జగనన్న దగ్గర ఎవరూ పని చేయలేరా? ప్రవీణ్ ప్రకాశ్‌తో మరోసారి చర్చ!
Publish Date:Feb 15, 2022
Advertisement
సీఎం జగన్మోహన్‌రెడ్డి. ఆయన మెనార్క్ అనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ యాటిట్యూడ్‌పై అనేక కామెంట్స్ ఉన్నాయి. వైసీపీ అధినేతగా ఆయన పార్టీ నాయకులను హీనంగా చూస్తారని.. ఇంటికెళితే టీ, బిస్కెట్లు కూడా ఆఫర్ చేయరని అంటుంటారు. దర్పం ప్రదర్శిస్తారని.. ఎవరినీ కేర్ చేయరని చెబుతుంటారు. సీఎం అయ్యాక కూడా జగన్ తీరు అసలేమాత్రం మారలేదని కూడా అంటారు. బహుషా అందుకే కాబోలు.. ఆయన దగ్గర కీలక విధుల్లో ఉండే అధికారులు ఎవరూ ఎక్కువ కాలం ఉండట్లేదు..ఉంచట్లేదు. లేటెస్ట్‌గా జగన్ టీమ్‌లో మరో వికెట్ పడిపోయింది. ముఖ్యమంత్రి జగన్ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ అయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించారు. జగన్ సీఎం అయ్యాక ముఖ్యమంత్రికి ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. చాలా కాలం కీలకమైన సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) పోస్టును పూర్తి అదనపు బాధ్యతగా నిర్వహించారు. సీఎంవోలో ఆయనే సూపర్ బాస్‌గా చెలామణి అయ్యారు. ఆ క్రమంలో ఆయనపై అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించి ఆయన కేంద్ర బిందువు అయ్యారు. ప్రవీణ్ ప్రకాశ్ అన్నివిషయాల్లో జోక్యం చేసుకోవడం వల్లే.. ఆయనతో నెగ్గలేకే.. పలువురు సీఎస్‌లు బాగా ఇబ్బంది పడ్డారని అంటారు. ఓ సీఎస్ అర్థాంతరంగా వెళ్లిపోవడానికి కూడా ప్రవీణ్ ప్రకాశ్‌తో విభేదాలే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, సీఎంవోలో ప్రవీణ్ ప్రకాశ్ హవా నడుస్తున్న సమయంలో సడెన్‌గా జగన్‌తో తేడాలొచ్చాయని చెబుతారు. ఓ పని విషయంలో సీఎం చెప్పినా ఆయన చేయలేదనే విమర్శలు వచ్చాయి. తెచ్చిపెట్టుకున్నవాడే.. తన మాట వినకపోతే జగనన్న ఊరుకుంటారా? అందుకే, కొన్ని నెలల క్రితం సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. ప్రవీణ్ ప్రకాశ్ చూస్తున్న సబ్జెక్టుల్లో కొన్ని కీలకమైన వాటిని ఇటీవల ఆయన నుంచి తప్పించి వేరే వారికి అప్పగించారు. ఇక ఇక్కడ ఉండలేమని అర్థమై.. గత కొన్ని నెలల నుంచీ ప్రవీణ్ ప్రకాశ్ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆయనను ఎంప్యానెల్ చేయలేదు. దీంతో ఆయన రాష్ట్ర కేడర్‌లోనే ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ హోదాలో మళ్లీ ఢిల్లీకి వెళుతున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మోకాళ్లపై కూర్చొని సీఎం జగన్‌తో మాట్లాడిన ఘటనపై విమర్శలు వచ్చాయి. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాశ్.. సీఎంవోలో కీలక అధికారులు ఎవరూ జగన్‌తో ఎక్కువ కాలం పని చేయలేరని అంటున్నారు. మొదట్లో బాగానే ఉన్నా.. పోనుపోనూ జగన్ చెప్పే పనులు చేయలేక.. రూల్స్‌ను అధిగమించలేక.. అలాంటి పనులు చేస్తే గతంలోలా ఎలాంటి కేసులు మెడకు చుట్టుకుంటాయో అర్థంకాక.. తప్పనిసరి పరిస్థితుల్లోనే కొంతకాలం ఎలాగోలా పని చేసి.. సమయం వచ్చినప్పుడు ఇలా వెళ్లిపోతున్నారని అంటున్నారు. ఎంతైనా జగనన్నా.. మజాకా...!
http://www.teluguone.com/news/content/reasons-behind-praveen-prakash-out-from-cmo-25-131790.html





