కడప నగర మేయర్ గా పాక సురేష్ ఏకగ్రీవం

Publish Date:Dec 11, 2025

Advertisement

కడప కార్పొరేషన్ మేయర్ గా వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో  పాక సురేష్ వినా మరెవరూ పోటీ చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.   గత ఎన్నికల్లో మేయర్ గా గెలిచిన సురేష్ బాబు కుటుంబ సభ్యులు మున్సిపల్ చట్టాలను అతిక్రమించి పనులు చేపట్టారనే‌ కారణంగా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు  నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు  కాంట్రాక్టులు పొందారని తేలింది. విజిలెన్స్ నివేదికను అనుసరించి సురేష్ బాబును ఈ ఏడాది సెప్టెంబర్ 23న మేయర్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. డిప్యూటీ మేయర్ గా ఉన్న ముంతాజ్ బేగంను ఇన్ చార్జి మేయర్ గా నియమించింది.  తాజాగా ఖాళీగా ఉన్న మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో వైసీపీ కార్పొరేటర్  పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

కడప కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్ లు ఉండగా గత ఎన్నికల్లో  టిడిపి నుంచి  ఒక్క కార్పొరేటర్ మాత్రమే గెలుపొందారు. ఒక ఇండిపెండెంట్ గిలిచారు. ఈ రెండూ మినహా మిగిలిన 48 డివిజన్ లలోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు.  అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మార డం, కడప ఎమ్మెల్యేగా టిడిపి నుంచి మాధవీ రెడ్డి గెలవడం జరిగింది .ఆ తర్వాత ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశంలో  చేరారు. ఇద్దరు వైసీపీ కార్పొరేటర్ లు మరణించారు. దీంతో దీంతో వైసిపి కార్పొరేటర్ల సంఖ్య సంఖ్య 38గా ఉంది. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా వైసిపి అనుకూలంగా ఉండటంతో వారి సంఖ్య 39 . ఆ కడప కార్పొరేషన్ లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ  ఉంది.

 సంఖ్యా బలం లేకపోవడంతో  గురువారం (డిసెంబర్ 11) జరిగిన మేయర్ ఎన్నికలో తెలుగుదేశం పోటీ చేయలేదు.  వైసీపీ నుండి   47 వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేస్ ను మేయర్  అభ్యర్థి పోటీకి దిగి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా గెలుపొందారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది.  

By
en-us Political News

  
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.