ఆదిలాబాద్ లో భారీ విమానాశ్రయం.. జూన్ 2లోగా శంకుస్థాపన

Publish Date:Apr 9, 2026

Advertisement

ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, ఆర్థిక ప్రగతిని పరుగులు తీయించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్లో ఒక భారీ  ఎయిర్‌పోర్ట్ నిర్మించనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే ఆదిలాబాద్ రూపురేకలు మారిపోవడమే కాకుండా, విమానయాన రంగంలో తెలంగాణ   ముద్రను మరింత బలంగా ఉంటుందన్నారు.  ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన రామ్మోహన్ నాయుడు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనలపై  చర్చించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పాత ఎయిర్‌స్ట్రిప్‌ను పూర్తిస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ ఎయిర్ పోర్ట్  డొమెస్టిక్ అవసరాలతో పాటు,  దేశ రక్షణ అవసరాలకు కూడా ఉపయోగపడేలా నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

 ఈ  ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ మొదలైందన్నారు. రక్షణ శాఖ అధీనంలో ఉన్న 300 ఎకరాలకు అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా స్పందించిందని చెప్పారు.  కాగా ఈ విమానాశ్రయ నిర్మాణం కోసం ఈ నెల 17న పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు ఆదిలాబాద్‌లోని అంతర్గాం ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన జరపనున్నారు.

 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ లోపు ఈ మెగా ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విమానాశ్రయానికి  అనుబంధంగా ఒక భారీ పారిశ్రామిక కారిడార్‌ను కూడా ఏర్పాటు చేయడం ద్వారా  స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. 

ఇక పోతే.. వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు.  అలాగే పెద్దపల్లి జిల్లా అంతర్గాం, కొత్తగూడెం ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంతో పాటు, జిల్లాల వారీగా ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశమని చెప్పారు.  

By
en-us Political News

  
న్యాయ వివాదాల పరిష్కార ప్రక్రియలో, ముఖ్యంగా మధ్యవర్తిత్వ రంగంలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
దేశ రాజకీయాల్లో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని సత్యవతి ముడావత్ (మంగ్లీ) ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది.
ఆశా భోంస్లే మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తున్నారు
నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే
పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదాస్పద కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే.
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక అడుగు వేసింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఓ వాహనదారుడు వేసిన కొత్త ఎత్తు చివరకు పోలీసులకే షాక్ ఇచ్చింది.
అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి తన కఠిన వైఖరిని రుచిచూపించింది.
వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం శనివారం ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యానికి వేదికైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.