మంత్రుల బస్సు యాత్ర తుస్సు.. జనం లేక మంత్రుల ఉసూరు!

Publish Date:May 29, 2022

Advertisement

సాజాజిక న్యాయ భేరి అంటూ వెనుకబడిన తరగతులకు చెందిన 17 మంది మంత్రులతో చేపట్టిన బస్సు యాత్ర ప్రభుత్వానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. జనంలో జగన్ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేసింది. బలవంతంగా బస్సుల్లో తీసుకువచ్చినా జనం సభలో కూర్చోడానికి ఇష్టపడలేదు. పోలీసులు బలప్రయోగం చేసి వెళ్లిపోయేవాళ్లను ఆపుదామన్నా వారు ఆగలేదు. సభా ప్రాంగణం గేట్లు మూసేసినా తోసుకుని మరీ వెళ్లిపోయారు.

గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమం ఘోరంగా విఫలం కావడంతో జగన్ సర్కార్ సామాజిక న్యాయ భేరి పేరిట బస్సు యాత్ర చేపట్టింది. ఈ యాత్ర కూడా తుస్సు మంది. మంత్రుల బస్సుయాత్ర సభలకు జనం కరవయ్యారు. స్థానిక నాయకులకు, వలంటీర్లకు టార్గెట్లు పెట్టి మరీ బస్సుల్లో జనాన్ని తరలించినా, వారు సభా స్థలికి చేరగానే వెనక్కు మళ్లిపోవడం కనిపించింది.

తీరా మంత్రుల బస్సు  చేరుకునే సరికి సభా ప్రాంగణం అంతా ఖాళీ అయిపోతున్న పరిస్థితి. విజయ నగరంలో అయితే జనం లేక ఏకంగా సభనే రద్దు చేశారు. ఇక మిగిలిన చోట్ల కూడా జనం లేకపోవడంతో మంత్రులు కుప్తంగా ప్రభుత్వ పథకాలను, అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని చెప్పి సభను ముగించి మళ్లీ బస్సు ఎక్కేశారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కావడంతో వైసీపీలో గుబులు పెరిగిపోతున్నది.  ప్రజలలో జగన్ ప్రభుత్వంపై ప్రస్ఫుటంగా ప్రజా వ్యతిరేకత కనిపిస్తుండటంతో బస్సుయాత్రలో పాల్గొన్న మంత్రులకే కాకుండా మొత్తం వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలలోనే తమ రాజకీయ భవిష్యత్ పై బెంగ మొదలైందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.

బలవంతంగా జనాలను సభలకు బస్సుల్లో తరలించినా వారు ఆగకుండా వెళ్లిపోతుంటే.. మైకుల్లోనే వారికి కూర్చో మంటూ నేతలు బతిమాలడం వినిపించింది. కాగా ఎంత సేపూ అమ్మ ఒడి, పింఛన్లు, రైతు భరోసా అంటూ అరకొరగా అమలు చేసిన పథకాల గురించే గొప్పగా చెప్పుకుంటుంటే జనం విసుగెత్తిపోతున్నారని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.  

 సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలో భాగంగా  నాల్గవ రోజు ఆదివారం నంద్యాలలో   మంత్రుల సభ వెలవెలబోయింది. నంద్యాల శ్రీనివాస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభకు జనం కరువయ్యారు. సభలో కనీసం రెండు వరుసల కుర్చీలు కూడా నిండలేదు. ఆ రెండు వరుసలలో కూడా వైసీపీ కార్యకర్తలే కూర్చున్న పరిస్థితి.  ల సభ అట్టర్ ప్లాప్ కావడంతో మంత్రులు మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. ఈ సభకు వైసీపీ నేతలు కష్టపడి జనాలను తరలించినా వారు మంత్రులు మాట్లాడే సమయానికి  వెనుదిరిగారు. సభను రద్దు చేసుకుని వెళిపోతే జనంలో ఇంకా పలుచన అవుతామని భావించి ఏదో జరిగిందన్నట్లు మమ అనిపించేశారు. కేవలం ఇద్దరు మంత్రులు మాత్రమే మాట్లాడారు.  

కర్నూలులోనూ ఇదే పరిస్థితి. మంత్రులు ఖాళీ కుర్చీలను ఉద్దేశించి ఉపన్యాసాలు చేయాల్సిన పరిస్థితి. క్లుప్తంగా ఏదో ప్రసంగించామన్నట్లు చేసి మంత్రులు బస్సెక్కి వెళ్లిపోయారు. 

By
en-us Political News

  
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతల అరెస్టు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.