చంద్రబాబు నివాసానికి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
Publish Date:May 29, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసానికి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే చంద్రబాబు నివాసానికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కరకట్ట వద్ద అరటి తోట పంట అయిపోయిన తరువాత దగ్ధం చేశారు. అయితే బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు కరకట్టకు రెండు వైపులా వ్యాపించాయి. అగ్నిమాపక దళం మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. చంద్రబాబు నివాసానికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. చంద్రబాబు నివాసానికి సమీపంలో అగ్ని ప్రమాదం జరిగిందన్న సమాచారంతో పెద్ద ఎత్తున జనం ఆ ప్రదేశానికి వచ్చారు. అయితే బాబు నివాసానికి ఎటువంటి ముప్పు లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. కరకట్టకు సమీపంలో పంటను దగ్ధం చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారంటూ స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/fire-accident-near-chandrababu-residence-25-136633.html





