అనుమానం…అమానుష హత్యకు దారి

Publish Date:Mar 23, 2026

Advertisement

 

ప్రేమతో మొదలైన ఒక కుటుంబ కథ… అనుమానం, మద్యం వ్యసనం, హింసతో భయానక ముగింపుకు చేరింది. ఓ వివాహితను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త… చివరికి ఆమెనే కిరాతకంగా హతమార్చిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో కలకలం రేపింది.మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేటకు చెందిన నర్సింలు (31), అదే ప్రాంతానికి చెందిన శోభ అలియాస్ శోభారాణి (33)ను నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. 

వారి ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి పుట్టింది. మొదట్లో సాఫీగా సాగిన సంసారం… కాలక్రమేణా మలుపు తిప్పింది. నర్సింలు మద్యానికి బానిస కావడం, భార్యపై అనుమానం పెంచుకోవడం వల్ల దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.ఈ వేధింపులు భరించలేక శోభ తన కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లి నివసిస్తోంది. అయితే, భార్యపై అనుమానం పెంచుకున్న నర్సింలు ఆమెను హతమార్చాలని పథకం రచించాడు. ఈ నెల 21న “నీ కుమారుడికి సైకిల్ కొనిపెడతాను” అంటూ మాయ మాటలతో శోభను షాద్‌నగర్‌కు పిలిపించాడు.

గదిలోకి తీసుకెళ్లిన అనంతరం మద్యం సేవించిన నర్సింలు మళ్లీ గొడవకు దిగాడు. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో… ముందుగానే సిద్ధం చేసుకున్న గ్రానైట్ రాయితో శోభ తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం గదిలోని రక్తపు ఆనవాళ్లను శుభ్రం చేసి, అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని మూటకట్టి బైక్‌పై తీసుకెళ్లాడు.అయితే ఈ ఘటనలో అత్యంత హృదయ విదారక అంశం… అదే బైక్‌పై మృతదేహంపై తన మూడేళ్ల కుమార్తెను కూర్చోబెట్టి వెళ్లడం. రంగారెడ్డిగూడ శివారులోని ఓ పొలంలో మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలను ట్రాక్ చేసి, కొన్ని గంటల్లోనే లింగంపల్లిలో నర్సింలును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన రాయి, రక్తపు మరకలున్న దుస్తులు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా… ఈ ఘటనలో మరొక విషాదకర దృశ్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రాత్రంతా చలిలో, చీకట్లో ఆ చిన్నారి తన తల్లి మృతదేహం పక్కనే కూర్చొని ఏడుస్తూ గడిపింది. ఎంత పిలిచినా అమ్మ స్పందించకపోవడంతో… ఆ పసిప్రాణం చేసిన రోదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది.ఉదయం గ్రామస్థులు చిన్నారి ఏడుపు విని దగ్గరకు వెళ్లి చూడగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ప్రేమతో ప్రారంభమైన బంధం… అనుమానంతో విషాదాంతానికి చేరిన ఈ ఘటన… సమాజాన్ని కుదిపేస్తోంది.

By
en-us Political News

  
మావోయిస్టు కీలక నేత, కొంత కాలం కిందట ఎన్ కౌంటర్ లో హతమైన హిడ్మా గతంలో పీఎల్ జీఏ బాధ్యతల నుంచి తప్పుకుని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ వైపు వెళ్లిన తరువాత దళాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో పీఎల్ జీఏ బెటాలియన్ కమాండర్‌గా బడ్సే దేవాను నియమించగా, డిప్యూటీ కమాండర్ బాధ్యత లను సోది కేశాలకు అప్పగిం చారు.
మల్లె, కనకాంబరం, రోజా, చామంతి వంటి సుగంధ పుష్పాలతో పాటు తులసి వంటి పవిత్ర పత్రాలతో స్వామివారికి పుష్ప నీరాజనం సమర్పించారు. గంటల తరబడి సాగిన ఈ పుష్పాభిషేకం చూసి భక్తులు పులకించిపోయారు.
కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు ఫ్రంట్‌లైన్ ప్రెస్ పేరుతో ఒక బృందంగా ఏర్పడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. వీరంతా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. చిత్రీకరణ కోసం పుష్పగిరి వద్దనున్న పెన్నా నది వద్దకు వీరు ఆదివారం వెళ్లారు.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, మహ్మద్ షమీ అదిరిపోయే వ్యూహంతో వారిని దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికే షమీ వేసిన స్లోయర్ డెలివరీని అర్థం చేసుకోవడంలో అభిషేక్ పూర్తిగా విఫలమయ్యాడు. బంతి బ్యాట్ అంచుకు తగిలి షార్ట్ థర్డ్ దిశగా వెళ్లగా, అక్కడ ఉన్న మనిమారన్ సిద్ధార్థ్ అద్భుతమైన డైవ్‌తో క్యాచ్ పట్టాడు.
మంగళవారం ) పవర్ ప్లాంట్స్‌పై దాడులు, బ్రిడ్జ్‌పై దాడులు అన్నీ కలగలిపి ఉంటాయి. ఇలాంటిది మునుపెన్నడూ చూసి ఉండరు. హోర్ముజ్‌ను తెరవకపోతే మీకు నరకం కనిపిస్తుంది.. చూస్తూ ఉండండి అంటూ అని బూతులతో ట్రంప్ చెలరేగిపోయారు.
చైనాకు చెందిన పలు సాంకేతిక సంస్థలు శాటిలైట్ ఛాయాచిత్రాలు, విమానాల రాకపోకల డేటా, షిప్పింగ్ సమాచారాన్ని విశ్లేషించడానికి ఏఐని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా మిజార్‌విజన్ వంటి సంస్థలు ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన సమాచారాన్ని అత్యంత వేగంగా క్రోడీకరించి, అమెరికా సైన్యం ఎక్కడెక్కడ మోహరించి ఉందో ఇట్టే కనిపెట్టేస్తున్నాయి.
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో చైన్నైని చిత్తు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్కోరు.
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.