Publish Date:Jul 12, 2022
పూర్వం ఎన్టీఆర్‌ను ఎంతో ప్రేమగా తమ వాడిగా చేసుకుని ఎన్టీవోడు అన్నారు యావత్ ఆంధ్రాజనం. 99 ప్రపంచకప్ విజయం తర్వాత ధోనీ పేరుతో ట్యాటూలు వేయించుకున్నారు అమ్మాయిలూ, క్రికెట్ పిచ్చా ళ్లు. అభిమానానికి, వీరాభిమానానికి పెద్ద తేడా లేకపోవచ్చుగాని, దాన్ని తెలియజేయడంలో మాత్రం చాలా తేడా చూపుతారు సదరు వీరాభిమానులు. వీరాభిమానులు రాజకీయనాయకులకూ వుంటారు. ప్రస్తుతం అంతటి వీరాభిమాని అభిమాన వర్షంలో తడిసి ముద్దై పలుకించిపోతున్నది మాత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబు అనే అనాలి.
తమ నాయకుడు ఓ చిన్నపాటి మంచి పని చేస్తే కటౌట్‌కి పాలాభిషేకం చేసేస్తున్నారు ఈ రోజుల్లో. అలాం టిది ఆంధ్రాలో మళ్లీ అధికారంలోకి రావడానికి పార్టీని నాలుగింతలు ఉత్సాహపరిచి కదం తొక్కుతున్న చంద్రబాబు పట్ల ఇంకెంతటి వీరాభిమానం వుండాలి. తమ నాయకుడు తప్పకుండా రాష్ట్ర ప్రజానీకానికి గొప్ప మేలు చేస్తాడన్ననమ్మకం కుదరాలేగాని వీరాభిమానానికి అంతుండదు, ఉత్సవాలు చేసుకుంటా రు, స్వీట్లు పంచుకుంటారు, వూరూరా భారీ ప్రచారానికి దిగుతారు. వీటికి దేనికీ నాయకుడినో, పార్టీ వర్గా లనో డబ్బులిమ్మని అడగరు.. వాళ్ల సొంత ఖర్చుతోనే అన్నీ చేస్తారు. దీన్ని పిచ్చనండి, మరేదయినా అనండి.. అసలు పేరు మాత్రం వీరాభిమానం.
అదుగో అలాంటి వీరాభిమానం మరో పేరు కృష్ణ. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ మళ్లీ అధి కారంలోకి రావాలని కలలు గనడమే కాదు, అది సాకారమయ్యే వరకూ గొప్ప కఠోర దీక్ష చేస్తున్నాడు. వీర తాడు వేసుకున్న కృష్ణ అందుకు ఒక వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నాడు. విజయవాడ కు చెందిన కృష్ణ అనే టీడీపీ కార్యకర్త ప్రజా చైతన్య సైకిల్ యాత్ర చేపట్టారు. విజయవాడ నుండి హిందూపురం వరకు చేపట్టిన సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం సంగంకి చేరాడు. సైకిల్ కి టీడీపీ జెండాలు కట్టుకుని.. ప్రత్యేకంగా బోర్డు లు ఏర్పాటు చేసుకుని యాత్ర చేస్తున్నాడు. దర్మపరిపాలన కావాలి టీడీపీ గెలవాలి అనే నినాదం తో యాత్ర చేపడుతున్నట్లు తెలిపాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ సైకిల్ యాత్ర కొనసాగిస్తానని పేర్కొన్నాడు. నాయకుడి కంటే వీరాభిమానే గొప్పవాడు, నాయకుని విజయానికి ఇలాంటి వీరాభిమాని కఠోర దీక్ష శక్తినిస్తుంది. ఈ శక్తి అపారమైనది. ఇలాంటి శక్తులు రాష్ట్రంలో ఎల్లవేళలా పార్టీకి కొత్త వూపిరినిచ్చి ముందడుగు వేయిస్తుంది. శభాష్ కృష్ణ! జయహో టిడీపీ! అన్నదే ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల నినాదం అయ్యింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-fan-cycle-tour-till-babu-becoms-cm-25-139572.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.