మహా సీఎం సుప్రియా సూలీ: ఎన్డీయేలోకి ఎన్సీపీ.. శరద్ పవార్ వ్యూహాత్మక అడుగులు..?

Publish Date:Nov 25, 2026

Advertisement

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై త సుప్రియా సూలేను కూర్చోపెట్టే దిశగా ఎన్సీపీ(శరద్ పవార్) వ్యూహాలు రచిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇందుకు తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసం సిల్వర్ ఓల్ లో జరిగిన సమావేశాలు, సంప్రదింపులను ఉదాహరణగా చూపుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జ్ అయిన శరద్ పవార్.. మహా సీఎం పీఠంపై తన కుమార్తెను కూర్చోపెట్టే లక్ష్యంతో వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు.  సిల్వర్ ఓక్ లో రహస్య మంతనాలు ఇందుకేనని విశ్లేషిస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే  తన పార్టీని ఎన్డీయే కూటమిలో చేర్చేందుకు ఆయన సమాయత్తమౌతున్నారు.    నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే  జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో  తన ఆరోగ్యం,  రాజకీయ వారసత్వం, పార్టీ భవిష్యత్తు వంటి అంశాలపై శరద్ పవాన్ దృష్టి కేంద్రీకరించారని చెబుతున్నారు.  ఇటీవల ప్రధానమంత్రి శరద్ పవార్ కు  ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని, సుప్రియ సూలే తదితరులు రాజకీయ వ్యవహారాలు చూసుకుంటారని సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా  అజిత్ పవార్ మరణానంతరం మారిన పరిస్థితులు, విలీన చర్చలపై వచ్చిన వాదనలు మహా రాజకీయాలలో మారుతున్న, మారనున్న రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతున్నాయి. 

మహారాష్ట్రలో ఇప్పటికే అధికార కూటమిలోని  భాగస్వామ్య పక్షాల మధ్య సమతుల్యత,   పదవుల పంపకం వంటి అంశాలు ఒకింత గందరగోళంలో ఉన్నాయి. ఒకవేళ శరద్ పవార్ వర్గం ఎన్డీయే వైపు మొగ్గు చూపితే, మహారాష్ట్ర అధికార కూటమిలో సమీకరణాలు సమూలంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. శరద్ పవార్ ఎన్సీపీ కనుక  ఎన్డీయే కూటమిలో చేరితే.. అందుకు శరద్ పవార్ విధించే ఏకైక షరతు సుప్రియా సూలెకు సీఎం పదవి అని పరిశీలకులు అంటున్నారు. ఆ దిశగా బీజేపీతో ఇప్పటికే తెరవెనుక మంతనాలు సాగుతున్నాయని చెబుతున్నారు. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు, పరిపాలన, అభివృద్ధి అంశాలపై విపక్షాలు, అధికార పక్షాల మధ్య మాటల తూటాలు కొనసాగుతుండగానే, మరోవైపు కొత్త రాజకీయ పొత్తులపై తెరవెనుక చర్చలు జోరుగా సాగుతుండడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.  నియోజకవర్గాల పునర్విభజన   భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని శరద్ పవార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. 

ఇది కూడా చదవండి:  శరద్ పవార్..రాజకీయ చాణక్యుడు!​

రాబోయే రోజుల్లో పార్లమెంటు సమావేశాలు, నియోజకవర్గాల పునర్విభజన చర్చలు, అలాగే మహారాష్ట్ర కూటమిలోని పరిణామాల ఆధారంగా ఈ ఊహాగానాల సాగుతున్నాయి.  మొత్తంగా ఎన్డీయేలో చేరికపై శరద్ పవార్ నిర్ణయం, సుప్రియ సూలే రాజకీయ భవిష్యత్ ఉజ్వలంగా ఉండేందుకు దోహదపడేలా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మొత్తానికి మహా రాజకీయాలు  శరద్ పవార్ చుట్టూ తిరిగుతున్నాయి.  ఆయన వ్యూహాలు ఏమేరకు సక్సెస్ అవుతాయి అన్నదానిపైనే  మహారాష్ట్ర పొలిటికల్ సినేరియాలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయన్న దానిపై క్లారిటీ వస్తుంది.

మీకు నచ్చవచ్చు: రాజ్యసభ బరిలో శరద్ పవార్

అసలు సినిమా ముందుంది.. ఏక్ నాథ్ షిండే.. శివసేన చీలిక వెనుక కేంద్రం.. ఉద్ధవ్

[Supriya Sule, Sharad Pawar, Maharashtra politics, NDA alliance, delimitation,PawarStrategies, TeluguOne]

By
en-us Political News

  
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.