పంచాయతీలకు పొత్తు ధర్మం వర్తించదు: జనసైనికులకు పవన్ కల్యాణ్ స్పష్టీకరణ.!

Publish Date:Nov 23, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల  వేళ జనసేన  కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పరిమితులు, ఆంక్షలు లేదా పట్టింపులు లేవని, ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేయవచ్చని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేరుతో  జనసేన కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   

ఏ గ్రామంలోనైనా జనసేన మద్దతుతో పోటీ చేయాలనుకునే వారు ముందుకు వచ్చి నామినేషన్ వేయవచ్చని క్లారిటీ ఇచ్చింది. అలా పోటీ చేయాలనుకునే అభ్యర్థులను పార్టీ నాయకులు   అడ్డుకోకూడదనీ,  వారికి అండగా నిలబడి, సహకారం అందించి, నామినేషన్ వేసేందుకు ప్రోత్సహించాలని పేర్కొంది.   వీర మహిళలు, జనసైనికులతో పాటు పార్టీ మద్దతుదారులుగా రంగంలోకి దిగి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఎవరైనా స్వేచ్ఛగా పాల్గొనవచ్చని ఆ ప్రకటన విస్పష్టంగా పేర్కొంది. 

 కూటమి పొత్తుల అంశాన్ని ప్రస్తావిస్తూ, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే గ్రామీణ పంచాయతీ ఎన్నికల విషయంలో అలాంటి సీట్ల పంపకాలు ఏవీ ఉండబోవని జనసేనాని పేరుపై విడుదలైన ఆ ప్రకటన స్పష్టం చేసింది.   గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక పార్టీ జెండాపై లేదా ఒకే పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావని వివరించింది.

 పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ప్రజలు ఎన్నుకునే ఈ స్థానాల ఎన్నికలు కూటమి పార్టీలకు అతీతంగా జరుగుతాయని తెలిపారు. ఈ క్రమంలో పౌరుల స్వేచ్ఛను కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని, ఎవరైనా స్వేచ్ఛగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చని ఆ ప్రకటన క్లారిటీ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి షెడ్యూల్ ఇదే.!


 పంచాయతీ ఎన్ని కలవేళ జనసేన అధినేత తీసుకున్న ఈ  నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామీణ స్థాయిలో పోటీ చేయాలనుకునే కార్యకర్తలు, మద్దతుదారులకు ఇది స్పష్టమైన మార్గదర్శకంగా నిలుస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఈ ప్రకటనతో క్షేత్రస్థాయిలో నామినేషన్ల ప్రక్రియపై చర్చ మొదలైంది.   

మున్ముందు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు, పోటీ విషయంలో గ్రామాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. పవన్ కల్యాణ్ సూచనలకు అనుగుణంగా జనసైనికులు, వీర మహిళలు, నాయకులు ఎలా ముందుకు సాగుతారనేది తదుపరి దశలో స్పష్టమవుతుంది.   గ్రామీణ ఎన్నికల్లో స్వేచ్ఛాయుత పోటీకి అవకాశం కల్పించడం ద్వారా స్థానిక స్థాయిలో ఆశావహులకు అవకాశం లభిస్తుందనే భావన వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ గ్రామ పంచాయతీల వారీగా పోటీ చిత్రం మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. 

మీకు నచ్చవచ్చు:  పంచాయతీ నామినేషన్ల వేళ హింసకు కుట్ర: 66 మంది అరెస్టు.!​

ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.!

[Pawan Kalyan,  Panchayat elections,  Jana SenaStand,  Seatsharing,  AllianceEthics, TeluguOne]

By
en-us Political News

  
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.