Publish Date:Apr 11, 2026
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. అదే సమయంలో స్వామివారి లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ అంతకు మించి పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం తిరుమల లడ్డూ ప్రసాదం విక్రయాలు గతంలో ఎన్నడూ లేని అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రసాదం అమ్మకాల ద్వారా టీటీడీకి భారీ ఆదాయం కూడా సమకూరింది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. 2024-25 కాలంలో 12,18,53,535 లడ్డూలు అమ్ముడవగా, కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే అదనంగా సుమారు 1.76 కోట్ల లడ్డూల విక్రయాలు పెరగడం గమనార్హం. లడ్డూ ప్రసాదం విక్రయాలలో భారీ పెరుగుద తో టీటీడీకి సుమారు రూ. 567 కోట్ల మేర ఆదాయం లభించింది. భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుండటంతో, వారి అవసరాలకు తగినట్లుగా టీటీడీ ప్రస్తుతం రోజుకు సగటున 4 లక్షల లడ్డూలను ఉత్పత్తి చేస్తోంది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అధునాతన పద్ధతుల్లో ఈ ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి టీటీడీ ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తోంది. అంతకు మించి అదనంగా లడ్డూలు కావాలనుకునే భక్తులకు ఒక్కో లడ్డూ ప్రసాదాన్ని రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. పవిత్రమైన ఈ ప్రసాదం కోసం భక్తులు ఎంతటి రద్దీ ఉన్నా వేచి ఉండి మరీ కొనుగోలు చేస్తుండటం కద్దు.
భవిష్యత్తులో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో, లడ్డూ పోటు సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ప్రసాదం తయారీలో స్వచ్ఛమైన నెయ్యి, యాలకులు, ఇతర దినుసుల లభ్యతను ముందే సేకరించి నిల్వ ఉంచుతోంది. రాబోయే రోజుల్లో ఈ అమ్మకాల రికార్డులు మ కొత్త శిఖరాలను తాకడం ఖాయమని అధికారులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sales-of-laddu-prasadam-are-booming-36-217117.html
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.