Publish Date:Apr 30, 2022
బుల్లి తెరపై విపరీతమైన ఫాలోయర్స్ ఉన్న రియాల్టీ షో బిగ్ బాస్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఆ షో వల్ల యువత చెడు మార్గంలో వెళుతున్నారని వ్యాఖ్యానించింది. బిగ్ బాస్ షోలో అసభ్యత, అశ్లీలం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రేక్షకాదరణ ఉన్నప్పటికీ అదే స్థాయిలో బిగ్ బాస్ రియాల్టీ షోపై విమర్శలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. సీపీఐ నారాయణ అయితే ఒక అడుగు ముందుకు వెళ్లి బిగ్ బాస్ హౌస్ బ్రోతల్ హౌస్ అంటూ ఘాటుగా విమర్శించారు. అసలు ఈ షోను నిలిపివేయాలని కోరుతూ 2019లోనే హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ పిల్ పై తాజాగా హైకోర్టు స్పందించింది. దీనిపై సోమవారం నుంచి విచారణ చేపడతామని పేర్కొంది. ఆ సందర్భంగానే షోపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. అంతటితో ఊరుకోకుండా పిల్ వేసిన వారిని అభినందించింది.
బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో...అంతే వివాదాస్పదంగా కూడా మారిన సంగతి తెలిసిందే. వినోదం పేరుతో ప్రదర్శితమౌతున్న ఈ షోలో వినోదం పేరిట అసభ్యత, అశ్లీలతకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే షో నిర్వాహకులు ఈ విమర్శలను కొట్టి పారేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు బిగ్ బాస్ షోపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇక పిల్ విషయానికి వస్తే జగదీశ్వర రెడ్డి అనే వ్యక్తి బిగ్ బాస్ షో వల్ల యువత పెడమార్గం పడుతోందని పేర్కొంటూ పిల్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైనే తాజాగా హైకోర్టు బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలు సమాజాన్ని పెడతోవ పట్టిస్తున్నాయని వ్యాఖ్యానించింది. సోమవారం నుంచి విచారణ చేపడతామని జస్టిస్ అసమద్దీన్ అమానుల్లా, జస్టిస్ రాజశేఖరరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/high-court-serious-in-big-boss-reality-show-25-135258.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!