వాస్తవ వేదిక.. ఇది కూటమి ప్రభుత్వం కాదు కుమ్మక్కు ప్రభుత్వం

Publish Date:Jan 9, 2026

Advertisement

దొంగలు దొంగలూ ఊళ్లు పంచుకున్న చందంగా ప్రస్తుత రాజకీయవ్యవస్థ తయారైంది. ఒకళ్లు చేసిన తప్పులను మరొకరు ప్రశ్నించకుండా, వ్యవస్థ లొసుగులను తమకు అనుగుణంగా మలచుకుంటూ ప్రజాధనాన్ని పంచుకుంటున్నట్లుగా రాజకీయ నాయకుల తీరు తరయారైందంటూ.. వాస్తవ వేదిక లో తెలుగువన్ ఎండీ రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ల చర్చా సారాంశం ఉంది. 
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో  గురువారం ప్రసారమైంది. ఆ చర్చలో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు సంగ్రహంగా.. 
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పాలనలో జవాబుదారీతనం కరువవ్వడం, ప్రజాధనం దుర్వినియోగమౌతున్న తీరుపై రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ వాస్తవ వేదికలో కళ్లకు కట్టారు.  
ప్రభుత్వ వ్యవస్థల్లో ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ మేధాశక్తిని సామాన్యుల బాగు కోసం కాకుండా, పాలకుల తప్పులను కప్పిపుచ్చడానికి వాడుతున్నారని అభిప్రాయపడ్డారు. గతంలో ఐఏఎస్ అధికారులు అసెంబ్లీలో ప్రశ్నలకు భయపడేవారని, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని డోలేంద్ర ప్రసాద్ విస్పష్టంగా చెప్పారు. 

ఇక ప్రస్తుతం రాష్ట్రంలో  ఉన్నది కూటమి ప్రభుత్వం కాదు కుమ్మక్కు ప్రభుత్వం అనిపిస్తోందన్నారు. ఇందుకు కారణాలు కూడా ఆయన ఉదహరించారు.  తాను కూటమి ప్రభుత్వాన్ని కుమ్మక్కు ప్రభుత్వంగా అభివర్ణించడానికి ఆయన కారణాన్ని కూడా వివరించారు. ప్రభుత్వ పథకాలు, పనుల కాంట్రాక్టుల అప్పగింతలో కూటమి ప్రభుత్వ లోపాలను ఎండగట్టే విషయంలో వైసీపీ చాలా సెలెక్టివ్ గా వ్యవహరిస్తోందన్నారు. అందుకు కారణం వాటిలో వైసీపీయులకు కూడా వాటాలు ఉండటమే కారణమని ఆరోపించారు.  ఇందుకు ఉదాహరణగా గతంలో ఎలక్షన్ల సమయంలో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, స్మార్ట్ మీటర్ల విషయంలో గగ్గోలు పెట్టిన తెలుగుదేశం పార్టీ, అధికారంలోకి వచ్చాక అవే సంస్థలకు టెండర్లు ఇవ్వడాన్ని చూపారు. నాడు తాను విమర్శించిన సంస్థలకే  ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేంటని ప్రశ్నించారు.  

ఇక దుర్మార్గానికి పరాకాష్ట అన్నట్లుగా ప్రజాధనం దుర్వినియోగం గురించి సోదాహరణంగా వివరించారు. 
జగన్ హయాంలో తిండి కోసం రూ. 400 కోట్లు, రుషికొండ ప్యాలెస్ కోసం రూ. 600 కోట్లు, తిరుగుళ్ళ కోసం  250 కోట్లు, ఇక ప్రభుత్వ భవనాలు, పాఠశాలలకు పార్టీ రంగుల కోసం  రూ. 5000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయితే.. ప్రస్తుత తెలుగుదేశం కూటమి సర్కార్ లో కూడా పాలకులు స్టార్ హోటళ్లలో భోజనానికి రోజుకు నలభై నుంచి ఏభై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఇది వారి కష్టార్జితం కాదు కనుకనే యధేచ్ఛగా ఖర్చు పెట్టేస్తున్నారన్నారు. గతంలో అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో   రూపాయిలో 6 పైసలు మాత్రమే ప్రజలకు చేరేవనీ అదే ఇప్పుడైతే..   పద్దుల్లో లెక్కలు తప్ప ఒక్క పైసా కూడా ప్రజలకు అందకుండానే మాయమౌతోందన్నారు. 

గతంలో అంటే 1995లో చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి జీవో సమాచారం ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రజలకు తెలిసేదనీ, నేడు  ప్రభుత్వం జారీ చేసే జీవోలు చాలా వరకూ రహస్యంగానే ఉంటున్నాయన్న డోలేంద్ర ప్రసాద్.. అత్యధిక జీవోలను వెబ్సైట్లలో అప్‌లోడ్ చేయడం లేదని విమర్శించారు.  తప్పుగా జారీ చేసే ఏ జీవో కూడా పబ్లిక్ డొమైన్ లో కనిపించడం లేదన్నారు. 

ఇప్పటికే ఆర్టీఐ  చట్టాన్ని 90 శాతం నిర్వీర్యం చేసేశారనీ, ఆ చట్టం ద్వారా  సమాధానాలు రావడం లేదనీ పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే..  పోలీసుల ద్వారా కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇది ఎమర్జెన్సీ కంటే దారుణమైన నియంతృత్వ పోకడ అని విమర్శించారు,.

దీనికి బాధ్యత ఎవరిదన్న రవిశంకర్ ప్రశ్నకు డోలేంద్ర ప్రసాద్ గత మూడు దశాబ్దాలుగా  రాజకీయాల్లో ఉన్న నాయకులందరూ వ్యవస్థ పతనానికి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.  
ప్రజలు మేల్కొని ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోకపోతే పరిస్థితులు మారవని, పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్ తరహా తిరుగుబాటు వచ్చే వరకు పరిస్థితిని తెచ్చుకోవద్దని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ లు రాజకీయ నేతలకు హితవు చెప్పారు.  రాజకీయ వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉందంటే, "దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు" ఉంది. ఒకరు చేసే తప్పును మరొకరు ప్రశ్నించకుండా, వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ సామాన్యుడి సొమ్మును పంచుకుంటున్నారు.

 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.