ఖమేనీ మృతితో అట్టుడుకుతున్న పశ్చిమాసియా
Publish Date:Mar 1, 2026
Advertisement
అమెరికా స్థావరాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా ధృవీకరించింది. కొన్ని గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించింది. ఖమేనీ మరణానికి ఇరాన్‌లో ఏడు రోజులపాటు సెలవు దినాలను, 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఖమేనీ మృతి నేపధ్యంల ఇరాన్ సైనిక బలగాలు తీవ్రంగా స్పందించాయి. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరిక సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులకు దిగాయి. ఇరాన్ ఐఆర్‌జీసీ దళాలు శనివారం నుచి ఆరోసారి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు నివ్వహించాయి. మొత్తం 27 బేస్‌లను టార్గెట్ చేసుకున్నట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. దాంతో పాటు ఇజ్రాయెల్‌లోని రక్షణరంగ ఫ్యాక్టరీలను కూడా ఇరాన్ లక్ష్యం చేసుకుంది. దుబాయ్‌లో మూడు భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలను దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గగనతలంలోనే పేల్చివేశాయి. వాటి శకలాలు కూలడంతో దుబాయ్‌లో అత్యంత రద్దీగా ఉండే జబిల్ అలీ పోర్టులో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. మరోవైపు అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే ఎంఎస్‌పీ షిప్‌పై నాలుగు డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ దాడుల నేపధ్యంలో బాగ్గాద్‌లోని గ్రీన్ జోన్ సమీపంలో తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి.
http://www.teluguone.com/news/content/situation-in-west-asia-very-tense-36-214839.html





