జిత్తులమారి శిల్పాచౌదరి.. పోలీసులకు సినిమా స్టోరీ..
Publish Date:Dec 11, 2021
.webp)
Advertisement
వీకెండ్ పార్టీ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? మామూలు వాళ్లైతే.. 5వేలు-10వేలతో ఖల్లాస్. అదే రిచ్ పీపుల్ అయితే.. 1 లక్ష-5 లక్షలు. కానీ, కిలేడీ శిల్పాచౌదరి రేంజే వేరు. గతంలో ఆమె ఇచ్చిన కిట్టీ పార్టీల ఖర్చెంతో తెలిస్తే.. కళ్లు తిరగాల్సిందే. సంపన్నులను ఆకట్టుకోవడం కోసమేగా ఆమె కిట్టీ పార్టీలు ఇచ్చింది. అందుకే, తాను వారికన్నా రిచ్ అనే బిల్డప్ ఇచ్చేందుకు.. ఒక్కో కిట్టీ పార్టీకి 50 లక్షల నుంచి 5 కోట్లు ఖర్చు చేసేదని పోలీసులు గుర్తుంచారు. వామ్మో.. ఒక్కో పార్టీకి.. అదికూడా లేడీస్ కిట్టీ పార్టీకి.. 5 కోట్లు అంటే మాటలా! శిల్పా చౌదరా.. మజాకా!!
శిల్పాచౌదరిని మరోసారి మూడురోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్న పోలీసులు.. ఆమె నుంచి మళ్లీ ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు. విచారణలో శిల్పా.. పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. తాననే ముగ్గురు మోసం చేశారని.. తానే అధిక వడ్డీలు కట్టానని.. చెబుతోంది. మహేశ్‌బాబు సోదరి, హీరో సుధీర్‌బాబు భార్య ప్రియదర్శినితో పాటు రోహిణిరెడ్డి.. తనను అధిక వడ్డీల కోసం టార్చర్ చేశారని చెప్పింది. వీరిద్దరికీ 2016 నుంచి ఇప్పటి వరకూ.. కేవలం వడ్డీల రూపంలో నెలకు 5 లక్షలు చొప్పున చెల్లించే దానినని శిల్పా చౌదరి పోలీసులకు తెలిపింది. తాను అధిక వడ్డీల పేరుతో డబ్బులు వసూలు చేసేదాన్నని.. అంతకు మించిన వడ్డీకి రాధికారెడ్డికి అప్పు ఇచ్చేదాన్నని.. అయితే, రాధికారెడ్డి తనను మోసం చేసిందని శిల్పా చెబుతోంది. కానీ, రాధికారెడ్డి మాత్రం.. తానే శిల్పకు డబ్బులిచ్చి మోసపోయానని అంటోంది. దీంతో.. ఆమె చెబుతున్న విషయాలు నిజమో కావో తెలుసుకునేందుకు.. వారందరినీ ముఖాముఖి కూర్చోబెట్టి ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు.
ఇంతకు ముందు కస్టడీలో శిల్ప ‘జెంటిల్మన్’ సినిమా స్టోరీని పోలీసులకు వినిపించింది. ఓ ఆస్పత్రి నిర్మాణానికి ఆమె రూ. కోట్లు ఇచ్చినట్టు చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఆ ఆస్పత్రి ఎవరిది? ఎక్కడ నిర్మిస్తున్నారు? పెట్టుబడి మొత్తం ఎంత? అందులో శిల్ప వాటా ఎంత? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, విచారణలో పోలీసులతో శిల్పాచౌదరి వాగ్వాదానికి దిగినట్టు చెబుతున్నారు. తనపై లేనిపోనివి సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులపై శిల్పా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
http://www.teluguone.com/news/content/shilpa-chowdary-latest-updates-25-128146.html












