Publish Date:Nov 11, 2025
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో , చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనగుతుంది. ఈ విడతలో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ నెల 6న తొలి విడతలో 18 జిల్లాల్లో మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మలి విడతలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 45,399గా ఉన్నాయి. 3 కోట్ల 70 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు . 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఉదయం 9 గంటలకే 14.55 శాతంగా నమోదైన పోలింగ్ .. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికల్లా దాదాపు 50 శాతానికి చేరుకుంది. ఈ విడతలో తొలి దశకంటే అధికంగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే భారీ పోలింగ్ ఏ కూటమికి అనుకూలం అనే విషయంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కాగా మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కిషన్ గంజ్ జిల్లాలో అత్యధికంగా 51.86 శాతం నమోదు కాగా, గయాలో 50.95, జుమాయిలో 50.91, బంకాలో 50.07శాతం ఓటింగ్ నమోదైంది. ఇక మధుబనిలో అయితే అత్యల్పంగా 43.39శాతం ఓటింగ్ నమోదైంది.
రెండో విడత పోలింగ్ లో ఇప్పటి వరకూ ఓటు వేసిన ప్రముఖులలో జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, కేంద్ర మంత్రి జితన్ రామ్ మంఝా, ఎంపీ పప్పుయాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్, బీహార్ పరిశ్రమల శాఖ మంత్రి నితిష్ మిశ్రా, జుమాయ్ బీజేపీ అభ్యర్థి శ్రేయేషి సింగ్, ఇండిపెండెంట్ అభ్యర్థి జ్యోతి సింగ్, బీజేపీ సీనియర్ నాయకుడు షహనవాజ్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకుడు అజీత్ శర్మ తదితరులు ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/second-phase-polling-in-bihar-peacefu-39-209338.html
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు