పులి సంచారంతో భయంభయం

Publish Date:Apr 4, 2026

Advertisement

పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో పెద్దపులి సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నది. గత కొన్ని రోజులుగా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి కదలికలు కనిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.

ప్రస్తుతం దేవీపట్నం మండలంలోని నేలకోట కొండ ప్రాంతాన్ని ఈ పులి తన ఆవాసంగా మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా ఈ పరిసరాల్లోనే పులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. పశువుల కాపరులు, కొండపైకి వెళ్లే గ్రామస్థులు పులిని నేరుగా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. రామదుర్గం కొండపై పులి కదలికలను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు కూడా. అయితే మనుషులను చూస్తే సాధారణంగా పులులు వయలెంట్ అవుతాయి. కానీ ఈ పులి మాత్రం మనుషులను చూసి నెమ్మదిగా వెనక్కు పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. 

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. పులి అడుగుజాడల ఆధారంగా అది ఎటువైపు వెళ్తుందో పర్యవేక్షిస్తున్నారు. పులిని బంధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. నిరంతరం నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ప్రజల రక్షణ దృష్ట్యా అటవీశాఖ అధికారులు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.   పొలం పనులకు వెళ్లేవారు ఒంటరిగా వెళ్లకూడదని, గుంపులుగా వెళ్లాలని సూచించారు. సాయంత్రం వేళల్లో అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. పశువులను అడవి వైపు తీసుకెళ్లరాదని స్పష్టం చేశారు. పులి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.  గండి పోచమ్మ ఆలయ సందర్శనకు వచ్చే భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. వీలైనంత త్వరగా పులిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

By
en-us Political News

  
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
​చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.