Publish Date:Jul 14, 2022
దేశంలో భక్తి పారవశ్యానికి తక్కువేమీలేదు. ప్రతీదీ మతం, భక్తితో ముడిపెట్టేయడం అనాదిగా దేశంలో వస్తున్నదే. పిల్లాడికి బాగోలేకపోయినా, పిల్లదానికి పెళ్లికాబోయినా, కాలేజీ సీటు, విదేశాలకు వీసా రాక పోయినా కూడా దేవుడిమీదే భారం వేయడం బాగా అలవాటయిపోయింది. అందుకే దేశంలో బాబాల హడావుడి ఎక్కువైపోయింది. అయితే ఈ బుల్లెట్ బాబా సంగతి వేరు. దేశంలోని అనేక దేవాలయాల్లో ఈ బులెట్ బాబా గుడి ఒకటి. ఇది రాజస్థాన్ జోధ్‌పూర్‌లో వుంది. దీని చుట్టూ కూడా భక్తగణం తెగ తిరుగు తూంటారు.
ఇంతకీ బులెట్ బాబా గుడి అనగానే అక్కడ ఏ సాయిబాబా విగ్రహమో వుంటుందనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇక్కడ అలాంటిదేమీ లేదు. చిత్రంగా ఒక 350 సిసి రాయల్ ఎన్‌ఫీల్డ్ బులెట్ వుంది. దీన్ని పూజించడానికి జోధ్‌పూర్ జనాలే కాదు చాలా దూర ప్రాంతాల నుంచీ కూడా భక్తులు క్యూ కడుతున్నారు.
ఈ జోధ్‌పూర్ గుడిని చాలాకాలం నుంచి ఇక్కడివారంతా బులెట్ బాబా గుడి అనే పిలుస్తున్నారు. కానీ దీని అసలు పేరు ఓం బన్నా ధామ్. ఇంత చక్కటి పేరుండగా బులెట్ పేరు ఎందుకు పెట్టారని చాలామంది చాలారోజులు తెగ ఆలోచించారు. దీనికి ఒక ఆసక్తికర కథ వుంది. ఈ గుడి జోధ్‌పూర్ నుంచి 50 కి.మీ దూరంలోని పాలి పట్టణం సమీపంలోని చోటిలా గ్రామంలో వున్నది. 1988 డిసెంబర్ 2న ఓమ్ బన్నా అనే పెద్దాయన సందీరా సమీపంలోని బాంగ్దీ నుంచి ఈ గ్రామానికి బయలుదేరారు. ప్రయాణంలో ఆయన అదుపు తప్పి ఒక చెట్టుకి గుద్దుకోవడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి కొంత దూరంలో గుండలో పడింది.
మర్నాడు ఉదయం పోలీసులు ఆ మోటార్‌సైకిల్‌ను దగ్గరున్న పోలీసు స్టేషన్‌కు తీసికెళ్లారు. చిత్రంగా మర్నాడు ఆ బండి స్టేషన్‌లోంచి మాయమైంది. పోలీసు స్టేషన్ నుంచి ఎవరు దొంగిలించారబ్బా అనుకు న్నారు పోలీసులు. తీరా చూస్తే సరిగ్గా ఆ ప్రమాదం జరిగిన చోటనే మళ్లీ దొరికింది! పోలీసులకు, అక్కడి జనానికి ఆశ్చర్యమేసింది. ఇదెలా సాధ్యమని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. పోలీసులు మళ్లీ దాన్ని స్టేషన్‌కు తీసికెళ్లారు. అయితే ఈ సారి గొలుసులతో కట్టేసారు. చిత్రమేమంటే మర్నాడు ఉదయంచూస్తే మళ్లీ బండి గాయబ్! ఇలా మాయం కావడంతో ఆ బండికి బులెట్ బాబా అని పేరు వచ్చింది. అమాంతం దానికేదో మంత్రశక్తి వుందని ప్రజలు నమ్మేశారు. అంతే అనుకున్నదే తడవున అక్కడ గుడి నిర్మించారు. అదే బులెట్ బాబా గుడిగా ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్ జోధ్‌పూర్ వెళితే దర్శించండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bullet-baba-temple-39-139735.html
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.