Publish Date:Apr 30, 2022
విద్యుత్ కోతలు.. నీళ్లు లేవు.. రోడ్లు అధ్వానం … అసలు ఏపీలో మౌలిక సదుపాయాలే లేవు.. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఒంటికాలిపై లేచి మరీ కౌంటర్లు వేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు కేటీఆర్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ.. మీడియా వేదికలెక్కారు. అఫ్ కోర్స్… ఏపీ మౌలిక సదుపాయాల విషయంలో తాను చేసిన కామెంట్లపై రాత్రికి రాత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వివరణ కూడా ఇచ్చుకున్నారనుకోండి.. అది వేరే సంగతి.
అయితే.. ఒక పక్కన ఏపీ మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శల కౌంటర్ వేస్తున్న సమయంలోనే మంత్రి ఆర్కే రోజా మాత్రం.. కేటీఆర్ తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆయన నివాసంలో తన కుటుంబ సభ్యులతో సహా కలుసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. కేసీఆర్ ఆతిథ్యాన్ని, సన్మానాన్ని స్వీకరించడంతో పాటు కేసీఆర్ ను కూడా రోజా శాలువతో సన్మానించారు. ఒక పక్కన ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు- తెలంగాణ మంత్రి, ఎంపీ మధ్య వ్యాఖ్యల యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే మంత్రి రోజా కేసీఆర్ ఫ్యామిలీని కలుసుకోవడం చర్చనీయాంశం అయింది.
అక్కడితో ఆగని మంత్రి రోజా ‘కేటీఆర్ ను యంగ్ అండ్ డైనమిక్, ఇన్ స్పిరేషనల్ లీడర్ గా అందరం గుర్తిస్తాం’ అంటూ పొగడడం ఏపీ వైసీపీ నేతలకు ఏమాత్రం రుచించడం లేదని తెలుస్తోంది. అంతటితో సరిపెట్టకుండా రోజా.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా ఏపీ గురించి మాట్లాడి ఉంటారని తాను అనుకోలేదని చెప్పడం పలువురికి ఆశ్చర్యం, ఆగ్రహం కలిగిస్తోంది. ‘పొరుగు రాష్ట్రాలు అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ అనలేదు’ అంటూ సమర్థించేందుకు రోజా చేసిన ప్రయత్నం సామాజిక మాధ్యమంలో ఆమెను ట్రోల్ చేయడానికి మాత్రమే దోహదపడింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/roja-reaction-different-from-other-ministers-25-135255.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!