క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు: నలుగురు మృతి.!
Publish Date:Oct 24, 2026
Advertisement
బీహార్లోని సీవాన్ జిల్లాలో ఓ బాణా సంచా ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో కనీసం నలుగురు మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం (అక్టోబర్ 23) సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పూర్తిగా నేలమట్టమైంది.పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది. సీవాన్ జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి, అవయవాలు చిన్నాభిన్నమవ్వడంతో గుర్తింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. నివాస ప్రాంతాల మధ్య ఎలాంటి తగిన భద్రతా ప్రమాణాలు లేకుండా నిర్వహిస్తున్న ఇలాంటి అక్రమ బాణసంచా తయారీ కేంద్రాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. [Blast In Cracker Factory, Bihar, Siwan District, Alampur, Four Dead, Telugu One]
http://www.teluguone.com/news/content/blast-in-cracker-factory-36-235256.html





