ఏపీలో ఆగని కరోనా వ్యాప్తి.!
Publish Date:Jul 25, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. కొత్తగా ఏడుగురికి కరోనా సోకటంతో మొత్తం కేసుల సంఖ్య 39కి పెరిగింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ఆరోగ్య శాఖ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన బాధితులందరినీ ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి తగిన చికిత్స అందిస్తున్నది. వైరస్ వ్యాప్తి వేగాన్ని అరికట్టుందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కొత్తగా పాజిటివ్‌గా తేలిన వారితో నేరుగా సంబంధం కలిగి ఉన్న ప్రాథమిక కాంటాక్ట్‌లను గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేశారు. బాధితులు ఇటీవల కాలంలో ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడికి ప్రయాణించారు అనే సమాచారాన్ని సేకరించి, వారిని కూడా వెంటనే హోమ్ ఐసోలేషన్ కు పంపుతున్నారు. వైరస్ తీవ్రత సకాలంలో అదుపులోకి రావాలంటే బాధితుల కాంటాక్ట్ ట్రేసింగ్ అత్యంత కీలకమని భావించిన అధికారులు, ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో మళ్లీ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించి ప్రతి జిల్లా పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల వరకు ప్రత్యేక కరోనా వార్డులను సిద్ధం చేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కరోనా టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. మందుల కొరత లేకుండా చూడటంతో పాటు ఆక్సిజన్ నిల్వలు, వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆసుపత్రుల నిర్వహణ వర్గాలను ఆదేశించారు. ap corona cases, andhra pradesh covid updates, ap health department news, active covid cases
http://www.teluguone.com/news/content/spread-of-coronavirus-continues-in-ap-36-227063.html





