సిబీఐ దూకుడుపై కలవరపడుతున్న రెడ్డి కులస్థులు!
Publish Date:May 10, 2012
Advertisement
సిబీఐ వెంట వెంటనే ఛార్జిషీటు దాఖలు చేయడం, ఆకస్మికంగా జగన్ కంపెనీలకు చెందిన బ్యాంక్ అకౌంట్లను స్తంభింపచేయడం చూస్తుంటే జగన్ కేసు ఊపందుకొన్నట్టు కనిపిస్తోంది. ఇదే ఊపులో సిబీఐ అధికారులు ఆయనను ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. ఒకవేళ సిబీఐ అధికారులు జగన్ ను అరెస్ట్ చేయడానికి కాలాయాపన చేసినా హైకోర్టు అయినా అరెస్ట్ చేయమని సిబీఐ అధికారులకు సూచన చేసే అవకాశం కనిపిస్తోంది. కోర్టు ఇప్పటికే మే 28వ తేదీన హాజరు కావలసిందిగా జగన్ కు సమన్లు జారీ చేసింది. జగన్ కోర్టుకు హాజరైనా కాకపోయినా సిబీఐ దాఖలు చేసిన వివరాలను బట్టి అరెస్టు చేయడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. సిబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటులోని పేర్లను చూస్తే వారిలో అత్యధికులు రెడ్డి కులస్థులె కావడం విశేషం. వై.ఎస్.ఆర్. హయాంలో అనేకమంది రెడ్డి కులస్థులు అక్రమాలు చేసి, వేలకోట్ల రూపాయలు స్వాహాచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పేరు చివర తోకవుంటే రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావచ్చు. రాంకీ సంస్థ ఒక సాదా సీదా సంస్థ. కానీ ఆ సంస్థ నిర్వాహకులు వందల కోట్లకు పడగలెత్తారు. పేదలకు పట్టుమని వందగజాల స్థలం కేటాయించడానికి ఎన్నో నియమనిబంధనలు వల్లించే పట్టణాభివృద్ధి సంస్థ ఈ సంస్థకు విశాఖపట్నం సమీపంలో ఫార్మాసిటీ పేర 2100 ఎకరాల భూమిని అప్పటించింది. ఫార్మా పరిశ్రమ పేరుతొ సంపాదిచిన ఈ భూమిలో దాదాపు 914 ఎకరాలను ఫ్లాట్లుగా మార్చి అమ్మడం ద్వారా దాదాపు రూ. 1300కోట్లు (ఇది సిబీఐ అధికారుల అంచనా మాత్రమే ... మార్కెట్ రేట్ ప్రకారం అయితే ఇందుకు రెండు మూడు రెట్లు వున్నా ఆశ్చర్యం లేదు.)దండుకొంది. రాంకీ సోదర సంస్థలైన మరో మూడు సంస్థలు కూడా ఇదే విధంగా భూములను సంపాదించింది. ఈ కుంభకోణం ద్వారా కోట్ల లబ్దిపొందిన వ్యక్తి పేరు రామిరెడ్డి, నాడు ముఖ్యమంత్రిగా వున్న నేత మొదలుకొని విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ వరకూ అందరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. వీరందరినీ కలపడానికి పేరు చివర వుండే కులం తోక అడ్మిట్ కార్డుగా పనిచేసింది. రాంకీ సంస్థే కాదు ... హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీలు, ట్రెడెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ వేల ఎకరాలలో అక్రమ మనినింగ్ కొనసాగించిన బ్రాహ్మిణి వంటి గనుల కంపెనీలకు వేల ఎకరాలు కట్టపెట్టిన జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందిరా టెలివిజన్ సంస్థలలో వేల కోట్లలో పెట్టుబడులు పెట్టినా ... ఇటువంటి వ్యవహారాలన్నింటికీ అంతర్గత అనుబంధంగా వున్నది రెడ్డి కులమే. ఇప్పుడు వీరంతా సిబీఐ దూకుడుపై కలవర పడుతున్నారు. జగన్ అక్రమ ఆస్థుల విషయమై సిబీఐ దాఖలు చేసిన మూడు ఛార్జిషీట్లను పరిశీలించి నప్పుడు ఒక ప్రత్యేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సిబీఐ దాఖలు చేసిన ముద్దాయిల జాబితాలో (అత్యధికమంది), కోర్టు సమన్లు జారీచేసిన 13 మంది నిందుతుల పేరు చివర ఇంచుమించు అందరికీ "రెడ్డి'' వుండటం, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. విజయసాయిరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి (డైరెక్టర్, హెటిరో డ్రగ్స్), కె.నిత్యానంద రెడ్డి (ఎం.డి. అరబిందో ఫార్మా), పి.శరత్ చంద్రారెడ్డి (ఎం.డి.- ట్రెడెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్) వీరంతా వ్యక్తిగతంగా సమన్లు అందుకొన్న నిందుతుల జాబితాలోనివారే. ఇంకా హెటిరో గూప్ కంపెనీలు, ట్రెడెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జననీ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ ప్రవివేట్ లిమిటెడ్ సంస్థలు కూడా సమన్లు అందుకొన్నాయి. ఈ సమస్థలు నిర్వాహకులు కూడా పేరు చివర "రెడ్డి'' నామధేయం వున్నవారే. వీరితోపాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టరు వెంకట రామి"రెడ్డి'' కూడా ఎ-4 గా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్థులను కాజేయడం ఒక అంశమైతే వేలాది కోట్ల రూపాయల మేళ్ళన్ని ఒకే సామాజికవర్గానికి చెందినవారికి చండడం గమనించతగిన మరో అంశం. ఇతర సామాజికవర్గానికి చెందిన ఒకరిద్దరు వున్నప్పటికీ వారు కూడా తెలుగుదేశంపార్టీ అధికారంలో వుండగా పెత్తనం చెలయించినవారే. అవినీతి, అక్రమాలకూ కులం అనేది ఒక పెద్ద అడ్మిట్ కార్డుగా మారిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అధికారంతో దందా చేయడం ద్వారా ఏవిధంగా రాత్రికి రాత్రే లక్షల కోట్లు సంపాదించవచ్చునో జగన్ పై సిబీఐ దాఖలు చేసిన కేసులు తెలియజేస్తుంటే ఇక రౌడీయిజం, ఫ్యాక్షనిజం ద్వారా కూడా రాత్రికి రాత్రే ఏ విధంగా కోట్ల రూపాయలు సంపాదించవచ్చునని అర్థం అవుతోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సూరి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సిబిసిఐడి అధికారులు భానును అరెస్టు చేసి అతనినుంచి రాబడుతున్న వివరాలను ఈ విషయాన్నీ రుజువుచేస్తోంది. భూ కబ్జాలు, పంచాయితీలు మొదలుకొని కాంట్రాక్టర్ల, ఇంజనీర్లు వరకు బెదించడం ద్వారా రాత్రికి రాత్రే కోట్లు సంపాదించవచ్చునని భాను చెబుతున్న వివరాలను బట్టి సామాన్యులకు కూడా అర్థం అవుతుంది. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రౌడీమామూల్లే వందల కోట్లలో సమర్పించుకుంటుంటే ఇక వారు ప్రాజెక్ట్ ల పేరుతొ ఏ స్థాయిలో నిధులు స్వాహా చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ కు చెందిన కంపెనీల ఆర్ధిక లావాదేవీలను స్తంబింప చేసినందుకు నిరసనగా ఆందోళన చేయాలన్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పులుపుకు ఊహించిన స్థాయిలో స్పందన లభించలేదు. సాక్షి లావాదేవీలను స్తంభింప చేసినందుకుగాను కొన్ని జర్నలిస్టు సంఘాలు మాత్రం ఖండించాయి. ఆ శంఖాలు కూడా జర్నలిస్టుల ఉద్యోగ భద్రత అంశంపై స్పందించాయే గానీ జగన్ కార్యకలాపాలకు మద్దతుగా కాదు. ఈ నేపథ్యంలో ఒక వేల జగన్ ను అరెస్ట్ చేసినా ప్రజలలో పెద్దగా స్పందన లేకపోతే రాజకీయంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
http://www.teluguone.com/news/content/cbi-chargesheet-24-13930.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





