బాలు విగ్రహంపై అభ్యంతరమేమిటి?
Publish Date:Oct 4, 2022
Advertisement
అభిమానులు నాయకుల విగ్రహాలు పెట్టుకోవడం మామూలే. మరణించిన నాయకుల పట్ల తమ ఆరాధ నా భావాన్ని వ్యక్తం చేయడానికి అన్ని సందర్భాల్లోనూ పూజలు చేయడం, పూలదండలు వేయడం, పాలాభిషేకాలు చేయడం పరిపాటి. ఉత్తరాది మాట ఎలా ఉన్నా దక్షిణాదిన మరీ ఎక్కువే. కానీ విపక్షాలు వాటిని పడగొట్టడాలు, గొడవలు సృష్టించడాలూ జరుగుతున్నాయి. ఎంతో ప్రజాదరణ పొందిన గాయ కుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని తొలగించి అభిమానులను ఆగ్రహానికి గురిచేశారు. బీపీ మండల్ విగ్రహం వివాదం ముగియకముదే ఎస్పీ విగ్రహాన్ని గుంటూరులో మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అనుమతి లేదని తొలగించడంపై అభిమానులు మండిపడుతున్నారు. గుంటూరులో అనేకానేక విగ్రహాలకు అనుమతి లేదు. అయినా వాటి జోలికి వెళ్లకుండా బాలసుబ్రమణ్యం విగ్రహానికి అభ్యం తరం చెప్పడం వెనుక ఆంతర్యమేమిటి. ప్రజా సంఘాలు, కళాకారుల సంఘాలు తమ వద్దకు రాకుండా దూరం అవుతున్నారనే భావంతో దగ్గరకు చేర్చుకునేందుకు వైసీపీ నేతలు అనుసరిస్తున్న ఎత్తుగడని వారు భావిస్తున్నారు. బీపీ మండల్ విగ్ర హం విషయంలో ఎలాంటి రాజకీయం అమలు చేశారో.. ఇప్పుడు ఎస్పీ బాలు విగ్రహం విషయంలో కూడా అదే రకమైన రాజకీయాన్ని అధికారపార్టీ నేతలు ఉపయోగిస్తున్నారు. గుంటూరు, లక్ష్మిపురం సెంటర్‌లోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద కళాదర్బార్ ఆధ్వర్యంలో ఎస్పీ బాల సుబ్రహ్మమణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదంటూ గత రాత్రి విగ్రహాన్ని తొలగిం చి పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ ప్రాంతంలో పెట్టారు. ఈ ఘటనపై సినీ కళాకారుల సంఘాలు మండి పడ్డాయి. బలసుబ్రహ్మణ్యంకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ కళాదర్బార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
http://www.teluguone.com/news/content/spb-statue-problem-39-144876.html





