ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం
Publish Date:Oct 21, 2022
Advertisement
మధ్య ప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి ఘోరక్ పూర్ వెళుతున్న బస్సు మధ్య ప్రదేశ్ లోని సుహాగి పహారీ వద్ద శనివారం (అక్టోబర్22) తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి ఉత్తర ప్రదేశ్ లోని తమ స్వగ్రామానికి వెళుతున్న కూలీలు ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన 20 మందిని ప్రయాగ్ రాజ్ ఆసుపత్రికి తరలించారు. బాధితులందరూ యూపీకి చెందిన కూలీలేనని, దీపావళి పండుగ కోసం స్వగ్రామం వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు అందాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/road-accident-in-mp-14-people-dead-25-145859.html
http://www.teluguone.com/news/content/road-accident-in-mp-14-people-dead-25-145859.html
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026





