విపత్తులలో లైఫ్ సేవింగ్ మిషన్...రోబో ర్యాట్!
Publish Date:Apr 24, 2022
Advertisement
విపత్తులు ఏర్పడిన సందర్భాలలో ఎందరో నిస్సహాయంగా మరణిస్తున్న సంఘటనలు కలచివేస్తుంటాయి. ముఖ్యంగా భూ కంపాలు సంభవించినప్పుడు, భవనాలు, వంతెనలు కుప్పకూలిన సందర్భాలలోనూ ప్రాణనష్టం అపారంగా జరుగుతుంటుంది. సహాయం అందక శిథిలాల కింద చిక్కుకుని ఊరిపాడక మరణించే వారి సంఖ్యే ఇటువంటి సందర్భాలలో అధికంగా ఉంటుంది. ఇటువంటి మరణాలను నివారించడం ఎలా అన్న దిశగా సెంటిస్టులకు చేస్తున్న కృషి ఒక కొత్త ఆవిష్కరణకు కారణమైంది.
సాంకేతిక పరిజ్ణానాన్ని వినియోగించుకోవడం ద్వారా నిస్సహాయంగా ఎవరూ మరణించే దుస్థితి లేకుండా చేయాలన్న వారి తపన నుంచి పుట్టుకు వచ్చిన కొత్త ఆవిష్కరణే రోబోటిక్ ర్యాట్. మర ఎలుక.
ఇది విపత్తు సమయాలలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని జాప్యం లేకుండా గుర్తించి సంకేతాలు పంపిస్తుంది. దాంతో అలా చిక్కుకున్న వారిని వెంటనే రక్షించే అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. బరువు తేలిక, కదలిక చురుకు అన్న విధంగా దీనిని రూపొందించారు. విపత్తుల సమయాలలో అపార ప్రాణనష్టాన్ని నివారించేందుకు ఈ రోబో ఎలుక సేవలు ఎంతైనా ఉపయుక్తంగా ఉంటాయని చెబుతున్నారు.
ఇప్పటికే రోబో ఎలుక పని తీరుకు సంబంధించి అన్ని పరీక్షలూ పూర్తయ్యాయనీ, విపత్తు సమయాలలో మానవ ప్రాణాలను కాపాడటంలో ఇది అందించే సేవలు అమూల్యమని చెబుతున్నారు. దీని పనితీరుకు సంబంధించిన వివరాలు, విశేషాలను ఐఈఈఈ ట్రాన్సాక్షన్ జర్నల్‌లో ప్రచురించారు. త్వరలో ఈ రోబో ఎలుక సేవలు అందుబాటులోకి వచ్చి విపత్తు సమయాలలో ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత మేర తగ్గించడానికి దోహదపడతాయని ఆశిద్దాం.
http://www.teluguone.com/news/content/robo-rat-life-saving-services-in-calamities-25-134898.html





