జగన్ పర్యటనలో.. మహిళా ఎస్సై పట్ల వైసీపీ నేతల అసభ్య ప్రవర్తన..!
Publish Date:Jul 30, 2026
Advertisement
విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రవళ్లిక పట్ల దురుసు ప్రవర్తన.. చర్యలకు డిమాండ్..! శ్రీకాకుళం జగన్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. భద్రతా విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళా పోలీస్ అధికారి పట్ల వైసీపీ నాయకులు అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న మహిళా అధికారిపై ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రదర్శించిన వైఖరిపై ప్రజా సంఘాలు, పోలీసు వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. శ్రీకాకుళంలోని కీలకమైన కొత్తరోడ్డు కూడలి వద్ద ఈ ఆందోళనకర సంఘటన చోటుచేసుకుంది. వైసీపీ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బూర్జ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహిళా సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) ప్రవళ్లిక కొత్తరోడ్డు కూడలి వద్ద ట్రాఫిక్, భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ చింతాడ రవికుమార్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా తోపులాటకు దిగారు. విధుల్లో ఉన్న మహిళా ఎస్సైని వారు వెనుక నుంచి పక్కకు తోసేస్తూ అనుచితంగా ప్రవర్తించారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాల్సింది పోయి, యూనిఫాంలో ఉన్న మహిళా అధికారి పట్ల ఇలాంటి ధోరణి ప్రదర్శించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయం పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతమాత్రం తగదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళంలో జగన్ పర్యటన సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా అధికారిపై జరిగిన తోపులాట ఘటనను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. శాంతిభద్రతల నిర్వహణలో ఉన్న మహిళా పోలీసుల పట్ల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దురుసుగా ప్రవర్తించిన నేతలపై వెంటనే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. విధుల నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సైని నెట్టివేసిన వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని సభ్య సమాజం డిమాండ్ చేస్తుంది. Srikakulam YSRCP, womens SI parade, YS Jagans visit, Chintada Ravikumar, AP police security,
SI Paravallik, Seediri Appalaraju, Ampolu Sub Jail, YSRCP, AP Politics, Srikakulam Ampolu Jail
http://www.teluguone.com/news/content/srikakulam-ysrcp-36-227585.html





