కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య: షర్మిల

Publish Date:Oct 21, 2022

Advertisement

ఏపీ సీఎం జగన్ అరాచకాలను రాష్ట్ర ప్రజలే కాదు.. సోంత కుటుంబీకులు కూడా భరించ లేకపోతున్నారు. ఇప్పటికే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అన్న సీఎంగా ఉన్న రాష్ట్రంలో తన తండి హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదంటూ వేరే రాష్ట్రానికి మార్చాలని సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక సొంత చెల్లి, తల్లి కూడా జగన్ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని ఆయనకు దూరంగా పొరుగు రాష్ట్రం తెలంగాణలో గడుపుతున్న సంగతి విదితమే.  అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని దూరంగా ఉంటున్న షర్మిల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబంలో జరిగిన దారుణ ఘటన బాబాయ్ వివేకా హత్యేనని చెప్పారు. ఆయనను హత్య చేసిన వారెవరో తెలియాలనీ, వారికి శిక్ష పడాలనీ అన్నారు. కాళేశ్వరం అవినీతిపై కాగ్ కు ఫిర్యాదు చేసేందుకు హస్తిన వెళ్లిన షర్మిల అక్కడ విలేకరులతో మాట్లాడారు. కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందని, అది వాస్తవమని ఆమె కుండబద్దలు కొట్టారు. వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అడుగడుగునా దర్యాప్తును అడ్డుకుంటున్నారనీ అన్న షర్మిల తన సోదరి సునీతకు న్యాయం జరగాలని పేర్కొన్నారు.  వివేకానంద రెడ్డిని హత్య కేసులో నిందితులకు శిక్షపడేలా ఆయన కుమార్తె షర్మిల న్యాయపోరాటం చేస్తున్న సంగతి విదితమే. ఈ హత్య కేసు దర్యాప్తు ఏపీలో అయితే నిష్పాక్షికంగా జరగదన్న ఆమె అభిప్రాయంతో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఏకీభవించడం.. సుప్రీం కోర్టుకు కూడా అదే నివేదించడం తెలిసిందే. ఏపీలో వివేకా హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని సుప్రీం కోర్టు సైతం వ్యాఖ్యానించిన నేపథ్యంలో షర్మిల కడప ఎంపీ సీటు కోసమే తన బాబాయ్ హత్య జరిగిందని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా సంచలనం సృష్టించాయి.   ఇప్పటికే సీబీఐ కడప ఎంపీగా తనకు టికెట్‌ ఇవ్వకపోతే... షర్మిలకు లేదా విజయలక్ష్మికి మాత్రమే ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ను వివేకా కోరారని... ఈ నేపథ్యంలోనే వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ఈ హత్య చేయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది.  వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ ప్రమేయంపై అనుమానాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు షర్మిల సూటిగా సమాధానం ఇచ్చారు. కడప ఎంపీ టికెట్ కోసమే తన బాబాయ్ హత్య జరిగిందన్నది వాస్తవమని కుండ బద్దలు కొట్టారు. తమ  కుటుంబంలో జరిగిన ఘోరం తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్య అన్న షర్మిల సునీతకు న్యాయం జరగాలి. మా చిన్నాన్నను   ఘోరంగా హత్య చేశారో వారి పేర్లు బయటికి రావాలి. శిక్ష పడాలి. దీన్ని ఎవరూ అడ్డుకోడానికి వీల్లేదని చెప్పారు. 2019 ఎన్నికల ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  ఆయన సొంత నివాసంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తొలుత ఆయనది సహజమరణమని, గుండెపోటుతో మరణించారనీ పేర్కొన్న జగన్.. ఆ తరువాత ఆయన హత్య వెనుక అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఉన్నారని ఆరోపణలు గుప్పించిన సంగతి విదితమే. విపక్ష నేతగా వివేకా హత్య కేసు సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసిన జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారు. అయితే వివేకా కుమార్తె సునీత మాత్రం తన తండ్రిని దారుణంగా హత్య చేసిన వారికి శిక్ష పడాల్సిందే నంటూ సీబీఐ దర్యాప్తును కోరారు. ఇప్పుడు ఏపీలో హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదనీ, వేరే రాష్ట్రానికి మార్చాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. సునీత వాదనతో కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఏకీభవించింది. కేసు విచారణ వేరే రాష్ట్రానికి మార్చాలని కోరింది. సుప్రీం కూడా అంగీకరించింది.  

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.