నెలవంక దర్శనం.. రంజాన్ మాసం ప్రారంభం
Publish Date:Feb 17, 2026
Advertisement
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం బుధవారం (ఫిబ్రవరి 18) నుంచి ప్రారంభం అయ్యింది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించిందనీ, దీంతో రంజాన్ మాసం మొదలైందనీ మత పెద్దలు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల తరువాత.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 31 సంవత్సరాల తరువాత ఫిబ్రవరిలో రంజాన్ మాసం వచ్చింది. గతంలో 1995 ఫిబ్రవరి 1వ తేదీన రంజాన్ మాసం మొదలైంది. ఆ తరువాత ఫిబ్రవరిలో రంజాన్ మాసం ప్రారంభం కావడం మళ్లీ ఇదే కావడం విశేషం. మరోవైపు రంజాన్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం ఉద్యోగుల పనివేళల్లో వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించిన విషయం తెలిసిందే. పవిత్ర మక్కా మసీదు ఉన్న సౌదీ అరేబియాలో నెలవంక దర్శనం ఇవ్వడంతో అధికారికంగా రంజాన్ మాసం ప్రారంభం అయ్యిందని ప్రకటించారు. అలాగే సౌదీ సుప్రీం కోర్టు కూడా రంజాన్ ప్రారంభాన్ని ధృవీకరించింది. భారత్ లో సౌదీ ప్రకటనను అనుసరిస్తారు కాబట్టి ఇక్కడ కూడా రంజాన్ మాసం ప్రారంభం అయినట్టుగా భావించవచ్చు. మరోవైపు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా అనుమతి ఇచ్చింది.
http://www.teluguone.com/news/content/ramazan-month-started-36-214264.html





