Publish Date:Mar 17, 2026
సీనియర్ల వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలోని ఉన్న బనిగండ్లపాడుకు చెందిన ఎమ్మెస్సీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ మరణించింది. వివరాలిలా ఉన్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సు రెండో సంవత్సరం చదువుతున్న శ్రీవిద్య, యూనివర్సిటీ పరిధిలోని పద్మాక్షి హాస్టల్‌లో నివసిస్తేండేది.
ఆ క్రమంలో కొందరు సీనియర్లతో ఆమెకు వివాదం తలెత్తింది. ఈ వివాదం తర్వాత ఆమెపై దాడి జరిగిందనీ, అలాగే ల్యాప్‌టాప్, బంగారం చోరీ చేశారంటూ సీనియర్లు ఈమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారనీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ పరిణామాలతో శ్రీవిద్య తీవ్ర మనస్తాపానికి గురై తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. అనంతరం శ్రీవిద్య ఆంధ్రప్రదేశ్‌లోని గంపలగూడెంలో బంధువుల వద్ద ఉన్న సమయంలో ఈ నెల 7, 8 తేదీల్లో రెండు సార్లు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ముందుగా స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించినా, శ్రీవిద్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ సోమవారం (మార్చి 16) ఆమె మృతిచెందింది. శ్రీవిద్య మరణించే ముందు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మృతికి ముందు ఇచ్చిన మరణ వాంగ్మూలం లో నలుగురు వ్యక్తుల పేర్లు ప్రస్తావించినట్లు సమాచారం. ఈ ఘటనపై మదిర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ల వేధింపులే ఈ దుర్ఘటనకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనతో విద్యార్థి వర్గాల్లో ఆందోళన నెలకొంది. విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్, వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ యాజమాన్యాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/student-committ-sucide-36-215645.html
భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని, క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రెవెన్యూ వ్యవస్థలో పెనుమార్పులకు ఈ పట్టాదార్ పాసుపుస్తకాల ద్వారా శ్రీకారం చుట్టారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి విరామం ప్రకటించి, ఇరాన్ పది సూత్రాల శాంతి ప్రతిపాదనను భేష్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. గంటల వ్యవధిలోనే ఇరాన్ తో శాంతి ఒప్పందానికి, ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకూ సంబంధం లేదంటూ ఇజ్రాయెల్ కు వంత పాడారు.
అంతటా ఆర్థిక వృద్ధి మందగిస్తున్నప్పటికీ, భారత్ మాత్రం ప్రధాన చోదక శక్తిగా నిలుస్తూనే ఉంది; విస్తృత ఆర్థిక దృక్పథం అనిశ్చితంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, ఇది ఒక రకమైన స్థిరత్వాన్ని అందిస్తోంది.
యుద్ధం ప్రారంభమైన తర్వాత జేఎన్‌పీఏ పోర్టుకు చేరుకున్న తొలి భారతీయ ఎల్పీజీ నౌక ఇదే కావడం గమనార్హం.ఈ నౌక ప్రయాణం ఆద్యంతం ఉద్రిక్తతల మధ్య, ప్రమాదాల మధ్యా సాగింది. హోర్ముజ్ జలసంధిలో నియంత్రణను కఠినతరం చేసిన ఇరాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ భారత్ ఈ రవాణాను సుసాధ్యం చేసింది.
నియోజకవర్గంలోని ఒక 40 మంది లబ్ధిదారుల జాబితా పంపిస్తే, వారికి వెంటనే లోన్లు మంజూరు చేయిస్తామంటూ నమ్మబలికాడు. దరఖాస్తు చేసుకోవడానికి అదే చివరి రోజని, ఒక్కొక్కరికి రూ. 2,500 చొప్పున మొత్తం 40 మందికి కలిపి రూ. 1 లక్ష ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పాడు. ఎమ్మెల్యే పల్లా ఆ వ్యక్తి మాటలను పూర్తిగా నమ్మేసి.. తన నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆ మొత్తాన్ని ఫోన్ పే ద్వారా సదరు వ్యక్తికి పంపించారు.
జైశ్వాల్ ఒక విదేశీ యువతితో తరచుగా కనిపిస్తుండటంతో అభిమానులలో ఆసక్తి నెలకొంది. ఆమె పేరు మ్యాడీ హామిల్టన్. బ్రిటిషర్ అయిన ఈమెతో జైస్వాల్ ప్రేమలో ఉన్నాడని చెబుతున్నారు. వీరిద్దరి మధ్యా గత నాలుగేళ్లుగా పరిచయం ఉందని సమాచారం.
అమెరికా తన సొంత ప్రయోజనాల కోసమో, వ్యూహాత్మక కారణాల రీత్యానో పాకిస్థాన్ సేవలను వినియోగించుకోవచ్చని, అయితే ఇజ్రాయెల్ దృష్టిలో మాత్రం ఆ దేశం ఏ మాత్రం నమ్మదగినది కాదని రూవెన్ అజార్ స్పష్టం చేశారు.
నిందితులు పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా నిరంతరం సంబంధాలు కొనసాగించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరంతా ఒక రహస్య నెట్‌వర్క్‌గా ఏర్పడి, దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
దేవుబాపై మనీలాండరింగ్ కేసు దర్యాప్తునకు గత ఏడాదే బీజం పడింది. ఖాట్మండు శివార్లలోని బుధనీల్‌కంఠలో ఉన్న వీరి నివాసంలో సగం కాలిన కరెన్సీ నోట్లు లభించడం అప్పట్లో పెను దుమారం రేపింది. ఈ ఆధారాలతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు.. వారి ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు.
ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన రామ్మోహన్ నాయుడు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనలపై చర్చించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పాత ఎయిర్‌స్ట్రిప్‌ను పూర్తిస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.
ఈ కేసులో అరెస్టైన మిధున్ రెడ్డికి గతంలో కోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో బెయిలు మంజూరు చేసిన సమయంలో కోర్టు ఆయనకు ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయానికి వెళ్లి అధికారుల ఎదుట హాజరై సంతకం చేయాలనే నిబంధనను విధించింది.
ఒప్పందంలో లెబనాన్ పై దాడులు జరపకూడదని లేదంటూ ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకు తెగబడటమే. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్.. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ అంటుంటే.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చలేదని చెప్పుకు వస్తున్నది.
ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం గుజరాత్ టైటాన్స్ ను వరించింది. స్టేడియంలో చూస్తున్న ప్రేక్షకులే కాదు.. టీవీల ముందు కూర్చుని ఈ మ్యాచ్ ను తిలకించిన వీక్షకులను సైతం మునివేళ్ల మీద నిలబెట్టేసేంత ఉత్కంఠగా ఈ మ్యాచ్ సాగింది. అయితే.. ఇదే మ్యాచ్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.