వర్గీకరణతో అందరికీ మేలు జరగాలి!

Publish Date:Aug 5, 2024

Advertisement

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై మానవ హక్కుల కార్యకర్త బాలగోపాల్ గతంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘‘ఇది దోపిడీ, అణచివేతలకు సంబంధించిన అంశం కాదు. ఇది అణచి వేయబడ్డ సమూహంలోనే అసమానతలకు సంబంధించిన అంశం. దీనికి మూలాలు హిందూ వర్ణ వ్యవస్థలో, దానిలో ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు వర్గీకరణపై ఇచ్చిన దాదాపు 500 పేజీల తీర్పులో బాలగోపాల్ వ్యాఖ్యల సారం ఉందనే చెప్పాలి.  ఒకే సామాజిక వర్గంలోని ఉప కులాలకు సమ న్యాయం జరగడం లేదంటూ దాదాపు దశాబ్దాల క్రితం వారిలో అంతరాలకు బీజం పడింది. అన్నదమ్ముల్లా మెలిగే వారిలో అంతరాలు తొలగించి జనాభా ప్రాతిపదికన  రిజర్వేషన్ల అమలును సరిచేసి, వాటి ఫలాలు అందుకోవాలని ఐదు దశాబ్దాల క్రితం విజ్ఞాపనలతో మొదలైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ చేయాల్సిందేనంటూ దశాబ్దాల క్రితం ఉద్యమం మొదలైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అటు, ఇటు సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

అసలీ వర్గీకరణ ఏమిటి? ఎక్కడ తేడా వస్తోంది? భావోద్వేగాలను పురిగొల్పేలా ఉద్యమం ఎందుకు జరిగింది? వంటి అనేక ప్రశ్నలకు బదులు దొరకాలంటే దశాబ్దాల పరిణామాలను ఒకసారి పరికించాల్సిందే. ఎస్సీ రిజర్వేషన్లలో న్యాయమైన వాటా దక్కడం లేదని, రిజర్వేషన్ల ఫలాలు అందుకోవడంలో ఎస్సీ కులాల్లో అసమానతలు పొడచూపడంతోనే వర్గీకరణ అంశం ఉద్యమానికి  దారి తీసిందని అనేక మంది సామాజిక కార్యకర్తలు, మేధావులు పలుమార్లు స్పష్టం చేశారు. ఎస్సీల్లోని 59 ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు జనాభా నిష్పత్తి ప్రకారం అందడం లేదని ఎస్సీ రిజర్వేషన్లపై 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం నియమించిన లోకూర్ కమిషన్ నివేదించింది. ఇదే అంశంపై 1972 నుంచి మొదలుకుని ఉమ్మడి ఏపీలో మారిన ప్రతి సీఎంకు విజ్ఞప్తుల వెల్లువ మొదలైంది. ఎస్సీని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో న్యాయం చేయాలనే డిమాండ్‌తో 1994లో మొదలైన ఉద్యమం రాష్ట్రమంతటా విస్తరించింది. 

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994 జూలై 7న వర్గీకరణ ప్రధాన డిమాండ్‌గా  సభ  జరిపి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1996లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా ఏబీసీడీ వర్గీకరణ చేస్తూ నాటి చంద్రబాబు  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 శాతం ఎస్సీ కోటాను విభజిస్తూ 1997 జూన్ 6న తెలుగుదేశం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ‘ఏ’ గ్రూపులో రెల్లి, దాని అనుబంధ కులాలతో సహా మొత్తం 12 కులాలను అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించి ఒక శాతం కోటాను కేటాయించారు. ‘బీ’ గ్రూపులో మాదిగ, దాని ఉప కులాలతో సహా మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7 శాతం కోటాను కేటాయించారు. 'సీ'లో మాల, దాని ఉప కులాలతో సహా మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6 శాతం కోటా ఇచ్చా రు. 'డీ'లో ఆదివాసి ఆంధ్రులతో పాటు మొత్తం 4 కులాలను చేర్చి 1 శాతం కోటా నిర్ణయిస్తూ నాడు చంద్రబాబు  ప్రభుత్వం జీవో జారీ చేసింది.  ఎస్సీ వర్గీకరణ చేసే రాష్ట్ర అధికారం లేదని మాల మహానాడు కోర్టును ఆశ్రయించింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధికి మించిందని ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దాంతో  వర్గీకరణ రద్దయ్యింది. 

పీవీ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన మాల మహానాడు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. మాదిగల వర్గీకరణ డిమాండ్‌పై  మాలలు అభ్యంతరం చెప్పారు. సబ్-కేటగిరైజేషన్ సామాజిక వైషమ్యాలకు దారి తీస్తుంది. ఇది ప్రాంతీయ వ్యత్యాసమే తప్ప మాదిగలకు అన్యాయం ఏమీ జరగలేదనే వాదనను పీవీ రావు తెరమీదకు తెచ్చారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్సీల ఐక్యతను దెబ్బతీసే కుట్రతో సృష్టించిందే వర్గీకరణ ఉద్యమం అని ఆరోపించారు. అప్పట్లో రాష్ట్రంలో మాలలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి, మాదిగల్ని తన వైపు తిప్పుకొనే వ్యూహంతోనే చంద్రబాబు వర్గీకరణ చిచ్చు పెట్టారనే విమర్శలు చేశారు. ఎస్సీలను వర్గీకరిస్తూ 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి చంద్రబాబు ప్రభుత్వం  రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఆ చట్టంలో ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరిస్తూ.. వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు. 2004 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టి వేసింది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ప్రకటించారు. దీంతో వర్గీకరణ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. 2000 నుండి 2004 మధ్య దాదాపు ఐదేళ్లపాటు చంద్రబాబు పాలనలో   రిజర్వేషన్ల అమలు కారణంగా మాదిగలకు దాదాపు 22 వేల వరకు ఉద్యోగాలు వచ్చాయి అని  నాడు మందకృష్ణ ప్రకటించారు.  సమాజంలో అసమానతలు, అంతరాలు, కుల, వర్గ, ప్రాంత, మత వైషమ్యాలు లేని ఆరోగ్యకరమైన  భారతదేశ  సమాజాన్ని కాంక్షించే  స్వాప్నికుడిగా అందరూ బాగుండాలి అని  కోరుకుందాం..!

By
en-us Political News

  
ఈ ఏడాది మే మొదటి వారంలో తాను కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తాను ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీ పేరులో తెలంగాణ పదం కచ్చితంగా ఉంటుందని కవిత చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆమె.. ఆ పోటీ ఎక్కడ నుంచైనా ఉండొచ్చన్నారు. అయితే తన మొదటి చాయిస్ మాత్రం సిద్దిపేటేనని చెప్పారు.
జైలు నుంచి విడుదల అయిన తరువాత మీడియాతో మాట్లాడిన అంబటి తనదైన శైలిలో వింత వ్యాఖ్యలు చేశారు. జైలు అధికారులు వారి విధులు వారు నిర్వహించారన్నారు. తనకు జైల్లో ప్రత్యేక సదుపాయాలేమీ కల్పించలేదన్నారు. అందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చిన ఆయన జైల్లో భోజనం ఏ మాత్రం బాలేదని చెప్పారు.
ఈ మంత్రివర్గ సమావేశం స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) ఆమోదించిన రూ.29,021 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనుంది.
విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వర్తించే ఈ రిజర్వేషన్ ను రద్దు చేస్తూ ముస్లింలకు ఈ కోటా ఇకపై ఉండదని స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలలో 37 రాజ్యసభ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వివిధ తేదీలలో ఖాళా అవుతాయి. అలా ఖాళీ అయ్యే స్థానాలలో తెలంగాణ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీల స్థానాలు కూడా ఉన్నాయి.
నెలరోజుల పాటు సాగిన ఈ కిడ్నాప్ హైడ్రామాతో బాధిత కుటుంబం ప్రాణభయంతో వణుకుతూ దాదాపు నెలరోజుల పాటు బందీ జీవితం గడిపింది. చిట్టచివరకు పోలీసులను ఆశ్రయించింది.
పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ అసెంబ్లీలకూ, అలాగే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి ఏప్రాల్ లో ఎన్నికలు జరగున్నాయనీ, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను మార్చిలో విడుదల చేయనున్నామని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
కేసీఆర్ కుమార్తె, జనజాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్టు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది.
పిటిన్ ను విచారించిన గుంటూరు కోర్టు.. అంబటిని ప్రత్యేక రిమాండ్ ఖైదీగా పరిగణించి, మాజీ మంత్రికి చట్ట ప్రకారం కల్పించాల్సిన ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.
గ్రూపు మ్యాచుల్లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన ఆసీస్ తన చివరి పోరుతో ఒమన్ తో ఈ నెల 20న తలపడనుంది.
బాధ్యత కలిగిన హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తాను ఊహించలేదంటూ త్రిష స్పందనను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన క్లయింట్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, నటనకే పరిమితమని, సంబంధం లేని వ్యహహారాల్లో ఆమెను లాగవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంచలన విజయాన్ని కట్టబెట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో గూడెం మహిపాల్ రెడ్డి అండతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.
మున్సిపల్ కార్పొరేషన్‌లో తమకే సంఖ్యా బలం అధికంగా ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కాగా, నెల్లూరు మేయర్ పదవికి దేవరకొండ శ్రీలతని తెలుగుదేశం ఎంపిక‌ చేసిన విషయం తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.