కాంగ్రెస్ గెలుపుపై రేవంత్ ధీమా ...సీనియర్ల సందేహం
Publish Date:Jul 12, 2022
Advertisement
నో డౌట్, అనుమానం లేదు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ,గట్టి పట్టున్న నాయకుడు. అయిపొయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీని బతికించారు. జీవం పోశారు. అంతవరకు ఓకే, కానీ, అంత మాత్రం చేతనే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసిందని, వచ్చేస్తోందని అనుకుంటే, పొరపాటే అవుతుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. విశ్వాసం మంచిదే కానే, అతి విశ్వాసం అనర్ధదాయకం. అది అహంకారానికి డారి తీస్తుంది. ఇప్పటికే, రేవంత్’ రెడ్డిలో అహంకార ధోరణి కొంచెం చాల ఎక్కువగా ఉందని పార్టీ వర్గాల్లో ఒక అభిప్రాయం బలంగా ఉందని అంటారు. ఇటీవల ‘రెడ్లే ది బెస్ట్’ అన్ని పార్టీలు పార్టీ పగ్గాలు రెడ్లకే అప్పగించాలని రేవంత్ చసిన ప్రకటన ఆయన అహంకార ధోరణికి నిదర్శనంగా పార్టీ వర్గాల్లో, ఈరోజుకూ చర్చ జరుగుతోందని అంటున్నారు. ఈ అహంకార ధోరణిని అదుపు చేసుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్న నేపధ్యంలో, అహంకారం ఆవేశం తగ్గుంచుకుని ఆలోచన పెంచుకోవడం అవసరం. 1979 సీనియర్ నాయకులు లేకుండానే,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చంది, కాబట్టి ఇప్పుడూ వస్తుందని అనుకోవడం, ప్రతి పదేళ్ళకు ఒక సారి అధికారం మారుతోంది కాబట్టి, ఆ సర్కిల్’ ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశించడంసరి కాదని అంటున్నారు. అది కుడా ఎవరో అంటున్న మాట కాదు, కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తున్న ఇన్సైడ్’ టాక్. ఈ సంవత్సర కాలంలో, పార్టీలో కొంత ఉపు వచ్చింది. అంతకు ముందుకంటే కొంత జోష్’ పెరిగింది. జనంలోకి వెళ్ళే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విభిన్న వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా సమస్యల ఆదరంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ ‘లో రైతు భరోసా యాత్ర పేరిట, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చారు. వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతులకు హంమీలు ఇచ్చారు. అయినా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ సీట్ల లెక్క కనీసం మూడంకెల సఖ్యను చేరుకోలేదు. అంతకు ముందు (2014) సఖ్యకంటే కేవలం ఐదారు సీట్లు మాత్రమే అదనంగా లభించాయి. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.అలాగే, అస్సాం, ఉత్తరాఖండ్, అంతకు ముందు కేరళ రాష్ట్రాలలో వంతుల వారీ అధికార మార్పిడి ఆనవాయితికి గండి పడింది. కాంగ్రెస్ ఖాయంగా అధికారంలోకి రావలసిన రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రాలేక పోయింది. సూ .. ఉమ్మి ఆంద్ర రాష్ట్రంలో పదేల్లకోమారు అధికారం మారింది కాబట్టి ఇప్పడు కూడా అధికారం చేతులు మారి, కాంగ్రెస్ ఒళ్ళో వలుతుందని అనుకోవడం, కడుపుతో ఉన్నమ్మ కనక మానదు అన్నట ధీమాను పెంచుకోవడం అంత మంచిది కాదని, పార్టీ సేనియర్ నాయకులే హెచ్చరిస్తున్నారు. అలాగే, పార్టీ సభ్యత్వం పార్టీ ఎదుగుదలకు ఒక కొలమానం, ఒక ప్రామాణికమ అవుతుందే కానీ, అదే గెలుపుకు అదే మూలాధారం మాత్రం కాదు. కాలేదు. అయితే రేవంత్ రెడ్డి, ‘విన్నింగ్ ఎలక్షన్స్ మేడ్ ఈజీ’ అన్నట్లుగా, 45 లక్షల సభ్యత్వం చేశాం కాబట్టి, 45 లక్షలు ఇంటూ రెండు .. 90 లక్షల ఓట్లు.. సో .. గెలుపు హస్తం పార్టీదే ... అరా చేతిలో లెక్కలు కడుతున్నారు. ఇలాంటి ఆలోచనలు, నిజమనిపించే కలలు ఆ కాసేపు బాగుందవచ్చును కానీ, కళ్ళు తెరిచి ఆలోచిస్తే మాత్రం, రాహుల్ గాంధీ ఆలూ ... సోనా (ఇటునుంచి ఆలూ పెడితే అటు నుంచి బంగారం వస్తుంది) వంటి కామెడీ కామెంట్’లా కొంచెం చాలా నవ్వు తెప్పించేలా ఉందని గాంధీ భవన్’లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలలో గెలవడం అంత ఈజీ అయితే, కాంగ్రెస్ వరస పెట్టి ఒక్కొక రాష్ట్రంలో ఎందుకు ఓడి పోతోంది. ఇన్నిన్ని కార్యక్రమాలు, కస్టాలు ఎందుకు, ప్రెస్ మీట్’లు, గొంతు చించుకోవడాలు, గోడలేసి కొట్టటాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా, రేవంత్ రెడ్డి సర్వేలు చూసి మురిసిపోవడం, మరీ మరీ విడ్డూరంగా ఉందని, కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోగొట్టుకుందో అక్కడ వెతుక్కోవడం మానేసి, ఆకాశానికి నిచ్చెనలు వేయడం వలన ప్రయోజనం ఉండదని, రేవంత్ వెంట ఉన్న నాయకులే అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య అంతర్గత కుమ్ములాటలు. రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయింది. అయినా, ఈ రోజుకూ మూడొంతుల మంది సీనియర్ నాయకులు, అయన నాయకత్వాన్ని అంగీకరించడం లేదు.అలాగే, విశ్వసనీయత. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే, ఎమ్మెల్యేలు తెరాసకు అమ్ముడు పోతున్నారు, గత ఎన్నికలో 18ని గెలిపిస్తే మిగిలింది ఆరుగుఋ మాత్రమే.. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వసం కోల్పోయిందని అంటున్నారు. అందుకే, రేవంత్ రెడ్డి, అసలు సమస్యలు వదిలేసి, తమ ఇమేజ్’ని పెంచుకునే ప్రయత్నం చేస్తే, ఆయన మరో సిద్దూ అవుతారని అంటున్నారు.
రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయింది.
అయితే,ఇల్లు అలకగానే పండగ కాదు. పండగ రాదు. అలాగే, కార్యక్రమాలకు జనం వచ్చినంత మాత్రాన అలా వచ్చిన జనం అంతా ఓట్లేస్తారని అనుకో లేము. హమీలు బాగున్నాయనీ ఓట్లు వేయరు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్, ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.6000 ల వంతున్న సంవత్సరానికి రూ.72 వేల రూపాయలు లబ్దిదారుల ఖాతాల్లో వేస్తమాని హంమీ ఇచ్చారు. ఇంకా చాలా హమీలిచ్చారు.
http://www.teluguone.com/news/content/revanth-confident-of-congress-win-seniours-doubt-25-139576.html





