జ‌గ‌న‌న్న శ‌భాష్ ల   కోసం మ‌హిళా మంత్రుల పోటా పోటీ!

Publish Date:Jul 14, 2022

Advertisement

దేశ రాజ‌కీయాల్లోకి మ‌హిళ‌లు మ‌రింత ఉత్సాహంగా వ‌స్తుండ‌డంతో చాలా కాలం నుంచీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మ‌ధ్య ప‌ని పోటీ బాగానే సాగుతోంది. ప్ర‌తీ ఒక్క‌రికీ త‌మ నాయ‌కుని, సీఎం చేత శ‌భాష్ అనిపించుకోవాల‌న్న ఆతృత వుంది. కాబోతే కొంద‌రు నిదానం ప్ర‌ధానం, మ‌రి కొంద‌రు ర్యాకెట్ వేగం, ఇంకొంద‌రు ప‌రిస్థితుల‌ను అనుస‌రించి న‌డ‌చుకోవ‌డం చూస్తున్నాం. మంత్రిమండ‌లిలో ఒక్క‌రి ద్ద‌రు మంత్రులు త‌ప్ప మ‌గ‌వారిలో చాలామంది ప‌నితీరుప‌ట్ల ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చిందులు తొక్కుతున్నారు. కానీ ఆ సంగ‌తి బ‌య‌టికి తెలియ‌నీయ‌డం లేదు. అది గ్ర‌హించుకున్న‌వారు కాస్తంత జాగ్ర‌త్త‌ప‌డే ప‌నిలో వున్నారు. ఈ ద‌శ‌లో జ‌గ‌న్ క్యాబినెట్‌లోని మ‌హిళా మంత్రులు ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలం చేసుకోవ‌డానికి శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ జ‌గ‌న‌న్నతో శ‌భాష్ అనిపించుకోవాల‌ని రెండింత‌లు ఉత్సాహంప్ర‌ద‌ర్శిస్తున్నారు. 

వైయస్ జగన్ మలి కేబినెట్‌లో నలుగురంటే నలుగురు మహిలు ఉన్నారు.  వారిలో  మంత్రులుగా ఆర్కే రోజా, విడదల రజినీలు మాత్రం కుందేళ్లులాగా దూసుకుపోతున్నారనే   టాక్  అయితే  వెలగపూడి సచి వాలయం సాక్షిగా హాట్ హాట్‌గా నడుస్తోందట. ఇక మిగిలిన ఇద్దరు  తానేటి వనిత, ఉష శ్రీ చరణ్‌లు మాత్రం  తాబేళ్ల‌తో పోటీ పడిపోతున్నారట.  అయితే  వీరిలో తానేటి వనిత  జగన్ తొలి కేబినెట్‌లోనే  కాదు. మలి కేబినెట్‌లో సైతం చోటు దక్కించుకొని అదీ కూడా  సీఎం తర్వాత పోస్ట్ అంటే హోం మంత్రి గా పెద్ద‌ ఛాన్స్ కొట్టేసిందని ఫ్యాన్ పార్టీలోని మహామహులు సైతం ఆవిడ  ఆదృష్టం చూసి ఈర్ష్య చెందుతో న్నారనే టాక్ .  కానీ ఆమె తన శాఖపై ఇప్పటికీ పట్టు సాధించలేదనే చర్చ సచివాలయంలో సాగుతోంద ట. ఇక మరో మంత్రి ఉషా శ్రీచరణ్ పరిస్థితి  కూడా దాదాపుగా  అదే తీరులా  ఉందట.

మరోవైపు వీరి మంత్రివర్గ సహచరులు విడదల రజినీ, ఆర్కే రోజాలు నువ్వా, నేనా అనే టైప్‌లో మంత్రు లుగా స‌త్తా చాటుతున్నారు. ఈ క్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో తరచు వీరిద్దరు సమీక్ష సమా వేశాలు సైతం నిర్వహిస్తున్నారట. అయితే ఎక్కడ ఎలాంటి  సమస్య వచ్చినా  వీరిద్దరు వెంటనే  స్పంది స్తున్నారని,  అలాగే పార్టీ  తరఫున సైతం తమదైన  శైలిలో వాయిస్ వినిపించేస్తున్నారనే  చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో వున్న‌ట్టు వార్త‌. 

ఇక  ప్రతిపక్ష పార్టీల నేతల కామెంట్స్‌పై వీరిద్దరు  నాని బ్రదర్స్ అంతగా కాకుండా  ఆచితూచి మాట్లా డుతూ కౌంటర్లు ఇస్తున్నారని  అయితే  ఈ  విషయంలో  మంత్రి రజినీని  ఆర్కే రోజా  ఓవర్ టేక్  చేసే సిందని ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం  వారే గుర్తు చేస్తున్నారట. వీళ్లీద్దరు ఇంత క్రమశిక్షణ కలిగిన వారిలాగా ఇంత పొందికగా, మంత్రులుగా తమ పని  తాము చేసుకోంటూ,  పోటా పోటీగా దూసుకు పోవడం చూసి వెలగపూడి సచివాలయంలోని సిబ్బంది సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.

అయితే  వీరి ఇంతలా క్రమశిక్షణగా మెలగడం వెనుక పెద్ద కథే ఉందనే  ఓ చర్చ అయితే సదరు  సచి వులు కొలువు  దీరిన సచివాలయంలో నడుస్తోందట. తానేటి వనిత, ఆర్కే రోజా, విడదల  రజినీలు ముగ్గు రు గతంలో టీడీపీలో సైకిల్ సవారీ చేసిన వారే. అయితే ఆర్కే రోజా 2014, 2019 లో జగన్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచింది.  2019 ఎన్నికల్లో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమెకు మాత్రం ఏపీఐఐసీ చైర్మన్ పదవిని సీఎం జగన్  కట్టబెట్టారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ  జగన్  మలి కేబినెట్‌లో ఆమె పర్యాటక శాఖతోపాటు పలు కీలక శాఖల మంత్రిగా ఛాన్స్ కొట్టేసి దూసుకుపోతున్నారు.   

అయితే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మ‌రీ ముఖ్యంగా ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో ఆమెకు అసమ్మతి సెగ  అలా ఇలా కాదు  గట్టిగానే ఉంది. అందుకు ఆమె రెండో సారి ఎమ్మెల్యే అయి మంత్రిగా పదవి చేపట్టే వరకు అంటే దాదాపు మూడేళ్ల పాటు.. ఆమె నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామా లు అందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఆమె నియోజకవర్గంలోని దాదాపు 80 శాతం మంది లీడర్ నుంచి కేడర్ వరకు అంతా  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  చేతిలోకి వెళ్లి చిక్కుకుపోయింది.

ఆ క్రమంలో నగరి నియోజకవర్గంలో అసమ్మతి సెగను ఆర్కే రోజా ఒకానొక సమయంలో తట్టుకోలేక తాడే పల్లి ప్యాలెస్ తలుపు సైతం తట్టిందని.. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డిని ప్యాలెస్‌లోని పెద్దలంతా కూల్ చేశా రని సమాచారం. అనంతరం ఆర్కే రోజాకి మంత్రిగిరి వచ్చి ఆమె ఓళ్లోకి వాలిందని.. అందుకే  ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే  నేరుగా  తన రాజకీయ ప్రత్యర్థి మరో మంత్రి పెద్దిరెడ్డి కాళ్లకు నమస్కారం చేసిందనే ఓ టాక్ అయితే నగరి నియోజకవర్గంలో నేటికి ఉంది. అయితే వచ్చే ఎన్ని కల్లో మళ్లీ గెలుపు అంత సులువు కాదని.. ఈ నేపథ్యంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుం టూ ముందుకు సాగితేనే.. ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యేగా గెలుపొందుతామనే  ఆలోచనలో  రోజా ఉన్నట్లు ఆమె వర్గం పేర్కొంటోందట.     

ఇక మరో మంత్రి విడదల రజినీ. ఈమెగారి  బుర్ర పాదరసం టైప్ అని ఇప్పటికే సచివాలయంలో గుస గుసలు మొదలైనాయట. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.. ఎక్కడ, ఎప్పుడు, ఎలా దూసు కుపోవాలి అప్పటి కప్పుడు నిర్ణయం తీసుకుని మరీ దూసుకుపోతోందట. దీంతో మంత్రి రజినీ అంత ర్యం ఆమె వెంట ఉండే  సిబ్బందికే సైతం అంతగా అంతుబట్టదనే  ఓ టాక్ అయితే  సచివాలయంలో  నడుస్తోంది.

ఇక  వైద్య ఆరోగ్య శాఖ అంటేనే అత్యంత కీలక శాఖ.. అలాంటిది 32 ఏళ్లకే  ర‌జ‌ని మంత్రిగిరి  కొట్టేసిందనే ఓ భావన ఇప్పటికే ఫ్యాన్ పార్టీలో తలపండిన నేతల్లోనే కాదు.. చిలకలూరిపేట నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నేతల్లో సైతం గట్టిగానే ఉందట. ఈ విషయాన్ని పసిగట్టిన ఈ మాజీ సాప్ట్‌వేర్  ఇంజినీర్  ప్లస్ ప్రస్తుత మంత్రిగారు.. తనదైన  శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా ఉం టూనే తన పార్టీలోని అదీ తన సొంత నియోజకవర్గంలోని  అసమ్మతి నేతలను  తన వర్గంలోకి  తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో, ఎలా  చేయాలో అంత సైలెంట్‌గా చేస్తుందని సమాచారం.

తన నియోజవకర్గంలోని ప్రజల్లో వైయస్ జగన్ ప్రభుత్వంపై అసమ్మతి ఉన్నా, ప్రతిపక్ష టీడీపీ బలంగా ఉన్నా తాను మాత్రం మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ఓ రీతిలో ఆమె చాలా పకడ్బందీగా పావులు కదుపు తోన్నట్లు సమాచారం. ఏదీ ఏమైనా ఫ్యాన్ పార్టీలో నలుగురు మహిళా మంత్రులు ఉన్నా,  వారిలో ఇద్దరు సైలెంట్‌గా ఉంటే.. మరోద్దరు మాత్రం తమ పనితనంలో మ‌రీ దూకుడుగా దూసుకుపోతున్నారనే మాట సచివాలయం సాక్షిగా విన‌ప‌డుతోంది.

ఇక్క‌డ మొత్తంమీద గ‌మ‌నించాల్సిందేమంటే, ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్ట‌డానికి, జ‌గ‌న్ ప‌రువు ను కాపాడేందుకు పాటుప‌డుతున్న ఇద్ద‌రు మ‌హిళా ర‌త్నాలు..ర‌జ‌నీ, రోజాలు ఇద్ద‌రూ తెలుగు దేశం పార్టీ నుంచి వైసీపీలోకి దూకిన‌వారే  కావ‌డం గ‌మ‌నార్హం

By
en-us Political News

  
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.