గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్.. విద్యార్థిని మృతి
Publish Date:Dec 19, 2025
Advertisement
గురుకులంలో ఫుడ్ పాయిజినింగ్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థిని మరణించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్‌కు చెందిన లింగం కుమార్తె 14 ఏళ్ల సాయి లిఖిత ఈ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నది. ఈ నెల 5న కలుషిత ఆహారం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు కూడా ఫుడ్ పాయిజినింగ్ అయ్యిందని ధృవీకరించారు. చికిత్స అందిస్తున్న సమయంలో ఆమెకు జాండిస్ అటాక్ కావడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిలోఫర్ దవాఖానలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ లిఖిత బుధవారం (డిసెంబర్ 17) కన్నుమూసింది. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా గురువారం (డిసెంబర్ 18) పాఠశాలను సందర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్ అన్నారు.
http://www.teluguone.com/news/content/student-in-gurukula-pathasala-died-36-211243.html





