మునుగోడు ఉప ఎన్నిక.. కేసీఆర్ కాడి వదిలేశారా? బీజేపీ విజయానికి మార్గం సుగమం చేశారా?

Publish Date:Oct 22, 2022

Advertisement

మునుగోడులో ఏం జరుగుతోంది. ఉప ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు. ఆయన ఫోన్ చేసి ఆహ్వానించడం తరువాయి.. గతంలో టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి వెళ్లిపోయిన ఇద్దరు ఈఘమేఘాల మీద ప్రగతి భవన్ చేరుకుని గులాబీ కండువా కప్పుకున్నారు. బీజేపీకి గుడ్ బై చెప్పి స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ లకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గులాబీ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు.

మరో వైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి పార్టీలోనే తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనీ, మునుగోడు ఓటమిని సాకుగా చూపి తనను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని చూస్తున్నారనీ ఆరోపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అందుకు తగ్గట్టుగానే పార్టీలకు అతీతంగా కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డికి ఓటేయాలంటూ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ సంభాషణ లీక్ కావడం రేవంత్ ఆరోపణలకు బలం చేకూర్చింది.   అ ఫోన్ లో తన అన్న వెంకటరెడ్డి మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదంటూ మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సమర్ధించారు.

ఈ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు మునుగోడులో ఓటమిని కాంగ్రెస్   ఇప్పుడే అంగీకరించేసినట్లుందని   విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ లు పార్టీ వీడడం వల్ల తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదనీ, వాళ్లిద్దరూ ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోయారని వ్యాఖ్యానిస్తోంది. మునుగోడులో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. టీఆర్ఎస్ లో అయితే ఇప్పటికీ మునుగోడులో ఆ పార్టీ వ్యూహాలేమిటి? ఆపరేషన్ ఆకర్ష్ వల్ల మునుగోడులో గెలుపునకు మార్గం సుగమమౌతుందా అంటే ఏమో అన్న సమాధానం పార్టీ శ్రేణుల నుంచే వస్తోంది. మునుగోడులో పార్టీ కాడి విదిలేసిందా అన్న అనుమానం కలుగుతోందని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల నాటికి ఉన్న కాన్ఫిడెన్స్ ప్రస్తుతం పార్టీ అధినాయకత్వంలో కనిపించడం లేదని అంటున్నారు. మునిసిపాలిటీకి ఇద్దరు ఎమ్మెల్యేల చొప్పున ఇన్ చార్జ్ లుగా నియమించి ప్రచార బాధ్యతలను అప్పగించిన కేసీఆర్ తాను స్వయంగా ఒక గ్రామానికి ఇన్ చార్జిగా ప్రకటించుకున్నా కూడా పార్టీ క్యాడర్ లో కానీ, నాయకులలో కానీ విజయంపై ధీమా వ్యక్తం కావడం లేదు. దుబ్బాక, హుజారాబాద్ ఉప ఎన్నికల ఫలితాలే పునరావృతం కాబోతున్నాయా అన్న అనుమానం పార్టీలో క్యాడర్ నుంచి లీడర్ వరకూ వ్యక్తమౌతోందని అంటున్నారు. మరీ ముఖ్యంగా కేసీఆర్ హస్తిన పర్యటన ముందు వరకూ కనిపించిన ధీమా ఆ తరువాత కనిపించడం లేదని అంటున్నారు. కీలకమైన సమయంలో ఇన్ చార్జిలకు బాధ్యత అప్పగించి హస్తిన వెళ్లిన కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికను పట్టించుకోకుండా అక్కడే పది రోజులు మకాం వేయడంతో మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కేసీఆర్ చేతులెత్తేశారా అన్న అనుమానాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా పార్టీ శ్రేణుల్లో కూడా ఇవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత పార్టీ ప్రచార సరళిపై సమీక్ష చేయాల్సింది పోయి.. మునుగోడుతో సంబంధం లేని వ్యక్తులను ఆపరేషన్ ఆకర్ష్ పేరిట పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని చేపట్టడంపై క్యాడర్ లో పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కేసీఆర్ ముందే ఊహించేశారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎంత కష్టపడినా ఫలితం ఉండదన్న అంచనాతోనే.. మునుగోడు ఉప ఎన్నికను వదిలేసి.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడే దృష్టి సారించారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల నుంచే వ్యక్తమౌతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆయన ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారని అంటున్నాయి. మరీ ముఖ్యంగా   గట్టి పోటీ ఇస్తే.. అది కాంగ్రెస్ కు ఏదో ఒక మేర ప్రయోజనం చేకూర్చుతుందన్న ఉద్దేశంతోనే కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికను లైట్ తీసుకున్నారా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద మునుగోడును మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కిక్కిరిసిపోయేలా చేసి కూడా కేసీఆర్ ఉప ఎన్నిక లో విజయంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనీ, ఎన్నికకు ముందే కేసీఆర్ ప్రదర్శిస్తున్న ఈ ఉదాశీనతకే.. ఆయన ఇటీవలి డిల్లీ పర్యటనకూ ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కుమార్తెను డిల్లీ లిక్కర్ స్కాం నుంచి బయటపడేయడానికి ఆయన హస్తినలో బీజేపీ పెద్దలతో ఏదైనా రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా అన్న అనుమానాలు పార్టీ క్యాడర్ నుంచే వ్యక్తం అవుతుండటం గమనార్హం. ఏది ఏమైనా వేర్వేరు కారణాలతో మునుగోడు ఉప ఎన్నికలలో పోరును కాంగ్రెస్, ఆఆర్ఎస్ లు మధ్యలోనే ఆపేశారనీ, దీంతో అక్కడ బీజేపీ విజయం నల్లేరుమీద బండినడకగా మారిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సెంటిమెంట్ లను విపరీతంగా నమ్మే కేసీఆర్ గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ముందు టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు వచ్చినా ఆ రెండు ఉప ఎన్నికలలోనూ పార్టీ అభ్యర్థులు పరాజయం పాలైనప్పటికీ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల ముంగిట మళ్లీ పార్టీలోకి వలసలకు తెరతీయడం పలు అనుమానాలకు తావిస్తోందని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంద.

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.