ట్రంప్ చైనా పర్యటన.. విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్

Publish Date:May 13, 2026

Advertisement

అమెరికా రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా పగ్గాలను డొనాల్డ్ ట్రంప్ మరోసారి చేపట్టిన తరువాత   దౌత్యపరమైన సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  బీజింగ్ విమానాశ్రయంలో ట్రంప్ కు చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ స్వాగతం పలికారు. 

ఈ  పర్యటనలో ట్రంప్ వెంట ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అలాగే పలు టెక్నాలజీ సంస్థల ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రంప్ కు స్వాగతం పలికేందుకు చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్ స్వయంగా విమానాశ్రయానికి రావడమే చైనా అగ్రరాజ్యాధినేత పర్యటనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నది అవగతమౌతోంది. గతంలో అంటే 2017లో ట్రంప్ చైనా పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు తక్కువ స్థాయి నేతలు విమానాశ్రయానికి వచ్చారు. ఇప్పుడీ మార్పు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇక పోతే దాదాపు దశాబ్ద కాలం తరువాత  అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రపంచంలో అమెరికా తరువాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో వాణిజ్య బంధాన్ని పటిష్ఠం చేసుకుని కొన్ని ఒప్పందాల దిశగా ట్రంప్ ప్రయత్నంలో భాగంగానే ఈ పర్యటనను చూడాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించారు.
రాష్ట్రాన్ని ఆర్ధికంగా మరింత పటిష్ట పరిచేందుకు వ్యవస్థలో సామర్ధ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
ప్రజాస్వామ్యం వచ్చింది. పాలకుండలాంటి ఓటు హక్కును తెచ్చింది.
నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు దర్యాప్తు నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ వ్యవహారంలో చిక్కుకుని చివరకు సస్పెన్షన్‌కు గురయ్యాడు.
గచ్చిబౌలి ప్రాంతంలో లిఫ్టులు ఇరుక్కుని చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బంగారాన్ని బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొచ్చి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది.
అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ. కేసులోని కీలక సాక్షులను ప్రలోభపెట్టడమే కాకుండా, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన బెదిరించినట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.