తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. గన్నవరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. అయితే, ఆయనపై కేవలం పవన్ కళ్యాణ్ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను దూషించారనే కారణంతోనే కాకుండా, అత్యంత కఠినమైన  ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. కేవలం దళిత క్రిస్టియన్ శంఖారావం సభలో మాట్లాడిన వ్యాఖ్యల కోణంలోనే కాకుండా..  ఆయన వెనుక ఉన్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో ఎండగట్టారు. గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం. ముఖ్యంగా గత ఏడాది నవంబర్‌లో ఆయన విడుదల చేసిన కొన్ని వీడియోలను పోలీసులు పెన్ డ్రైవ్ రూపంలో న్యాయస్థానానికి సమర్పించారు. నిషేధిత సీపీఐ (ఎంఎల్) మావోయిస్టు సంస్థకు చెందిన కేశవరావు, హిడ్మా వంటి అగ్రనేతలను కీర్తిస్తూ..  వారు అమరజీవులని, మళ్లీ పుడతారని, యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని రావణ్ వ్యాఖ్యానించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అమాయక గరిజన యువతను టార్గెట్ చేసుకుని దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించేలా ఈ ప్రసంగాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. ఈ పరిణామాలపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ  రామకృష్ణ తెలుగువన్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఉపా' చట్టం కింద ఒకసారి కేసు నమోదైతే సాధారణ ఐపీసీ సెక్షన్లలాగా బెయిల్ రావడం సులభం కాదన్నారు. అయితే.. ఈ చట్టాన్ని శాంతిభద్రతలు సజావుగా ఉన్న ఏపీలో ప్రయోగించడం ఆందోళన కు గురిచేస్తోందనీ,  ప్రభుత్వం మారిన ప్రతిసారీ ఒకరు నేరస్థుడిగా, మరొకరు ప్రజాసేవకుడిగా మారిపోయే సంప్రదాయం సరికాదన్నారు. ప్రస్తుతం ప్రశ్న రావణ్ ముందున్న ఏకైక మార్గం హైకోర్టును ఆశ్రయించడమేనన్న ఆయన..  ప్రశ్న రావణ్.. ఆయన తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్  దాఖలు చేసి, ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరే అవకాశం ఉందన్నారు. హైకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాల ద్వారా వీడియో కంటెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి..  ఒకవేళ ఆ ప్రసంగాల వల్ల సమాజంలో తక్షణ నష్టం లేదా హింస జరగలేదని భావిస్తే రావణ్‌కు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని  రామకృష్ణ అభిప్రాయపడ్డారు.  Prashna Ravana Arrest AP, Former Judge Ramakrishna Interview,  UAPA Case Andhra Pradesh, Ravana Remand Report, AP Politics Telugu News  
  ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర రాజకీయ నాయ కులు, పోలీసు ఉన్నతాధికారులు, కీలక ప్రభుత్వ అధికారులకు వ్యక్తిగత భద్రత దృష్ట్యా గన్‌మెన్‌లను కేటాయించ డం సర్వసాధారణం. అయితే ఉప్పల్   బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాత్రం ఈ విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు.   తనకు వ్యక్తిగత భద్రత కోసం గన్‌మెన్‌లు అవసరం లేదని ఆయన మొదటి నుంచీ చెబుతూవస్తున్నారు.  ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి  గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ..  తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు. ప్రజల మధ్య ఎలాంటి హడావుడి లేకుండా, సాధారణ వ్యక్తిలా ఉండాలనేదే తన అభిప్రాయమని అప్పట్లోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం (జులై 7) ఆయన భద్రత కోసం   గన్‌మెన్‌లు నివాసానికి వెళ్లగా..  లక్ష్మారెడ్డి వారిని  వెనక్కి పంపించారు. తన భద్రతను తానే చూసుకుంటానని, గన్‌మెన్‌లు లేకుండా  ప్రజల్లో తిరగడమే  తనకు సౌకర్యంగా ఉంటుందని వారికి వివరించారు. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని మరోసారి స్పష్టం చేయడంతో గన్‌మెన్‌లు అక్కడి నుంచి వెనుదిరిగారు. 
తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి  విజయ్ కరూర్ జిల్లాలో పర్యటించకుండా నిరోధించాలని కోరుతూ ప్రతిపక్ష  డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు   నిరాకరించింది. ఒక రాష్ట్ర   ముఖ్యమంత్రి పర్యటనలను తాము ఏ విధంగా నియంత్రించగలమని న్యాయస్థానం  ప్రశ్నించింది. గతంలో   తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కరూర్ ప్రాంతంలో తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలనూ, అలాగే గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఈ నెల  10న కరూర్ సందర్శనకు  సీఎం విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే..  సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. బాధితులను కలిసి ప్రభుత్వ పరంగా ఉద్యోగ నియామక పత్రాలు, ఇతర ఆర్థిక సాయం అందించేందుకు సీఎం వెళ్తున్నారని, దీనివల్ల సీబీఐ దర్యాప్తు పారదర్శకత దెబ్బతింటుందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ..  బాధిత కుటుంబాలను పరామర్శించడం సాక్షులను ప్రభావితం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే కొట్టివేస్తామని స్పష్టం చేయడంతో..  డీఎంకే న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో కోర్టు ఆ వ్యాజ్యాన్ని ముగించింది. దీంతో  ఈ నెల   10న సీఎం విజయ్  కరూర్ పర్యటనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.   DMK Petition Dismissed, Tamil Nadu CM Joseph Vijay, Karur Stampede Case, Tamil Nadu Politics, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
Yash and Kiara Advani are sharing the screen in the newly first single Tabaahi from the upcoming movie Toxic: A Fairy Tale for Grown-Ups. The makers released complete video song and it gives audiences an early look at the film's visual style and the relationship between the lead characters. Zee Music Company officially released the track following a brief promotional interaction on social media involving the actors. The song explores a more intense and destructive side of romance, moving away from traditional love themes. Music director and singer Vishal Mishra explained that the track focuses on the raw and unfiltered nature of love. He noted that the music was composed specifically to match the strong, natural screen presence that the lead actor brings to his roles. Tabaahi has been released in multiple languages, including Hindi, Kannada, Telugu, Tamil, and Malayalam. While the original Hindi version was written by Raj Shekhar, the makers collaborated with popular regional lyricists like Ramajogayya Sastry and Vignesh Shivan to adapt the song.  The song and lyrics become representative of Rumi Quote used by the makers in the beginning. With each losing themselves in this bold iteration of love, the gangster drama presents itself as a solid struggle for power while rage in love is also presented brilliantly. Directed by Geetu Mohandas, the film features a large ensemble cast that includes Nayanthara, Tara Sutaria, Rukmini Vasanth, and Huma Qureshi. Toxic is produced by KVN Productions and Monster Mind Creations, and it is slated for a worldwide theatrical release on August 26, 2026.    Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  సినిమాని అన్ని విభాగాల్లోను అప్ డేట్ కండిషన్ లోకి తీసుకొచ్చిన దర్శకుడు శంకర్. ప్రేక్షకుల సినీ ఆలోచన స్థాయి పెంచి, మేము సినిమా చూసాం అని గర్వపడేలా చేసిన  దర్శకుడు కూడా. మేకింగ్ పరంగా కూడా సినిమా సైతం ఊహించని విధమైన టేకింగ్ తో సినిమా యొక్క వాల్యూ పెంచాడు. భారతీయ చలనచిత్ర రంగాన్ని గ్రాఫిక్స్ వైపు, భారీ బడ్జెట్ వైపు నడిపించిన ఒకే ఒక్కడు కూడాను. 1993లో వచ్చిన 'జెంటల్‌మ్యాన్' సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం, దాదాపు పాతికేళ్ల పాటు అప్రతిహతంగా సాగింది. జెంటల్‌మ్యాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన 100% బ్లాక్‌బస్టర్ విజయం టాలీవుడ్, కోలీవుడ్‌లను ఊపేసింది. ఆ తర్వాత వచ్చిన 'భారతీయుడు', 'జీన్స్', 'అపరిచితుడు', 'రోబో' చిత్రాలు కేవలం సినిమాలు కావు, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ మార్చేసిన అద్భుతాలు. ముఖ్యంగా 2010లో వచ్చిన 'రోబో' చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹375 కోట్లకు పైగా వసూలు చేసి ఆ రోజుల్లోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ స్థాయి విజువల్స్ మన స్క్రీన్‌పై చూపించి అందరినీ నోరెళ్లబెట్టేలా చేశారు శంకర్. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పటి ట్రెండ్ సెట్టర్, ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా శంకర్ కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే ఆయన మేకింగ్ స్టైల్‌లో పాత ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన '2.0' చిత్రం ఆశించిన స్థాయిలో   మెప్పించలేకపోయింది. వసూళ్లు సాధించినప్పటికీ, శంకర్ మార్క్ ఎమోషన్ అందులో మిస్ అయిందనేది పచ్చి నిజం. ఇక ఇటీవల కాలంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు మరింత నిరాశపరిచాయి. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన 'ఇండియన్ 2'  డిజాస్టర్‌గా నిలిచింది. కేవలం 20% పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకోలేక, పాతకాలపు కథనంతో సాగడం శంకర్ అభిమానులను సైతం తీవ్రంగా కలచివేసింది.  రామ్ చరణ్‌తో చేసిన 'గేమ్ చేంజర్ పరిస్థితి అంతే. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ వంటి యువ దర్శకులు సరికొత్త స్క్రీన్‌ప్లే, గ్రిప్పింగ్ నరేషన్‌తో దూసుకుపోతున్నారు. నేటి తరం ఆడియన్స్ కేవలం భారీ సెట్లు, వందల కోట్లు ఖర్చు పెట్టిన గ్రాఫిక్స్ చూసి పడిపోవడం లేదు. బలమైన కథ, ఎమోషన్ ఉంటేనే 000 కోట్ల క్లబ్‌లో సినిమాలు చేరుతున్నాయి. కానీ శంకర్ ఇంకా 1990ల నాటి లంచగొండితనం, సామాజిక సమస్యల చుట్టూనే తిరుగుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో 5G స్పీడ్‌తో దూసుకుపోతున్న ప్రేక్షకులకు శంకర్ పాత ఫార్ములా రొటీన్‌గా అనిపిస్తోంది. Also read: Lenin: టెన్షన్..టెన్షన్..టెన్షన్!  ఈ పరిస్థితులని చూస్తుంటే 'శంకర్ నుంచి ఇకపై అద్భుతమైన సినిమాలు రావడం కష్టమేనా?' అనే ప్రశ్న సినీ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఆయనను తక్కువ అంచనా వేయలేం. 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీని ఏలిన ఒక లెజెండరీ దర్శకుడు ఒక్క సరైన హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావడం అసాధ్యమేమీ కాదు. కాకపోతే శంకర్ తన పాత ఆలోచనల నుంచి బయటకు వచ్చి, నేటి తరం ప్రేక్షకుల పల్స్ పట్టుకోవాల్సి ఉంటుంది. విజువల్ గ్రాండ్‌నెస్ పక్కన పెట్టి, కథలో దమ్ము చూపిస్తేనే శంకర్ మళ్లీ కింగ్ కాగలరు. లేదంటే ఆయన శకం ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  shankar, game changer, ram charan
గత కొంతకాలంగా ఒక అరుదైన అనారోగ్య సమస్యతో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ ఇక లేరు అనే వార్త అందరి గుండెలను పిండేస్తోంది. ఆ చిన్న వయసులోనే ఊహించని వ్యాధి ఎదురైనా, అతను ప్రదర్శించిన అంతులేని ఆత్మవిశ్వాసం, పోరాట పటిమ ఎంతో మంది హృదయాలను కదిలించాయి. నిరంజన్ మరణవార్త తెలియగానే సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వారాల క్రితమే నిరంజన్ జీవితంలో ఒక అద్భుతమైన క్షణం చోటుచేసుకుంది. నిరంజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, తన జీవితంలో చివరి కోరిక తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్‌ను కలవడమేనని తెలుసుకున్న జనసేనాని ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తెలంగాణలోని హనుమకొండలో ఉన్న నిరంజన్ నివాసానికి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లారు. నిరంజన్‌ను ఎంతో ప్రేమగా హత్తుకుని, అతని తల్లిదండ్రులతో మాట్లాడి, నిరంజన్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ కోలుకోవాలని కోరుకుంటూ తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని స్వయంగా అందించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరంజన్ వైద్యం కోసం గతంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా తన వంతుగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిరంజన్ ప్రాణాలను కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ, విధి ఎంత క్రూరమైనదో మరోసారి రుజువైంది. ఆ మరువలేని తీపి జ్ఞాపకాన్ని, తన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకున్న కొద్దిరోజులకే నిరంజన్ తుది శ్వాస విడిచారు. ఈ గుండెను పిండేసే వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన బండ్ల గణేష్, సోషల్ మీడియా వేదికగా నిరంజన్ మృతి పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. "చిన్నారి నిరంజన్ మరణ వార్త నన్నెంతో కలచివేసింది. తన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి." అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. తనను ప్రాణంగా ప్రేమించే అభిమాన హీరోను కలవాలనే అతిపెద్ద కల నెరవేరినప్పటికీ, ఆ జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చి నిరంజన్ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అందరినీ కలచివేస్తోంది. నిరంజన్ చేసిన భౌతిక పోరాటం ముగిసినప్పటికీ, ఆ చిన్నారి ముఖంలో కనిపించిన చిరునవ్వు, ఆత్మవిశ్వాసం ఎంతో మందికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. https://x.com/ganeshbandla/status/2074723185761923274 Pawan Kalyan, Niranjan, Bandla Ganesh, TeluguOne  
తెలుగు సినిమా ఎదుగుదల అక్కినేని(Akkineni)కాంపౌండ్ లోనే పురుడు పోసుకుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకు ఆద్యుడు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన రెండో మనవడు అఖిల్ అక్కినేని(Akhil Akkineni)ఈ నెల 10 న ;లెనిన్' తో సెల్యులాయిడ్ పై అడుగుపెడుతున్నాడు. రిలీజ్ టైందగ్గరపడుతున్న కొద్దీ అక్కినేని అభిమానుల్లో తీవ్రమైన ఉత్కంఠ, టెన్షన్ నెలకొంది.  దీనికి ప్రధాన కారణం అఖిల్ కెరీర్ లో ఇంతవరకు సరైన హిట్ లేదు. అఖిల్ మొదలుకొని, ఏజెంట్ వరకు తన పెర్ఫార్మ్ విషయంలో ఏ లోటు లేకపోయినా, కథ, కధనం బాగోకపోవడంతో హిట్ అనేది అఖిల్ కి డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తుంది. పైగా ఇప్పుడు  3 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత లెనిన్ తో  వెండితెరపై కనిపించబోతున్నాడు . మరోవైపు రిలీజ్ డేట్  ఏకంగా 3 సార్లు మారడం కూడా అభిమానుల్లో టెన్షన్‌ని పెంచేసింది. మొదట మే 1న, ఆ తర్వాత జూన్ 26న విడుదల చేయాలనుకున్నా, చివరకు జూలై 10 వ తేదీని లాక్ చేశారు. రామ్ చరణ్ 'పెద్ది' వంటి పెద్ద సినిమాలతో బాక్సాఫీస్ క్లాష్ రాకూడదనే ఉద్దేశంతోనే నిర్మాత నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రామీణ యాక్షన్ డ్రామాను దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు రాయలసీమ (చిత్తూరు) నేపథ్యంతో తెరకెక్కించారు. తిరుపతిలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అఖిల్ తన అభిమానులకి  భావోద్వేగంతో క్షమాపణలు చెప్పారు. "ఇంతకాలం మిమ్మల్ని ఊరించినందుకు నన్ను క్షమించండి, నా హృదయం ఎప్పుడూ మీ కోసమే " అంటూ చెప్పుకొచ్చాడు. Also read: Imanvi: ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వికి మరో ఛాన్స్ ఎందుకు రాలేదు.. అసలు రీజన్ ఇదే! అయితే, ఈ టెన్షన్ల నడుమ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రంపై అత్యంత ధీమాగా ఉన్నారు. 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల నుండి 200 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే సత్తా ఉన్న కమర్షియల్ సినిమా అని ఆయన గ్యారెంటీ ఇచ్చారు. ఇంటర్వెల్‌కు 45 నిమిషాల ముందు నుండి క్లైమాక్స్ వరకు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదని, థియేటర్ల నుండి వచ్చే ప్రతి ఒక్కరూ సంతృప్తితో వస్తారని 200 శాతం నమ్మకంగా చెప్పారు. అఖిల్ కూడా లెనిన్ ని 'రాయలసీమ మహాభారతం' అని అభివర్ణించారు. సీనియర్ నటుడు నాగార్జున కూడా "ఈ సినిమాలో మీరు అఖిల్‌ను చూడరు, కేవలం లెనిన్‌ను మాత్రమే చూస్తారు" అని ప్రశంసించారు. దీనికి తోడుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా అఖిల్‌కు బాసటగా నిలిచి 'లెనిన్' కోసం గర్జించడంతో అక్కినేని ఫ్యాన్స్‌లో భయంతో కూడిన ఒక కొత్త జోష్ కనిపిస్తోంది. జూలై 10న థియేటర్లలో అఖిల్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలని టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే జత కట్టింది.   akhil akkineni, bhagyashri borse, lenin, nagarjuna  
In heartbreaking news for the Telugu film fraternity and Jana Sena supporters, Niranjan, the 17-year-old fan of Pawan Kalyan who had won hearts with his inspiring spirit despite battling Duchenne Muscular Dystrophy (DMD), has passed away. The news has left fans across social media mourning the loss of the teenager, whose emotional meeting with the actor-politician just a few weeks ago had touched millions. Niranjan, a resident of Hanumakonda in Telangana, had been bedridden for years due to the rare genetic disorder. His long-cherished dream was to meet Pawan Kalyan. After learning about the boy's wish through Jana Sena leaders, the Andhra Pradesh Deputy Chief Minister personally visited Niranjan at his home in June, spending quality time with him and his family. During the emotional interaction, Pawan Kalyan hugged Niranjan, spoke to his parents about his treatment, donated ₹1 lakh towards medical expenses, presented Tirumala prasadam and sacred akshatalu, and even promised to gift him a puppy after learning about his wish. He also assured support for the family's livelihood by helping them set up a food stall. The visit was widely praised as one of the actor's most heartfelt gestures. Niranjan's passing has triggered an outpouring of grief from Pawan Kalyan fans, Jana Sena workers and netizens, who are sharing memories and visuals from that unforgettable meeting. What was once a dream fulfilled has now become a poignant reminder of the teenager's courage and unwavering admiration for the star. Producer Bandla Ganesh also met the family after Pawan Kalyan met Niranjan and donated Rs.5 lakhs for his recovery. He expressed his condolences to the grief stricken family and prayed for their strength.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
    పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)సరసన జోడి కట్టాలనేది ఎంతో మంది హీరోయిన్స్ కల. అలాంటి కలని కనడానికి కొంచం టైం పట్ట్టే అవకాశం ఉన్నా కూడా అనుకోకుండా ప్రభాస్ తో 'ఫౌజీ' లో జోడి కట్టే ఛాన్స్ దక్కించుకుంది ఇమాన్వి(Imanvi). 1940ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో ఇమాన్వి  మెరిసినప్పుడు, ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ కొత్త భామపైనే పడింది. ఆమె అందం, ప్రత్యేకించి హను రాఘవపూడిని ఆకట్టుకున్న ఆమె భావగర్భితమైన కళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. అయితే, ఈ భారీ ప్రాజెక్టు ప్రారంభమై నెలలు గడుస్తున్నా, ఇమాన్వి ఇప్పటివరకు మరో కొత్త తెలుగు సినిమాపై సంతకం చేయకపోవడం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ పక్కన హీరోయిన్‌గా అనౌన్స్ అయిన వెంటనే, ఇతర పెద్ద బ్యానర్లు, స్టార్ హీరోల సినిమాల నుంచి వరుస ఆఫర్లు రావడం సర్వసాధారణం. కానీ, ఇమాన్వి విషయంలో అలా జరగకపోవడంతో టాలీవుడ్ లైనప్‌లో ఆమె పేరు ఎక్కడా వినిపించడం లేదు. దీని వెనుక అసలు కారణం ఏంటా అని ఆరా తీయగా, ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, 'ఫౌజీ' చిత్ర నిర్మాతలు ఇమాన్వితో ఒక ప్రత్యేకమైన అగ్రిమెంట్ లేదా బాండ్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధన ప్రకారం, ఈ చిత్రం పూర్తయి థియేటర్లలో విడుదలయ్యే వరకు ఆమె మరే ఇతర తెలుగు సినిమాను అంగీకరించకూడదు, వేరే ప్రాజెక్టులపై సంతకం చేయకూడదు. ఈ కఠినమైన క్లాజ్ వల్లే ఆమెకు ఆఫర్లు వస్తున్నప్పటికీ నిబంధనల ప్రకారం వేరే సినిమాలకి కమిట్ కాలేకపోతోందని గట్టిగా వినిపిస్తోంది. హను రాఘవపూడి తన సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా, విభిన్నంగా డిజైన్ చేస్తారు. ఈ సినిమాలో ఇమాన్వి క్యారక్టర్ కి సంబంధించిన లుక్, లీడ్ ఎలిమెంట్స్ చాలా రహస్యంగా ఉంచాలని, సినిమా రిలీజ్ వరకు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ వేరే ఎక్కడా రివీల్ కాకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Also read: Ravi teja: వీరాధి వీరులంట.. నిజమవుతుందా మరి! ప్రస్తుతం 'ఫౌజీ' సినిమాకు సంబంధించిన కొన్ని కీలక షెడ్యూల్స్ షూటింగ్ పెండింగ్‌లో ఉంది. తాజా అప్‌డేట్స్ ప్రకారం, రాబోయే ఆగస్టు నెలలో రెబల్ స్టార్ ప్రభాస్ తిరిగి ఈ చిత్ర యూనిట్‌తో కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా చిత్ర బృందం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు, అభిమానుల కోసం ఒక అదిరిపోయే గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ కంటెంట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉంది.  prabhas, imanvi, fauji, hanu raghavapudi
మాస్ మహారాజా రవితేజ(Raviteja)ప్రస్తుతం 'ఇరుముడి'(irumudi)మూవీ ఇస్తున్న కిక్ లో ఉన్నాడు. కిక్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ మధ్య కాలంలో పోస్టర్ రిలీజ్ తోనే పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చుకున్న మూవీ ఏదైనా ఉందంటే అది ఇరుముడి అని చెప్పవచ్చు. కొన్ని రోజుల క్రితం విడుదలైన సాంగ్ రిలీజ్ తో అయితే హిట్ స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో అని లెక్కలు వేసుకునే పరిస్థితి. ఇక మాస్ మహారాజా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని, కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు తో కలిసి మల్టి స్టారర్ గా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరి ఆ ఇద్దరి కామెడీ  టైమింగ్ ఒకే తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు వినోదం డబుల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వినూత్న కలయిక గురించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, 'రాజా రాజ చోర', 'స్వాగ్' వంటి వైవిధ్యభరితమైన వినోదాత్మక చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా తనదైన ముద్ర వేసుకున్న హసిత్ గోలి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ మార్క్ మాస్ ఎనర్జీని, శ్రీ విష్ణుకు ఉన్న విలక్షణమైన కామెడీ టైమింగ్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు ఒక క్రేజీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి రెండు విభిన్నమైన ఆసక్తికరమైన టైటిల్స్ నెట్టింట విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. సోషల్ మీడియాలో కొందరు ఈ ప్రాజెక్ట్‌కు 'వీరాధి వీరులంట' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు చెబుతుండగా, మరికొందరు 'అక్కాయిలూ… బాగున్నారా?' అనే వెరైటీ టైటిల్ ఖరారయ్యే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరి పాత్రలు థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు టైటిల్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం. Also read: rishab shetty: కాంతార ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా: చాప్టర్ 2 పై క్రేజీ అప్‌డేట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తన 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారని ఇండస్ట్రీ టాక్. గతంలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలు, కమర్షియల్ బ్లాక్‌బస్టర్లు మరియు మల్టీస్టారర్ సినిమాలతో ఘన విజయాలు అందుకున్న ఈ నిర్మాణ సంస్థ నుంచి మరో క్రేజీ కాంబో వస్తుండటంతో అభిమానులలో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ సినిమాను త్వరలోనే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.   raviteja, sreevishnu, irumudi
అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అఖిల్ గత చిత్రం 'ఏజెంట్' భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత అఖిల్ దాదాపు 3 ఏళ్ల పాటు విరామం తీసుకుని, ఎంతో పట్టుదలగా ఈ 'లెనిన్' ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. జూలై 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ న్యూ ఏజ్ కమర్షియల్ డ్రామాను నిర్మించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను పెంచేశాయి. అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా రగ్డ్ లుక్‌లో కనిపిస్తుండటం ట్రేడ్ వర్గాల్లో సైతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో అఖిల్ మేకోవర్, అతని నటన కెరీర్‌లోనే బెస్ట్ అని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తోంది.  జూలై 10న రిలీజ్ కాబోతున్న తరుణంలో, ఈ చిత్రాన్ని మేకర్స్ ఇప్పటికే కొంతమంది పరిశ్రమ పెద్దలకు, సన్నిహితులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమాను చూసిన ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి అందుతున్న ఫస్ట్ రివ్యూ రిపోర్ట్స్ వింటే అక్కినేని ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఇన్సైడ్ టాక్ ప్రకారం, 'లెనిన్' సినిమా మ్యాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో అత్యంత గ్రాండ్‌గా ప్రారంభమవుతుందట. ఎన్టీఆర్ గంభీరమైన శబ్దంతో సినిమా బ్యాక్‌డ్రాప్‌ను ఎలివేట్ చేసే విధానం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సమాచారం. ఆ తర్వాత వచ్చే అఖిల్ ఇంట్రడక్షన్ సీన్, హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్ వెండితెరపై మాస్ జాతరను తలపిస్తాయని చెప్తున్నారు.  ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ సీనియర్ ఎన్టీఆర్ ఐకానిక్ డైలాగ్‌తో ప్లాన్ చేయడం అదిరిపోయిందని తెలుస్తోంది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సేల మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ చాలా వైవిధ్యంగా, ఫ్రెష్‌గా ఉంటుందని, వీరి ప్రేమకథే మొత్తానికి ఈ కమర్షియల్ యాక్షన్ డ్రామాను ఒక పెద్ద మలుపు తిప్పుతుందని ఇండస్ట్రీ టాక్. ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్‌కు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా చాలా ప్రాధాన్యత కల్పించారట. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని షాకింగ్ ట్విస్టులు ప్రేక్షకులు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయని, ఆ స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌కి థియేటర్లలో మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని ఇన్సైడర్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ మోడ్‌లో సాగితే..సెకండాఫ్ మాత్రం అద్భుతమైన ఎమోషన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో సరికొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు.  మొత్తానికి 'లెనిన్' చిత్రం అఖిల్ అక్కినేనికి ఒక సాలిడ్ కమర్షియల్ కంబ్యాక్ మూవీ అవుతుందని, బాక్సాఫీస్ వద్ద అఖిల్ ఖాతాలో మొదటి బ్లాక్‌బస్టర్ పడటం ఖాయమని ఈ ఫస్ట్ రివ్యూస్ ద్వారా స్పష్టమవుతోంది. దాదాపు 3 సంవత్సరాల నిరీక్షణకు ఈ సినిమాతో అఖిల్ సరైన సమాధానం చెప్పబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి జూలై 10న సాధారణ ప్రేక్షకులు ఈ న్యూ ఏజ్ కమర్షియల్ డ్రామాను ఏ రేంజ్‌లో ఆదరిస్తారో చూడాలి.     Akhil Akkineni, Lenin Review, Bhagyashri Borse, NTR  
  కంటెంట్ బలంగా ఉంటే పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు, పాన్ ఇండియా లెవల్లో రికార్డు మోతలు మోగించవచ్చు అని కాంతార, కాంతార చాప్టర్ 1 తో నిరూపించాడు రిషబ్ శెట్టి.  మన దేశ సంస్కృతి, జానపద, దైవిక సంప్రదాయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకి పరిచయం చేసిన ఘనత కూడా రిషబ్ శెట్టికి  దక్కింది. ఈ  ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వస్తున్న తదుపరి భాగాలపై ఇటు పరిశ్రమ వర్గాల్లోనూ, అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే  రిషబ్ శెట్టి తన పుట్టినరోజుని  పురస్కరించుకుని అభిమానులకి  డబుల్ గుడ్‌న్యూస్ ఇస్తూ ఒక క్రేజీ అప్‌డేట్ ప్రకటించారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు  సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్నాయి  ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'జై హనుమాన్' షూటింగ్‌లో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో పాటు సందీప్ సింగ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం 'ది ప్రైడ్ ఆఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహారాజ్' లో కూడా ఆయన నటిస్తున్నారు. తన చేతిలో ఉన్న ఈ రెండు భారీ చిత్రాల షెడ్యూల్స్ గురించి స్పష్టతనిస్తూ, ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఒకేసారి జరగదని ఆయన స్పష్టం చేశారు. మొదటగా 'జై హనుమాన్' పూర్తి చేసిన తర్వాతే శివాజీ మహారాజ్ బయోపిక్ సెట్స్‌పైకి వెళ్తుందని ప్రకటించారు. ఈ రెండు విభిన్న పాత్రల కోసం తాను పూర్తిగా భిన్నమైన శారీరక రూపాల్లో, సరికొత్త లుక్స్‌లో కనిపించబోతున్నట్లు వెల్లడించారు. ఒకే సమయంలో మల్టీటాస్కింగ్ చేయడం తనకు ఇష్టం ఉండదని, అందుకే ఒక్కో సినిమాని ఎంతో నిబద్ధతతో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నేను నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, నాలోని దర్శకుడిని అస్సలు ఖాళీగా ఉంచలేను. దర్శకత్వం చేయడం ద్వారానే నాకు మానసిక ప్రశాంతత, నిజమైన ఆనందం లభిస్తాయి. ప్రస్తుతం నా రచయితల బృందంతో కలిసి 'కాంతార: చాప్టర్ 2' స్క్రిప్ట్ పనులని చేయిస్తున్నానని చెప్పుకొచ్చాడు.ఇప్పుడు ఈ మాటలు కాంతార సిరీస్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి.  
'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' వంటి సినిమాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన విలక్షణమైన కథలతో విభిన్నమైన ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ కెరీర్‌ను ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సిద్ధు జొన్నలగడ్డ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక వెబ్‌సిరీస్ చేస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఈ భారీ వెబ్‌సిరీస్‌తో పాటు, ఆయన ఖాతాలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వెంకీ అట్లూరి ప్రాజెక్ట్‌తో పాటు సిద్ధు జొన్నలగడ్డ ‘ఆర్ఎస్ జే స్వరూప్’ దర్శకత్వంలో ఒక విలక్షణమైన సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. తాజాగా సిద్ధు మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ అయిన 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్‌లో సిద్ధు ఒక సరికొత్త చిత్రం చేయనున్నట్లు సమాచారం. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై అప్పుడే ఫిలిం నగర్ సర్కిల్స్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ చిత్రంతో సుకుమార్ సోదరుడి కుమారుడు బాబీ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు సమాచారం అందుతోంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌ నుంచి వచ్చే సినిమాలు ఎప్పుడూ వైవిధ్యమైన కథాంశాలతో, కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ సక్సెస్ అవుతుంటాయి. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ ఎనర్జీకి, సుకుమార్ స్కూల్ నుంచి వస్తున్న సరికొత్త కాన్సెప్ట్‌ తోడైతే థియేటర్లలో నెక్ట్స్ లెవెల్ వినోదం ఖాయమని ఇండస్ట్రీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు టాక్. ఎనర్జిటిక్ హీరో సిద్ధు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక అదిరిపోయే స్క్రిప్ట్‌ను బాబీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ నిర్మాణంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రబృందం అధికారికంగా వెల్లడించే అవకాశముంది.      Siddhu Jonnalagadda, Sukumar, TeluguOne  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే అవసరానికి మించి మొబైల్ వాడటం క్రమంగా వ్యసనంగా మారి మన ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వీడియోలో Dr. వేణుగోపాల్ మొబైల్ వ్యసనం వల్ల మెదడులో జరిగే మార్పులు, ఏకాగ్రత తగ్గిపోవడం, జ్ఞాపకశక్తిపై పడే ప్రభావం, నిద్ర సమస్యలు, ఆందోళన, ఒత్తిడి వంటి అంశాలను చాలా సులభంగా వివరించారు.  అలాగే మొబైల్‌కు బానిస కాకుండా ఉండేందుకు పాటించాల్సిన అలవాట్లు, స్క్రీన్ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలి, పిల్లలు మరియు యువతలో మొబైల్ వినియోగాన్ని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందించారు.  మొబైల్‌ను పూర్తిగా వదిలేయడం అవసరం లేదు. కానీ దానిని సరైన విధంగా ఉపయోగించడం ద్వారా మన మెదడు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మరియు జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. మొబైల్ వ్యసనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.  
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది. ఇది వందలాది, వేలాది సంవత్సరాలుగా సాగుతున్న సంప్రదాయం.  అయితే భారతదేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. భారతీయులు విదేశాలలో పుట్టిన సంప్రదాయాలను పాటిస్తూ వెర్రిగా మారిపోతున్నారు. డేటింగ్ లు, సహజీవనాలు, రకరకాల కొత్త కల్చర్లు పాటిస్తూ భారతీయ సంస్కృతికి దూరం అవుతున్నారు. ఇప్పుడు డింక్ పేరిట ఏకంగా ఒక తరాన్ని పుట్టకుండా ఆపేస్తున్నారు.  అసలు డింక్ అంటే ఏమిటి?  దీని పట్ల భారతీయ జంటలు ఎందుకు అంత ఆకర్షితులు అవుతున్నారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దశాబ్దాలుగా కుటుంబ వంశాన్ని కొనసాగించే మార్గంగా వివాహాన్ని చూసేవారు. కానీ కొత్త తరం దీనికి వ్యతిరేకంగా ఉంది, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం అనే విషయం కంటే.. ప్రపంచం పట్ల ఆసక్తి పెరిగింది,  సంబంధాల తీరు కూడా మారుతోంది. ఇప్పుడు ఒక బిడ్డను కనాలన్నా,  వంశాన్ని ముందుకు నడపాలన్నా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.దీన్నే డింక్ అంటున్నారు. విదేశాలలో పుట్టిన ఈ సంస్కృతి పట్ల భారతీయులు కూడా  నెమ్మదిగా అలవాటు పడుతున్నారు. డింక్ అంటే.. DINK అంటే ' డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ', పేరులోనే దీని  అర్థం ఉంది. దీని అర్థం పెళ్లి తర్వాత పిల్లలను కనాలని అనుకోకపోవడం. డింక్ జంటలు ఎందుకు పెరుగుతున్నాయ్.. కొన్నేళ్ల క్రితం వరకు ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు అనేదే చాలా పెద్ద ప్రశ్నగా ఉండేది పెళ్లైన జంటల్లో.. కానీ ఇప్పుడు పిల్లలు వద్దు అనే నిర్ణయం వస్తోంది. ముఖ్యంగా బారతదేశంలోని పట్టణాలలో ఉన్న జంటలలో చాలా మార్పు వస్తోంది. చదువుకున్న, ఇద్దరూ సంపాదించే భార్యాభర్తలు అసలు మనకు పిల్లలు అవసరమేనా అనే ప్రశ్న వేసుకుంటున్నారు. ముఖ్యంగా 20, 30 ఏళ్ల వయసులో  పెళ్లిచేసుకున్న జంటలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆర్థిక భారం.. చాలామంది ఎదుర్కునే స్పష్టమన కారణం ఆర్థిక విషయాలే..   ఇరవై, ముప్పై సంవత్సరాల కిందట పిల్లలను పెంచినట్టు నేటికాలంలో మెట్రో సిటీలలో పిలలను పెంచడం కష్టమవుతోందని చాలామంది అంటున్నారు. పాఠశాల ఫీజులు,ఇల్లు కొనడం లేదా అద్దె, పిల్లల సంరక్షణ , ఆరోగ్య సంరక్షణ.. ఇవన్నీ పిల్లలు వద్దు అనుకోవడానికి కారణం అవుతున్నాయి. మెట్రో పట్టణాలలో ఇద్దరు వ్యక్తుల సంపాదన కూడా వీటికి సరిగా సరిపోవడం లేదని ఆవేదన చాలా మందిలో ఉంది. క్వాలిటీ లైఫ్.. పిల్లలు పుడితే లైఫ్ క్వాలిటీ పోతుందని చాలామంది జంటలు అబిప్రాయం.  పిల్లల బాధ్యతలలో తాము ఎన్నో సంతోషాలు, సరదాలు, ఇష్టాలు కోల్పోవడానికి, జీవితాన్ని సరదాగా గడపడానికి, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి సరిపడినంత సమయం దొరకడం లేదని అనుకుంటున్నారు.  పైగా పిల్లల కారణంగా జీవితంలో కాస్త విలాసంగా బ్రతికే అవకాశం ఉన్నా దాన్ని పిల్లల కోసం త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు వద్దని అనుకుంటున్నారు. మరొక మార్గం.. చాలా మంది DINK జంటగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే అది  బాధ్యతల నుండి తప్పించుకోవడం కోసం లేదా వారి విలాసవంతమైన జీవితం కోసం అనుకుంటారు.  కానీ ఇది తప్పు.. చాలామంది పిల్లల పట్ల తీసుకోవాల్సిన బాధ్యతలను ఒకరికొకరు బాధ్యతగా చూసుకోవడంలో, అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, జంతు సంక్షేమం వంటి  తమకు ఇష్టమైన విషయాల ద్వారా బాధ్యతను తీసుకుంటున్నారు. ఇది తమ తరువాత వంశం లేకపోయినా,   కుటుంబాన్ని కాపాడుకోవడం ,  జీవన నాణ్యతను మెరుగ్గా ఉంచుకోవడం వంటి కారణాల వల్లే చేస్తున్నారు.                                    *రూపశ్రీ.
  నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా, ఒకరినొకరు సరైన విధంగా కమ్యూనికేట్ చేయడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలాముఖ్యం. నిజానికి చాలామంది రిలేషన్ లో ఉన్నప్పుడు  తమ మనసులో ఉన్న విషయాలను ఓపెన్ గా చెప్పడానికి ధైర్యం చేయరు. చాలా సందేహపడుతూ ఉంటారు. దీని వల్ల అపార్థాలు పెరిగి  రిలేషన్స్ లో దూరం ఏర్పడుతుంది. అందుకే రిలేషన్ లో ఉన్నప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం అంటుంటారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నమ్మకాన్ని పెంచుతుంది.. చక్కగా, ఎలాంటి విమర్శలు లేకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం ఏ  సంబంధానికైనా బలమైన పునాది ఏర్పరుస్తుంది. రిలేషన్ లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా మాట్లాడినప్పుడు, వారి మధ్య నమ్మకం దానంతట అదే పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్  వల్ల అవతలి వ్యక్తి మన మాటలను శ్రద్ధగా వింటున్నారని మనకు అనిపిస్తుంది. ఇది అపార్థాల అవకాశాన్ని తగ్గిస్తుంది , సంబంధాలు దీర్ఘకాలం పాటు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.  కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటే.. అనుమానం,  అపార్థాలు, దూరం పెరుగుతాయి. అపార్థాలు తొలగిస్తుంది.. రిలేషన్స్ లోని సమస్యలు చాలా వరకు పెద్ద కారణం వల్ల కాకుండా, చిన్న చిన్న అపార్థాల వల్ల తలెత్తుతాయి. సరైన సంభాషణ ద్వారా ఈ అపార్థాలను సులభంగా పరిష్కరించవచ్చు. ప్రజలు తమ ఆలోచనలను, భావాలను బహిరంగంగా మాట్లాడుకున్నప్పుడు, వారికి ఉండే  సందేహాలు తొలగిపోతాయి. ఇది సంబంధాలలో స్పష్టతను తీసుకువచ్చి, అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎమోషనల్ బాండింగ్.. కమ్యూనికేషన్ చేయడం అంటే కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కాదు..  అది భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక మార్గం కూడా.   మనసులోని మాటలను పంచుకున్నప్పుడు ఇద్దరి మధ్య మరింత గాఢమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. ఇది ఒకరిలో ఒకరికి చెందిన ఫీలింగ్ ను పెంపొందించి, సంబంధాలను మరింత సన్నిహితంగా చేస్తుంది. ఈ అనుబంధమే ఏ సంబంధాన్నైనా ప్రత్యేకంగా నిలుపుతుంది. సమస్యల పరిష్కారం.. ప్రతి సంబంధంలో లేదా పరిస్థితిలో సమస్యలు సర్వసాధారణం, కానీ సరైన కమ్యూనికేషన్  ద్వారా వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తపరిచినప్పుడు, పరిష్కారాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ వల్ల  తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది.  ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్లడానికి మార్గం కల్పిస్తుంది.  అందుకే ఓపెన్ గా మాట్లాడుకోవడం  అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. మానసిక ఒత్తిడి.. మనసులో భావాలను, ఆందోళనలను ఇతరులతో పంచుకున్నప్పుడు మనసు తేలికపడుతుంది. ఏ విషయాన్ని అయినా మనసులోనే దాచుకోవడం ఒత్తిడిని పెంచుతుంది, కానీ మాట్లాడటం ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మంచి కమ్యూనికేషన్ ఒక వ్యక్తి మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా , సంతోషంగా ఉండేలా చేస్తుంది.                                      *రూపశ్రీ.
బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) అనేది అత్యవసర వైద్య పరిస్థితి. మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం మాత్రమే కాకుండా శాశ్వత వైకల్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.  ఈ వీడియోలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు.  ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు: బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ ఎన్ని రకాలుగా ఉంటుంది? స్ట్రోక్ వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే హెచ్చరిక లక్షణాలు (TIA) ఏమిటి? చేతులు, కాళ్లు బలహీనపడటం, ముఖం వంకర కావడం, మాట తడబడటం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి? "గోల్డెన్ పీరియడ్" అంటే ఏమిటి? ఆ సమయంలో చికిత్స ఎందుకు చాలా కీలకం? ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి? స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడడమే కాకుండా మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.  బ్రెయిన్ స్ట్రోక్ గురించి పూర్తి అవగాహన పొందాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health‌ ను ఫాలో అవుతూ ఉండండి.
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు.  పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని,  జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుందని అంటుంటారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పెరుగు కడుపుకు మేలు చేసే ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణించబడుతుంది, కానీ వర్షాకాలంలో పెరుగు తినడం పై  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు చెబుతారు, అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలంలో పెరుగును తినవచ్చు, కానీ దాని పరిమాణం , పెరుగు తినే  సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే, వర్షాకాలంలో జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల కొంతమందికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది,  పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఉత్తేజపరుస్తుంది.   రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. వర్షంలో పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు , ఫ్లూ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెద్దలు జలుబు, జ్వరం ఉన్నప్పుడు పెరుగు తినకూడదని చెబుతారు. పెరుగు తినడం వల్ల   కఫం , శ్లేష్మంతో సమస్యలు రావచ్చు. కొంతమందికి కడుపు ఉబ్బరం కలగవచ్చు.  రాత్రిపూట తినడం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. పెరుగు ఎలా తింటే శ్రేష్టం..  పగటిపూట మాత్రమే పెరుగు తినడం మంచిది.  రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.   కొద్దిగా వేయించిన జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడి వేసుకుని  పెరుగు తీసుకుంటే మంచిది.  తాజాగా,  ఇంట్లో తయారుచేసిన పెరుగును మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం. పెరుగు ఎవరు తినకూడదు? జలుబుతో బాధపడుతున్న వాళ్లు,  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, ఆస్తమా లేదా అలర్జీ రోగులు, రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారు.. పెరుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.                                   *రూపశ్రీ.
శరీరంలో అధిక వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా కనిపించినప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఇవి పిత్త దోషం (Pitta Dosha) పెరగడం వల్ల వచ్చే సంకేతాలు కావచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చి. మధుసూదన్ శర్మ వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిత్త దోషం ఎందుకు పెరుగుతుంది? దానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణ ప్రభావాలు ఏమిటి? అలాగే పిత్తాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జీవనశైలి, ఆయుర్వేదంలో సూచించే సహజ చిట్కాలు వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను సులభంగా వివరించారు. శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం, పాదాల్లో లేదా కళ్లలో మంట, తరచూ నోటి పూత రావడం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వేధిస్తుంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిత్త దోషం అంటే ఏమిటి? శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణాలు పాదాలు, కళ్లలో మంట ఎందుకు వస్తుంది? నోటి పూత, గ్యాస్, అసిడిటీకి ఆయుర్వేద వివరణ పిత్తాన్ని తగ్గించే ఆహారాలు నివారించాల్సిన ఆహార పదార్థాలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఆయుర్వేద సూచనలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పిత్త దోషాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)