన రాజకీయవేత్త అడైక్కళరాజ్తో హోటల్లో లో జరిగిన ఓ ఘర్షణ వల్ల తంగసామి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవుతాడు. తంగసామి ఆపరేషన్ కోసం దాదాపు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని భవాని అక్కచెల్లెళ్లతో డాక్టర్ చెప్తాడు. అనూహ్యంగా ఆ డబ్బు భవాని అకౌంట్లో డిపాజిట్ అయి, ఆపరేషన్ ఏ అవరోధం లేకుండా జరిగిపోతుంది. కానీ ఆ డబ్బు కోసం ఓ గ్యాంగ్ వీళ్ల వెంటపడి వేధిస్తూ ఉంటుంది. మరో పక్క ఇదే అడైక్కళరాజ్ ఓ కేస్ విషయమై న్యాయవాది పూన్జుండ్రన్తో పెద్ద విరోధం పెట్టుకొని ఉంటాడు. ఇంకో పక్క ఈ విషయం తెలిసిన తంగసామి హోటల్ విషయమై పూన్జుండ్రన్ని కలవమని భవానీ వాళ్లకి చెప్తాడు. భవానీ వాళ్ళు న్యాయవాదిని కలిసే సమయంలో అతను చనిపోయి ఓ హోటల్ గదిలో పడి ఉంటాడు. పూన్జుండ్రన్ని చంపిందెవరు? అతని బాడీతో భవాని అక్కచెల్లెళ్ళు తమ సమస్యని పరిష్కరించుకున్నారా లేదా అనేది మిగతా కథ. విశ్లేషణ: దర్శకుడు సినిమా ప్రారంభంలోనే ఓ హింట్ ఇచ్చాడు. లాజిక్స్ ఏమీ పట్టించుకోకుండా కడుపుబ్బా నవ్వుకోవాలంటే మా సినిమా చూడండి అని చెప్పాడు. అన్నట్టుగానే కథ సాగుతుంది. హీరో ఎలా చనిపోయాడో, ఎవరు చంపారో తెలియదు.. మరోవైపు భవాని తన చెల్లెళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తూ పడే ఇబ్బందులు, మధ్యలో ఎదురయ్యే పాత్రలు కాస్త నవ్వు తెప్పించేలా ఉన్నాయి. రఘుబాబు, యోగిబాబు పాత్రలని సరిగ్గా వాడుకుంటే బాగుండేది. ఇక సినిమా చివర్లో అసలెందుకు ఆ ఇరవై లక్షలు అకౌంట్ లో ఉన్నాయో చెప్తూ కాస్త డ్రాగ్ చేశారు. అది కాస్త మైనస్ అనే చెప్పాలి. సినిమా చూస్తున్నంతవరకు నవ్వుకోవాలని దర్శకుడు అనుకున్నాడో ఏమో కానీ ఆడియన్స్ కి మాత్రం నరకమే. క్రింజ్ కామెడీలా అనిపిస్తుంది. బలవంతంగా నవ్వు తెప్పించే సీన్లు చాలానే ఉన్నాయి. ఓ‌ ఇరవై ఏళ్ళ క్రితమే కమల్ హసన్, రమ్యకృష్ణ కలిసి పంచతంత్రం సినిమాలో ఈ కామెడీని పండించారు. అయితే ఇది దానిలో సగం కూడా లేదు. పైగా కామెడీ సీన్లు తేలిపోయాయి. ఇక పాటలైతే అంతగా సెట్ గా కాలేదు. అసలు బిజిఎమ్ ఎక్కడ ఇంపాక్ట్ చూపించలేదు. ఇండివిడ్యువల్ గా ఒక్కో క్యారెక్టర్ బాగనే చేసిన కథపరంగా సెట్ అవ్వలేదు. కామెడీ అని ల్యాగ్ చేసి చుక్కలు చూపించారు. సినిమా మొత్తంలో ఇది బాగుంది అనేలా ఏదీ లేదు. అడల్ట్ సీన్లు లేవు. ‌అశ్లీల పదాలు వాడలేదు. ఫ్యామిలీ కలిసి చూసేలా ఉంది. రమర్ ఎడిటింగ్ ఒకే.‌ ఎమ్ సి  గణేశ్ చంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. అశ్విన్ వినయగమూర్తి మ్యూజిక్ అంతగా సెట్ అవ్వలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు:  ఫాదర్ గా యోగిబాబు, పూన్జుండ్రన్ గా ప్రభుదేవా, భవానీగా మడోన్నా సెబాస్టియన్ అభిరామి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా : జస్ట్ ఒకే విత్ క్రింజ్ కామెడీ రేటింగ్ : 2.25 / 5  ✍️. దాసరి మల్లేష్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ హరిహరవీరమల్లు(Hari Hara veeramallu).ఫస్ట్ టైం పవన్ చేస్తున్న చారిత్రాత్మక మూవీ కావడం, పైగా పోరాట యోధుడుగా కనిపిస్తుండటంతో, ఎప్పుడెప్పుడు వీరమల్లు థియేటర్స్ లోకి వస్తుందా అని  ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తు వస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్ ప్రకటించి పోస్ట్ పోన్ చెయ్యడంతో వాళ్ళల్లో ఒకింత నిరుత్సాహం కూడా ఏర్పడింది. ఇప్పుడు వాళ్ల నిరుత్సాహాన్ని పోగొట్టడానికి వీరమల్లు జూన్ 12 న థియేటర్స్ లోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు రీసెంట్ గా చిత్ర యూనిట్  అధికార ప్రకటన  చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ లోసరికొత్త జోష్ వచ్చినట్లయింది. పవన్ సరసన నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా చేస్తుండగా, మొగల్ చక్రవర్తి ఔరంగ జేబు క్యారక్టర్ ని బాబీడియోల్ పోషిస్తున్నాడు. మిగతా ఇతర పాత్రల్లో సత్యరాజ్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, జిష్ణుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, నాజర్, సచిన్ కెడ్కర్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.   పవన్ కి  ఖుషి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని అందించిన మెగా ప్రొడ్యూసర్ ఏఎంరత్నం వీరమల్లుని అత్యంత భారీ వ్యయంతో  నిర్మించాడు. క్రిష్(Krish)జ్యోతికృష్ణ(Jyothi Krishna) ద్వయం దర్శకత్వం వహించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, సాంగ్స్  హైలెట్ గా నిలిచాయి.ట్రైలర్ కూడా అతి త్వరలోనే రిలీజ్ కానుంది. సుమారు 200 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించాడు.      
మంచు విష్ణు(Vishnu)మోహన్ బాబు(Mohanbabu)ల ప్రెస్టేజియస్ట్ మూవీ కన్నప్ప(kannappa). పరమేశ్వరుడి' పరమ భక్తుడైన 'కన్నప్ప' జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రభాస్ (prabhas)మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి మేటి నటులు కీలక పాత్రలు పోషిస్తుండంతో ఈ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. కన్నప్ప భార్యగా ప్రీతి ముకుందన్ చేస్తుండగా మహాభారతాన్ని తెరకెక్కించిన  ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar singh)దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. జూన్ 27 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక మంచు మోహన్ బాబుకి చెందిన ఎంబియు(మోహన్ బాబు యూనివర్సిటీ) బాధ్యతల్ని విష్ణు చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ యూనివర్సిటీ ద్వారా ఇండియాకి ఫారిన్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకు వచ్చేందుకు విష్ణు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తు వస్తున్నాడు. ఈ క్రమంలో 'పెన్ యూనివర్సిటీతో ఎంబీయూ టై అప్ అయ్యింది. ఈ విషయాన్నీ 'ఎక్స్' వేదికగా తెలియచేసిన విష్ణు 'ఇండియాలో ఫారిన్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకురాబోతోన్నాం,పెన్ యూనివర్సిటీతో ఎంబీయూ టై అప్ అయింది.. ఇది ఇండియాలోనే మొదటి సారి, చరిత్ర సృష్టించామని ట్వీట్ వేశాడు.      
  యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న 'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. (War 2 Teaser)   వార్-2 షూటింగ్ దాదాపు పూర్తయింది. కానీ ఇంతవరకు ఈ సినిమా నుంచి ఒక్క అధికారిక పోస్టర్ కూడా రాలేదు. దీంతో వార్-2 అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న టీజర్ విడుదల కానుందని న్యూస్ వినిపించడంతో.. ఆయన ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.    ఎట్టకేలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందింది. మే 20న వార్-2 నుంచి ఊహించని సర్ ప్రైజ్ రాబోతుందని హృతిక్ రోషన్ ట్వీట్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.   ఎన్టీఆర్ బర్త్ డేకి వార్-2 తో పాటు పలు అప్డేట్లు వచ్చే అవకాశముంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న 'డ్రాగన్' గ్లింప్స్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే 'దేవర-2' అప్డేట్ రానుంది. వీటితో పాటు దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్ గా రూపొందనున్న 'మేడ్ ఇన్ ఇండియా', నెల్సన్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ లు వచ్చినా ఆశ్చర్యంలేదు.  
తెలుగు చిత్ర పరిశమ్రలో నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోగా కొనసాగుతు వస్తున్న చిరంజీవి(Chiranjeevi)తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అశేష అభిమానులని సంపాదించుకున్నాడు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు వంటి వాటిని నిర్వహిస్తు పలువురికి ఆదర్శంగా కూడా నిలిచాడు. దీంతో సినీ,సామజిక సేవలకి  గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్(Padma Bhushan)పద్మవిభూషణ్(Padma Vibhushan)వంటి ప్రతిష్టాత్మక అవార్డులతో గౌరవించింది.  రీసెంట్ గా చిరంజీవి పేరుపై ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లోని రాజమండ్రి(Rajahmundry)లో ఉన్న కంబాల చెరువు జంక్షన్ వద్ద  డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి పార్క్(Dr Padmavibhushan Chiranjeevi)అనే పేరుతో ఒక పార్క్ ఏర్పాటయింది. బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు విగ్రహంతో పాటు, ఆయనతో పాటు స్వతంత్ర పోరాటంలో పాల్గొని అమరులైన సీతారామరాజు అనుచరుల విగ్రహాలు కూడా పార్క్ లో ప్రతిష్ఠించారు. పార్క్ ని ప్రారంభించిన రాజమండ్రి సిటీ ఎం ఎల్ ఏ ఆదిరెడ్డి శ్రీనివాస్(Adireddy Srinivas)మాట్లాడుతు కేంద్ర మంత్రి గా చిరంజీవి గారు ఉన్నప్పుడే ఈ పార్క్ ని ప్రారంభించాల్సింది. కానీ అప్పుడు కుదరలేదు. అప్పట్నుంచి ఆయన అభిమానులే పార్క్ బాగోగులు చూసుకుంటున్నారు. ఇప్పుడు 'రుడా' చైర్మన్ బొడ్డు వెంకట్రామయ్య చౌదరి సహాయం తీసుకుని పద్మ విభూషణ్  చిరంజీవి గారి పేరుపై కోటి ఇరవై ఐదు లక్షలతో పార్క్ ని నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు.      చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర(Vishwambhara)అనే మూవీతో పాటు సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకతంలో ఒక మూవీ చేస్తున్నాడు. వీటిల్లో 'విశ్వంభర' మొదటగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.        
  జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫోకస్ బాలీవుడ్ మీదకి షిఫ్ట్ అయిందా? అయితే పాన్ ఇండియా మూవీ లేదంటే హిందీ సినిమా చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడా? ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాటలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది.   యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న 'వార్-2'తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే.. ఎన్టీఆర్ కోసం పలు హిందీ ప్రాజెక్ట్ లు క్యూ కట్టినట్లు తెలుస్తోంది.   యశ్ రాజ్ ఫిలిమ్స్ లో కేవలం 'వార్-2'నే కాకుండా.. పలు ప్రాజెక్ట్ లు చేసేలా లాంగ్ టర్మ్ డీల్ కుదుర్చుకున్నాడట ఎన్టీఆర్. ఇందులో భాగంగా ఒక సోలో ఫిల్మ్ చేయడంతో పాటు, స్పై యూనివర్స్ నుంచి వచ్చే ఇతర సినిమాల్లో భాగం కానున్నాడట.   ఇక భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్ గా రూపొందనున్న 'మేడ్‌ ఇన్‌ ఇండియా'లో ఎన్టీఆర్ నటించే అవకాశముంది. రాజమౌళి సమర్పణలో వరుణ్‌ గుప్తా, ఎస్‌.ఎస్‌.కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించి, ఇతర భాషల్లో విడుదల చేయనున్నారని అంటున్నారు.   అంతేకాదు, కరణ్ జోహార్ తో పాటు పలువురు నిర్మాతలు ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఈ లెక్కన ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.   ఎన్టీఆర్ తెలుగులో చేస్తున్న పాన్ ఇండియా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఆ తర్వాత 'దేవర-2'తో పాటు, నెల్సన్ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. ఒకవేళ వార్-2 తర్వాత ఎన్టీఆర్ చేయబోయే  హిందీ ప్రాజెక్ట్ ఏదైనా ఫైనల్ అయితే.. ఈ సినిమాల ఆర్డర్ మారే అవకాశముంది.  
కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ శ్రీవిష్ణు(Sri Vishnu)హీరోగా గీతా ఆర్ట్స్ సమర్పణలో అల్లు అరవింద్(Allu Aravind)నిర్మించిన చిత్రం 'సింగిల్'(Single). కేతిక శర్మ(Kethika Sharma)ఇవానా(Ivana)హీరోయిన్లుగా చెయ్యగా, మే 9 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. తొలి షో నుంచే హిట్ టాక్ ని తెచ్చుకుని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా విజయాపదాన దూసుకుపోతుంది. దీంతో వరల్డ్ వైడ్ గా సింగిల్ మూవీ ఫస్ట్ వీక్ కి 25 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ కలెక్షన్స్ మరింత పెరిగి  శ్రీ విష్ణు కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించే మూవీగా 'సింగిల్' నిలవబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక చిత్ర యూనిట్ మూవీని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్తు విజయయాత్ర చేస్తుంది. అందులో భాగంగా రీసెంట్ గా విజయవాడ వెళ్లిన చిత్ర బృందం సినిమాల్లోని సీన్స్ ని లైవ్ లో ప్రేక్షకులతో  పంచుకుంటు వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ విజయయాత్రలో శ్రీవిష్ణు, కేతికరశర్మ, ఇవానా,తో పాటు ప్రధాన పాత్ర పోషించిన వెన్నెల కిషోర్ పాల్గొన్నారు . రాజేంద్రప్రసాద్, వి టి వి గణేష్, ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర పాత్రల్లో కనపడగా విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు. విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి, భానుప్రతాప కూడా అరవింద్ తో పాటు నిర్మాతలుగా వ్యవహరించగా కార్తీక్ రాజు(caarthick Raju)దర్శకత్వం వహించాడు.  
  మూవీ: మరణ మాస్ నటీనటులు: బాసిల్ జోసెఫ్, అనిష్మా అనిల్ కుమార్, సైజు సన్నీ, బాబు ఆంటోని, రాజేశ్ మాధవన్ తదితరులు ఎడిటింగ్:  చమన్ చాకో సినిమాటోగ్రఫీ: నీరజ్ రవి మ్యూజిక్: జేకే నిర్మాతలు: టొవినో థామస్ దర్శకత్వం: శివప్రసాద్ ఓటీటీ: సోనిలివ్ కథ: కేరళలోని ఓ గ్రామంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. చీకటిపడితే చాలు, బయటికి రావడానికి జనాలు భయపడుతూ ఉంటారు. కిల్లర్ హత్య చేసిన అనంతరం శవాల నోట్లో 'అరటిపండు' పెడుతూ ఉంటాడు. దాంతో అందరూ అతనిని 'బనానా కిల్లర్' అని పిలుచుకుంటూ ఉంటారు. అదే గ్రామానికి చెందిన ల్యూక్ (బాసిల్) జెస్సీ (అనీష్మా)ని లవ్ చేస్తూ ఉంటాడు. ల్యూక్ లుక్ .. స్టైల్ కాస్త డిఫరెంట్ గా ఉండటంతో, అతనే కిల్లర్ అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది.  బనానా కిల్లర్' కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ (ఆంటోని) రంగంలోకి దిగుతాడు. ఒకరోజు జెస్సీ కోసం ల్యూక్ బస్సు ఎక్కుతాడు. అదే బస్ లో కొంతమంది జాయిన్ అవుతారు. అసలు సైకో కిల్లర్ ఎవరు? ల్యూక్, జెస్సీ మళ్ళీ కలుస్తారా లేదా అనేది మిగతా కథ. విశ్లేషణ: సినిమా పేరు 'మరణ మాస్'. డార్క్ కామెడీ అని చెప్పారు కానీ మాస్ కామెడీ లేదు సినిమా పూర్తిగా చూస్తే మరణమే. జోక్స్ సరిగ్గా పేలలేదు. అటో ఎటో గాల్లోకి ఎగిరిపోయినట్టున్నాయి జోక్స్. అందుకే కథపై పెద్దగా ఆసక్తి ఉండదు.  సైకో కిల్లర్ అనగానే కాస్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. కానీ ఇందులో అదే లోపించింది. డార్క్ కామెడీని దృష్టిలో పెట్టుకున్న దర్శకుడు అసలు మెయిన్ పాయింట్ ని వదిలేశాడు. సినిమాలో ఏ పాత్రలో అంత బలమైన ఇంపాక్ట్ కనపడదు‌ దానికి తోడు డ్రాగ్ చేసిన స్టోరీ.. ఫస్ట్ అరగంట చూసేసరికే గంట గడిచిన ఫీల్ కలుగుతుంది. ప్రొసీడింగ్స్ అంత దారుణంగా ఉంటాయి మరి. అడల్ట్ సీన్లు లేవు. అశ్లీల పదాలు లేవు. కానీ బాసిల్ పాత్రను ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసి ఉంటే బాగుండేది. అలాగే బస్సు డ్రైవర్, కండక్టర్ పాత్రల వైపు నుంచి కథను టైట్ చేయవలసింది. ఇక పోలీస్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ పాత్రను కూడా పెద్దగా ఉపయోగించుకోలేదు. ఆయన కుక్క వైపు నుంచి కూడా కామెడీ ట్రాక్ ను కూడా సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు. సినిమా మొత్తం ఎంగేజింగ్ థ్రిల్లర్ గా ఉండాల్సింది పోయి.. నీరసం తెప్పించేలా ఉంటుంది.  నటీనటుల పనితీరు : ల్యూక్ పాత్రలో బాసిల్ జోసెఫ్, జెస్సీ పాత్రలో అనిష్మా , అజయ్ రామచంద్రన్ పాత్రలో ఆంటోని తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా : జస్ట్ ఒకే కామెడీ థ్రిల్లర్ బట్ నాట్ ఎంగేజింగ్. రేటింగ్:  2.25/ 5 ✍️. దాసరి మల్లేష్
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
   ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం. చాలా మంది కొన్ని రోజుల రిలేషన్ లో ఉన్న  తర్వాత విసుగు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చేసే కొన్ని తప్పుల వల్ల ఇద్దరి మధ్య  సంబంధం బలహీనపడుతుంది. ఈ తప్పుల వల్ల  రిలేషన్  లోతును,  దాని బాధ్యతలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రేమ అయినా, పెళ్లి అయినా, స్నేహం అయినా.. ఇలా ఏ రిలేషన్ అయినా సరే.. కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.  ఆ నియమాలను తెలుసుకోకపోతే ఎంత మందితో కొత్తగా రిలేషన్ మొదలుపెట్టినా సరే.. అది తొందరగా బ్రేకప్ అవుతుంది.  ముఖ్యంగా ప్రేమికులు, భార్యాభర్తలు వారి రిలేషన్ లో ఈ క్రింది విషయాలను తప్పనిసరిగా తెలుసుకుని ఆచరించాలి. నమ్మకం.. సంబంధంలో నమ్మకం లేకపోతే దాని పునాది బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో  భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకూడదు. ఇద్దరి  మధ్య ఏదైనా అపార్థం ఉంటే ఇద్దరూ కలిసి కూర్చుని దాని గురించి మాట్లాడి, అపార్థాన్ని తొలగించుకోవాలి. ఏ సంబంధంలోనైనా ఓపెన్ గా మాట్లాడటం,  సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఇద్దరి మధ్య  సమన్వయం కూడా పెరుగుతుంది. స్వేచ్ఛ.. ప్రతి సంబంధంలో ఎదుటి వ్యక్తికి స్పేస్  ఇవ్వడం చాలా ముఖ్యం. చాలా మంది తమ హక్కులను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు, ఎదుటి వారి స్వేచ్ఛను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా సంబంధం బలహీనపడటం ప్రారంభమవుతుంది. అందుకే భార్యాభర్తలు తమ భాగస్వాములకు  స్పేస్ ఇవ్వాలి. వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు వారికి ఉందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది చేయకపోతే భాగస్వామి సంబంధంలో ఊపిరాడకుండా పోవడం ప్రారంభిస్తాడు. దీని వల్ల బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. కమ్యూనికేషన్.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు  సంభాషించకపోతే, సంభాషణలో పారదర్శకత ఉండదు. మాట్లాడకపోవడం వల్ల ఇద్దరి మధ్య  అపార్థాలు ఏర్పడతాయి. దీని కారణంగా సంబంధం  పునాది బలహీనపడటం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడాలి. శ్రద్ద.. చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఏం తింటావని అడగడం, జాగ్రత్తగా ఉండమని చెప్పడం, నచ్చిన చోటకు వెళ్లడం, గొడవను పెద్దవి చేసుకోకుండా ఒకరి బాధను మరొకరు పంచుకోవడం వంటివి చేస్తుంటే భాగస్వామికి  ఖచ్చితంగా నచ్చుతుంది. వారు ఎల్లప్పుడూ బంధంలో ఉండాలని అనుకుంటారు.  ఏవైనా గొడవలు జరిగినా వాటిని పరిష్కరించుకుని బంధం నిలబెట్టుకోవాలి అనుకుంటారు. పోలిక.. భార్యాభర్తలు ఇద్దరూ ఎవరూ ఎవరిని ఇతరులతో పోల్చకూడదు.  బయట సంబంధంలో ఉన్నవారిని,  ఇతరులను చూసి వాళ్లు బాగున్నారు, వాళ్లు మంచివారు,  నువ్వు చెడ్డ.. ఇలాంటి కోణంలో ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇలా పోలిస్తే అది వారి మనసును బాధపెడుతుంది.  తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చిన్న చూపు చూస్తున్నారని భావిస్తారు.  దీనివల్ల బంధంలో అప్యాయత తగ్గుతుంది.                                                   *రూపశ్రీ.  
  నేటి కాలంలో విడాకుల కేసులు పెరిగినప్పటికీ, విడాకుల కొత్త పోకడలు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఈ కొత్త విడాకుల నిబంధనలలో గ్రే విడాకులు, స్లీవ్ విడాకులు, సిల్వర్ విడాకులు మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజుల్లో  నిశ్శబ్ద విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి. సైలెంట్ డైవోర్స్ అంటే నిశ్శబ్ద విడాకులు. ఈ రకమైన విడాకులలో చాలా సార్లు దంపతులకు తమ సంబంధం నిశ్శబ్ద విడాకుల వైపు కదులుతోందని లేదా వారు ఇప్పటికే సైలెంట్ డైవర్స్   తీసుకున్నారని వారి కూడా  తెలియదు. తమ మధ్య సైలెంట్ గా విడాకులు  జరిగాయని ఆ జంట గ్రహించినప్పుడు వారు చట్టబద్ధంగా విడిపోతారు. ఇది విడాకుల చట్టపరమైన ప్రక్రియకు ముందు దశ కావచ్చని ఫ్యామిలీ కౌన్సిలర్లు అంటున్నారు. సైలెంట్ డైవర్స్ అంటే.. సైలెంట్ డైవర్స్  అంటే భార్యాభర్తలు చట్టబద్ధంగా కలిసి ఉండే వైవాహిక పరిస్థితి. అంటే విడాకులు తీసుకోలేదు కానీ భావోద్వేగ, మానసిక,  కమ్యూనికేషన్ స్థాయిలో ఒకరి నుండి ఒకరు పూర్తిగా విడిపోతారు. ఇద్దరూ ఒకే ఇంట్లో  నివసిస్తుంటారు కానీ వారి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదా సంభాషణ ఉండదు. వారి మధ్య భౌతిక దూరం కూడా ఉండవచ్చు. ఇది బంధం నిశ్శబ్దంగా అదృశ్యమవడాన్ని సూచిస్తుంది. సైలెంట్ డైవోర్స్ లో ఇద్దరి మధ్య సంబంధం సజీవంగా ఉంటుంది.  కానీ బంధంలో ఆత్మ,  జంట మధ్య పరస్పర అనుబంధం చనిపోతుంది. సైలెంట్ డైవర్స్ సిగ్నల్స్ ఇవే.. భార్యాభర్తల మధ్య బంధం సైలెంట్ డైవోర్స్ వైపు వెళుతోందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి.  వాటి ద్వారా దీన్ని గుర్తించి జాగ్రత్త వడవచ్చు. సంభాషణ ఉండదు.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు సాధారణ విషయాలే కాదు.. ఒకరితో ఒకరు ముఖ్యమైన విషయాల గురించి కూడా మాట్లాడుకోరు. వారి మధ్య దాదాపుగా కమ్యూనికేషన్ ఉండదు. రోజువారీ విషయాలు కేవలం లాంఛనాలుగా జరుగుతూ ఉంటాయి. ఎమోషనల్ డిస్టెన్స్.. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు పట్టించుకోరు. ఇద్దరి మధ్య ఎమోషన్ డిస్టెన్స్ ఏర్పడుతుంది. ఒకరి సుఖదుఃఖాలను ఒకరు పంచుకోరు.  ఒకరి సమస్యలను లేదా ఆలోచనలను ఒకరు పట్టించుకోరు. శారీరక దూరం.. సైలెంట్ డైవర్స్ దిశగా వేళ్లే భార్యాభర్తల బంధంలో  వారి శారీరక  సంబంధాన్ని కోల్పోతారు. కలిసి కూర్చోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, కౌగిలించుకోవడం,  కలిసి పడుకోవడం వంటివి దూరం అవుతాయి.   గదిని పంచుకోవచ్చు కానీ రూమ్‌మేట్ లాగా ఎవరికి వారు ఉంటారు. సమయం ఇవ్వకపోవడం.. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం ఇవ్వనప్పుడు సమయాన్ని కలిసి  గడపాలని అనుకోరు . కలిసి తినాలనే కోరిక, బయటకు వెళ్లాలనే కోరిక లేదా సెలవు దినాల్లో కలిసి సమయం గడపాలనే కోరిక తగ్గినప్పుడు వారు సైలెంట్ డైవోర్స్ వైపు  ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఆసక్తి.. సాధారణంగా భార్యాభర్తలు  ఒకరి జీవితం గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటారు. వారు గొడవ పడినా, తమ భాగస్వామి రోజు ఎలా గడిచిందో, ఏం చేశారో, తమ స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసుకోవడంలో   ఆసక్తి కలిగి ఉంటారు. కానీ వారి మధ్య అలాంటి సాధారణ విషయాలు కూడా  అదృశ్యమైనప్పుడు, వారి మధ్య సైలెంట్ డైవర్స్ పరిస్థితి ఏర్పడుతుంది. గొడవలు.. కొన్నిసార్లు వాదనలు లేదా విభేదాలు లేకపోవడం మంచిదని అనిపించవచ్చు. కానీ వాటి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదని కూడా ఇది సూచిస్తుంది. వారికి ఒకరి నుండి ఒకరు ఎటువంటి ఆశలు ఉండవు. కాబట్టి వారు ఒకరితో ఒకరు గొడవ పడటానికి కూడా ఇష్టపడరు. సైలెంట్ డైవోర్స్ గురించి కొన్ని నిజాలు.. భార్యాభర్తలు చాలా మంది తమ పిల్లలను పెంచడానికి మాత్రమే కలిసి ఉంటారు. వారు భార్యాభర్తలుగా తమ సంబంధంలో సంతోషంగా లేరు కానీ తమ పిల్లల కోసం చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా ఉంటారు విడాకులు సమాజంలో అవమానానికి కారణమవుతున్నాయి. సామాజిక కళంకం, కుటుంబ ఒత్తిడి,  విమర్శల భయాన్ని నివారించడానికి, జంటలు విడాకులు తీసుకోరు,  అందుకే ఇద్దరి మధ్య సైలెంట్ వాతావరణం ఏర్పడుతుంది. దీన్నే సైలెంట్ డైవోర్స్ అంటారు. భర్తలు డైవోర్స్ వల్ల ఆర్థికంగా లాస్ అవుతారు. దీని వల్ల విడాకులు ఇవ్వకుండా  ఆర్థిక లక్ష్యాల  కోసం రాజీగా  సైలెంట్ డైవోర్స్ ఎంచుకుంటారు. బంధంలో ప్రేమ, గౌరవం,  అవగాహన కాలక్రమేణా ముగిసినప్పుడు ప్రజలు బాధ్యతల కోసం మాత్రమే కలిసి ఉంటారు.                                         *రూపశ్రీ.  
వివాహం ఇద్దరు వ్యక్తుల జీవితాలను మార్చే సంఘటన.  ఇది జీవితంలో చాలా ముఖ్యమైన దశ.  వివాహం తరువాత సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలి అంటే  మగవాళ్లు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ఇంతకీ అవేంటో ఎందుకు చేయకూడదో తెలుసుకుంటే.. వివాహం తర్వాత పురుషులు చేయకూడని పనులు.. వివాహం అయిన మగవాళ్లు ఎక్కడికైనా వెళ్ళేముందు ఆలోచించాలి.  తొందర పడి సొంతంగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకోవడం వల్ల అతని జీవితంలో నష్టపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఇతరుల ఉద్దేశాలు ఏంటో అర్థం చేసుకోకుండా ఇతరులతో వెళ్లడం చాలా నష్టాలకు దారి తీస్తుంది. వివాహం అయిన తరువాత మగవాళ్లు బయటి మహిళల పట్ల ఆకర్షితులు అవుతుంటారు. ఇలా ఆకర్షితులు అయ్యే మగవాళ్లకు వారి వైవాహిక జీవితంలో చాలా ప్రమాదాలు ఎదురవుతాయి.  ఇది అవతలి వ్యక్తి మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది.  అలాంటి ప్రవర్తన వల్ల మొత్తం కుటుంబం అంతా ప్రభావితమవుతుంది. మనిషికి సంతృప్తి అనేది లభించడం చాలా కష్టం.  ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని అనుకుంటూనే ఉంటాడు. వివాహం అయిన మగవాళ్లు ఉన్న వాటితో తృప్తి చెందలేకపోతే  ఆ వ్యక్తి అశాంతికి లోనవుతాడు. ఈ అసంతృప్తి వైవాహిక జీవితంలో కూడా చాలా నష్టాలు,  సమస్యలకు కారణం అవుతుంది. నిర్ణయాలు అందరూ తీసుకుంటారు. కానీ వివాహం అయిన మగవాళ్లు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాల్సి ఉంటుంది.  భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టపోతారు. అలాగే నిర్ణయాలు తీసుకునే ముందు భార్యకు తప్పకుండా చెప్పాలి.                                 *రూపశ్రీ.  
  బంగాళదుంప చాలా మందికి ఇష్టమైన దుంప కూరగాయ.  పేరుకు ఇది కూరగాయ కానీ ఇది  అన్ని రకాలుగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. కూరల్లో అయినా, బజ్జీలలో అయినా, వేపుళ్లలో అయినా,  చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి నోరూరించే తినుబండారాలలో అయినా బంగాళదుంప చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఏ కూర చేస్తున్నా సరే..అందులో బంగాళదుంప ముక్కలు జోడిస్తే కూరలకు రుచి రెట్టింపు అవుతుంది. ఎంతో రుచిగా ఉండే బంగాళదుంపను తినడానికి చాలా మంది చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే బంగాళదుంపలను ఎడా పెడా తింటే మాత్రం కొంపలు ముంచుతుందట.  ఇంతకీ బంగాళదుంపలు ఆరోగ్యానికి చేసే చేటు ఏంటో తెలుసుకుంటే.. ఊబకాయం.. బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారట.  బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.  ఇవి అదనపు కేలరీలుగా పొట్టలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. దీని కారణంగా బరువు ఈజీగా పెరుగుతారు. రక్తపోటు.. రక్తపోటు లేదా బీపీ ఇప్పట్లో చాలామందికి వస్తున్న సమస్య.  చిన్న వయసులోనే బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఉంటున్నారు.  ఇలాంటి వారు బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోకూడదట.  బంగాళదుంపలు  బీపీ సమస్యను మరింత పెంచుతాయట. ఆర్థరైటిస్.. ఆర్థరైటిస్ సమస్య చలికాలంలో చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సాధారణ రోజులలో కూడా ఆర్థరైటిస్ సమస్య కారణంగా  ఎముకలు, కీళ్ల సమస్యలు పెరుగుతాయి.  బంగాళదుంపలు తింటే ఆర్థరైటిస్ సమస్య మరింత తీవ్రం అవుతుంది.  ఇందులో కార్బోహైడ్రేట్లు ఆర్థరైటిస్ నొప్పిని పెంచుతాయి. జీర్ణసమస్యలు.. బంగాళదుంపలలో పిండి పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది గ్యాస్, ఉబ్బరం,  మలబద్దకం వంటి సమస్యలు సృష్టిస్తుంది.  బంగాళదుంపను అతిగా తింటే పై సమస్యలు అధికం అవుతాయి. మధుమేహం.. మధుమేహం ఉన్నవారికి నిషేధించిన ఆహారాలలో బంగాళదుంప కూడా ఒకటి.  బంగాళదుంపలు తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య మరింత పెరుగుతుంది.  బంగాళదుంపలలో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి. కంటి సమస్యలు.. బంగాళదుంపలలో సోలనిన్ అనే రసాయనం ఉంటుంది.  ఇది కంటి సమస్యలను కలిగిస్తుంది.  బంగాళదుంపలను ఎక్కువగా తీసుకునేవారు తొందరగా కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  పసుపు,  తేనె భారతీయ వంటగదిలో రెండు ప్రధాన పదార్థాలు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. పసుపులో  కుర్కుమిన్ ఉంటుంది, అలాగే తేనెలో  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పసుపును శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇది కీళ్ల నొప్పులు , చర్మ వ్యాధులు,  జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది . సహజ తీపి, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన తేనె గొంతు నొప్పి, దగ్గు,  గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. పసుపు మరియు తేనె కలయిక ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దానిని తీసుకునే ముందు సరైన మోతాదు,  దాని దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. దీని గురించి తెలుసుకుంటే.. వాపును తగ్గించడంలో సహాయపడతాయి.. పసుపులో ఉండే కర్కుమిన్,  తేనెలోని యాంటీఆక్సిడెంట్లు కలిసి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కలయిక కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్,  ఇతర శోథ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. రోగనిరోధక శక్తి.. పసుపు,  తేనె రెండూ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ కలయిక ముఖ్యంగా సీజన్ మారే సమయంలో  ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియ.. పసుపు,  తేనె మిశ్రమం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం,  ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే అధిక వినియోగాన్ని నివారించాలి. చర్మ ఆరోగ్యం.. మొటిమలు, మచ్చలు,  మంట వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి పసుపు,  తేనెను ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా తీసుకోవాలి..? పసుపు,  తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి, టీగా లేదా పాలతో కలిపి వివిధ రకాలుగా తీసుకోవచ్చు. అయితే, దాని పరిమాణం,  తీసుకునే సమయం వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి ఉండాలి. గర్భిణీ స్త్రీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు,  ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
నిమ్మకాయ చాలా పానీయాలలో ఉపయోగిస్తారు.  అటు వంటలలోనూ, ఇటు స్వీట్ల లోనూ, మరొక వైపు రిఫ్రెషింగ్ పానీయాలలోనూ నిమ్మకాయను ఉపయోగిస్తారు.  చాలామంది ఉదయాన్నే నీటిలో నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల శరీరంలో షుగర్ కూడా తగ్గుతుందని కొందరు అంటారు. ఈ కారణంగా చాలామంది షుగర్ పేషెంట్ లు నిమ్మరసం కలిపిన నీళ్లు తాగుతూ ఉంటారు.  అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల నిజంగానే శరీరంలో షుగర్ శాతం తగ్గుతుందా?  నిమ్మరసం నీరు శరీరంలో షుగర్ తగ్గించడంలో సహాయపడుతుందా? తెలుసుకుంటే.. నిమ్మరసాన్ని నీటిలో కలిపి తాగితే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి నిమ్మరసం కలిపిన నీరు రక్తంలో చక్కెరను తగ్గించదు, కానీ చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఈ రెండింటికి తేడా ఏంటని చాలా మంది అయోమయానికి గురవుతూ ఉంటారు. తీసుకునే ప్రతి ఆహారంలో ఉండే గ్లూకోజ్ పరిమాణాన్ని బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ను నిర్ణయిస్తారు.  అలాగే నిమ్మకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ను గమనిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుంది.  తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఆకస్మికంగా పెరగకుండా చేస్తాయి. నిమ్మకాయలో కరికే ఫైబర్ ఉంటుంది.  ఈ కరిగే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతూ రక్తంలో శోషించబడుతుంది.  తద్వారా  రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచడంలో సహాయపడుతుంది. సహాయపడుతుంది. అలాగే కొన్ని అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..  నిమ్మరసం కలిపిన నీరు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని చెబుతున్నాయి. నిమ్మకాయ నీరు హైడ్రేషన్ ను నిర్వహిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది.  ఈ కారణంగా నిమ్మరసాన్ని వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసానికి చక్కెర,  చక్కెర సంబంధిత పదార్థాలు జోడించడం వల్ల షుగర్ ఉన్నవారికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిమ్మరసంలో విటమిన్-సి ఉంటుంది.  ఇది వాపును, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.  రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ కారణంగానే కడుపు ఉబ్బరం, గ్యాస్,  అజీర్తి వంటివి చేసినప్పుడు నిమ్మరసం నీటిలో కాసింత జీలకర్ర పొడి కూడా కలిపి తాగమని చెబుతూ ఉంటారు. నిమ్మకాయ నీరు కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రించడంలో సహాయపడుతుంది.                                     *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..