కేటీఆర్ పై రేవంత్ విమర్శలు.. జగన్ కూ వర్తిస్తాయంటున్న నెటిజనులు

Publish Date:Dec 25, 2025

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. రేవంత్ పై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ బుధవారం (డిసెంబర్ 24) కోస్గిలో నూతన సంర్పంచ్ ల అభినందన సభలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ పైనా, అలాగే కేటీఆర్ పైనా విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా కేటీఆర్ గతంలో తనపై చేసిన విమర్శలకు ఓ రేంజ్ లో బదులిచ్చారు. 

ఈ సందర్భంగా రేవంత్ కేటీఆర్ , ఆమె సోదరి కల్వకుంట్ల కవిత మధ్య విభేదాలనూ ప్రస్తావించారు. సొంత చెల్లిని పండక్కి పిలిచి చీర కూడా పెట్టలేని వాళ్లు తనను విమర్శిస్తారా అంటూ ఫైర్ అయ్యారు.  ఆస్తిలో   వాటాకు వస్తుందనీ, పార్టీలో ప్రాధాన్యత కోరుతుందనీ..సొంత చెల్లినే  బయటకు పంపించిన వారు నాకు రాజకీయ నీతులు చెపుతున్నారు,   తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఆ విమర్శలపైనే ఇప్పుడు నెటిజనులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.  రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.  రేవంత్ విమర్శలు  అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కూడా జగన్ తన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనీ, పార్టీలో ప్రాధాన్యత కోరుతోందన్న ఉద్దేశంతోనే దూరంపెట్టారని గుర్తు చేస్తున్నారు.  రేవంత్ కేటీఆర్ పై సంధించిన విమర్శనాస్త్రాలను  ఇటు ఏపీ మాజీ సీఎం జగన్ కి కూడా ఆపాదిస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అన్నా చెళ్లెళ్ల వివాదాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయ  

ఇటు తెలంగాణలో కేటీఆర్, కవిత, అటు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల, జగన్ ల మధ్య విభేదాలు పొలిటికల్ గా బీఆర్ఎస్న, వైసీపీలకు నష్టం చేకూరుస్తున్నాయనడంలో సందేహం లేదు.  తెలంగాణలో కేటీఆర్ లక్ష్యంగా కవిత, ఏపీలో జగన్ లక్ష్యంగా షర్మిల చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు బీఆర్ఎస్, వైసీపీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతే కాకుండా కేటీఆర్ ను, జగన్ ను సొంత చెల్లెలికి అన్యాయం చేసిన అన్నలుగా ప్రజల ముందు నిలబెడుతున్నాయంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. వీటికి బదులు చెప్పలేక కేటీఆర్, జగన్ లు సతమతమౌతున్నారు. 

By
en-us Political News

  
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.