విరాట్ కింగ్ కోహ్లీ అజేయ సెంచరీ..కేకేఆర్ పై ఆర్సీబీ విజయం

Publish Date:May 13, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)  తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బుధవారం (మే 13) రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన   పోరులో బెంగళూరు జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కింగ్ కోహ్లీ అద్భుత  శతకంతో చెలరేగడంతో కేకేఆర్ నిర్దేశించిన  లక్ష్యాన్ని ఆర్సీబీ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే  ఛేదించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు  పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల   స్కోరు సాధించింది.   193 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్  కోహ్లీ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కోహ్లీ  58 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకుని స్టేడియాన్ని హోరెత్తించాడు.

 కోహ్లీ మొత్తం 60 బంతులు ఎదుర్కొని 105 పరుగులతో అజేయంగా నిలిచాడు.  మూడు సిక్సర్లు, పది ఫోర్లకు తోడు వికెట్ల మధ్య వేగంగా పరుగెడుతూ సింగిల్స్ తీయడం ద్వారా కేకేఆర్ ఫీల్డర్లపై ఒత్తిడి పెంచాడు.   కోహ్లీకి తోడుగా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 39 పరుగులతో  సహకారాన్ని అందించారు. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్‌ను పూర్తిగా బెంగళూరు వైపు తిప్పేసింది. చివరికి 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన  ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ తీరు అభిమానులను కట్టిపడేసింది.  స్పిన్నర్లను, పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ మైదానం నలుమూలల షాట్లు ఆడటం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనతో విరాట్ మరోసారి తన క్లాస్‌ను నిరూపించుకున్నారు. ఈ సీజన్ లో గత రెండు మ్యాచ్ లలో డకౌట్ అయ్యి అభిమానులను నిరాశపరిచిన కింగ్ కోహ్లీ కేకేఆర్ తో మ్యాచ్ లో విశ్వరూపం చూపాడు.  

By
en-us Political News

  
ఖమ్మంలో కీచకుడి దాడిలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.
పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (TMC) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది.
గతంలో సిట్ కేవలం సాధారణ అవినీతి నిరోధక చట్టాల కింద విచారణ జరపగా, ఈడీ ఎంట్రీ తో కథ కొత్త మలుపు తిరిగింది. మద్యం సిండికేట్లు, వివిధ షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల ద్వారా విదేశీ ఖాతాల్లోకి ఎలా తరలిపోయాయి? అనే మనీ ట్రయిల్ గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాధారణంగా తనదైన దూకుడు రాజకీయ శైలితో, వాడీవేడి వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ షాక్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రూట్ ఎందుకు ఆలస్యం కానుంది? రియల్ ఎస్టేట్‌పై చూపే ప్రభావం, రాజకీయ దుమారం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తనిఖీల్లో అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నట్లు, సరైన అనుమతులు లేకుండానే చికిత్సలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల్లో అధికారులు పలు క్లినిల్ లను పరిశీలించి, రికార్డులు, వైద్య సిబ్బంది అర్హతలు, చికిత్సల విధానాలపై సుదీర్ఘంగా విచారణ చేశారు.
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలతో హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. వాణిజ్య నౌకలు కనిపిస్తే పేల్చేస్తామన్న హెచ్చరికలతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు సంక్షోభంలో పడ్డాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వేదాంత 5 విడి విడి కంపెనీలుగా మారిన తర్వాత షేర్ హోల్డర్లకు వచ్చే డివిడెండ్ల పరిస్థితి ఏంటి? అల్యూమినియం, జింక్ వ్యాపారాల విభజనతో ఇన్వెస్టర్లకు లాభమా నష్టమా? మార్కెట్ నిపుణుల విశ్లేషణ పూర్తి వివరంగా ఇక్కడ చూడండి.
రాజ్యసభ అభ్యర్థిగా తాను దాఖలు చేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఆర్‌ఐ ఎఫ్‌సీఎన్‌ఆర్ (FCNR-B) డిపాజిట్లపై హెడ్జింగ్ ఖర్చులను ఆర్‌బీఐ భరించనుండటంతో, బ్యాంకులు ఇప్పుడు 6% పైగా భారీ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ సరికొత్త ఆర్థిక వ్యూహం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
దేశంలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో ఎన్‌టీపీసీ, అదానీ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ వంటి ప్రముఖ పవర్ స్టాక్స్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మెక్వారీ సంచలన నివేదికను విడుదల చేసింది. రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గత ఏడాది కాలంలో 280% పైగా పెరిగిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ (MTAR Tech) షేర్లు హఠాత్తుగా 9% కుప్పకూలాయి. అమెరికా క్లయింట్ బ్లూమ్ ఎనర్జీ మరియు OpenAI డేటా సెంటర్ ప్రాజెక్ట్ నిలిచిపోవడమే దీనికి కారణమా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత అండర్-19 మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. డబ్ల్యూపీఎల్ స్టార్, 16 ఏళ్ల దీయా యాదవ్‌కు వన్డే జట్టులో చోటు దక్కగా, వరల్డ్ కప్ విన్నర్ భవిక అహిరేకు కెప్టెన్సీ పగ్గాలు లభించాయి. పూర్తి స్క్వాడ్, మ్యాచ్ షెడ్యూల్ ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.