బిపిన్ రావత్ పై కుట్ర జరిగిందా? హెలికాప్టర్ ప్రమాదంపై అన్ని అనుమానాలే..!
Publish Date:Dec 11, 2021
Advertisement
భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయి నాలుగు రోజులైంది. అయినా హెలికాప్టర్ ప్రమాదంపై ఇంకా ఎలాంటి ఖచ్చితమైన సమాచారం రావడం లేదు. ఆర్మీ వర్గాలు ఎలాంటి వివరాలు చెప్పడం లేదు. అత్యంత భద్రత, సురక్షితమైనదిగా చెబుతున్న MI-17v5 హెలికాప్టర్ క్రాష్ కావడం నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో హెలికాప్టర్ ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంపై శుక్రావరం ప్రకటన చేసిన భారత వైమానిక దళం.. ఎటువంటి స్పష్టమైన సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలని సూచించింది. తాము దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేస్తామని ట్విటర్ వేదికగా వెల్లడించింది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించింది రష్యన్ మేడ్ అత్యంత సురక్షితమైన హెలికాప్టర్. ప్రధాని మోడీ సైతం పర్యటనలకు ఎంఐ హెలికాప్టరే వాడుతారు. ఈ హెలికాప్టర్‌కు ప్రత్యేకమైన రక్షణ కవచాలు అమర్చి ఉంటాయి. ఇన్ఫ్రారెడ్ సప్రెసర్లు, జామర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంధన ట్యాంక్ నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు ఉన్నాయి. సెల్ఫ్‌సీల్డ్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించకుండా పాలీయూరేథీన్ అనే సింథటిక్ ఫోమ్ రక్షణగా ఉంటుంది. అయినా కునూరు ఘటనలో హెలికాప్టర్ నుంచి మంటలు చెలరేగాయని అంటున్నారు. దీంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రయాణించిన హెలికాప్టర్ కు జరిగిన ప్రమాదం మిస్టరీగా మారుతోంది. దట్టమైన పొగమంచే ప్రమాదానికి కారణమని ముందుగా అందరు అనుకున్నా ఇపుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. హెలికాప్టర్ క్రాష్ అయిన నీలగిరి కొండలు అడవులున్న లోయలున్న ప్రాంతాల్లో ప్రమాదానికి ముందు రోజు భారీ వర్షాలు కురిశాయట. మంగళవారం కురిసిన భారీ వర్షాల వల్ల కొండలు లోయంతా దట్టమైన పొగమంచుతో కప్పేసిందట. ప్రమాదం జరిగిన బుధవారం ఉదయం కూడా వర్షం కురిసిందట. అంతటి పొగమంచున్నపుడు హెలికాప్టర్లో ప్రయాణించటానికి ఎవరినీ అనుమతించరు. కానీ సీడీసీఎస్ జనరల్ బిపిన్ రావత్ బృందం ఎందుకు వెళ్లిందన్నది అంతుచిక్కడం లేదు. ఎంఐ-17వీ5 సాధారణ హెలికాప్టర్ కాదు. ప్రతికూల వాతావరణంలో కూడా సులభంగా ప్రయాణం చేయగలిగిన సామర్ధ్యం కుంది. బిపిన్ ప్రయాణించిన హెలికాప్టర్ 6 వేల మీటర్ల ఎత్తులో అంటే 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. ఒకవేళ పొగమంచు దట్టంగా అలముకున్నా పొగమంచుకన్నా ఎత్తులో ప్రయాణించే అవకాశం ఈ హెలికాప్టర్ కుంది. మరీ పైలెట్ ఎందుకు తీసుకెళ్లలేదన్నది మిస్టరీగానే ఉంది. ఇక సూలూరు-వెల్లింగ్టన్ డిఫెన్స్ కాలేజీ మధ్య డిఫెన్స్ హెలికాప్టర్లు రెగ్యులర్ గా ప్రయాణం చేస్తునే ఉంటాయి. పైలెట్లకు హెలికాప్టర్ నడపటం వాతావరణం కొత్త కూడా కాదు. సూలూరు ప్రాంతంలోని కొండలు లోయలు అడవుల పై పైలెట్లకు పూర్తిస్ధాయి అవగాహన ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. పొగమంచును అధిగమించే అవకాశాలు అనుభవజ్ఞలైన పైలెట్లు భౌగోళిక పరిస్ధితులపై పూర్తి సమాచారం ఉన్న పైలెటే హెలికాప్టర్ ను నడిపినా ప్రమాదం జరగటమే ఆశ్చర్యంగా ఉంది. ఈ హెలికాప్టర్ కు రెండు ఇంజన్లు చెడిపోయినా సేఫ్ గా భూమిపైన ల్యాండింగ్ చేసే సౌకర్యం కూడా ఉండదట. హెలికాప్టర్ ప్రయాణించాల్సిన సమయం కూడా కేవలం 25 నిముషాలు మాత్రమే. మరి ఇంత తక్కువ సమయం ప్రయాణంలో ఎలాంటి ప్రతికూల పరిస్ధితులను కూడా తట్టుకునే హెలికాప్టర్ కు ప్రమాదం జరిగి కుప్పకూలిపోవడం ఎవరికీ అర్ధం కావటంలేదు. మరలాంటపుడు ప్రమాదానికి కారణాలు ఏమిటనేది సస్పెన్సుగా మారిపోయింది. వాతావరణ ప్రభావం వల్ల ప్రమాదం జరిగుండదని. మరి దర్యాప్తులోనే అన్నీ విషయాలు బయటపడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/is-any-conspiracy-behind-in-cds-bipin-rawat--helicopter-crash-25-128151.html





