బంధాలను బలంగా మార్చే దారప్పోగు.. రాఖీ..!

Publish Date:Aug 25, 2026

Advertisement

రక్తసంబంధాలన్నింటిలోనూ అత్యంత విలక్షణమైనది, మధురమైనది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధం. చిన్నతనంలో ఒకే ఇంట్లో పెరుగుతూ గిల్లికజ్జాలు, చిలిపి అల్లర్లు, పంచుకోవడంలో గొడవలతో మొదలైన వీరి పయనం.. కాలంతో పాటు మరింత పరిణతి చెందుతుంది. ఆ పవిత్ర బంధానికి స్నేహం, వాత్సల్యం, రక్షణ కలగలిపి పండుగలా జరుపుకునే వేడుకే 'రక్షాబంధన్'.

ప్రేమకు, రక్షణకు ప్రతీక..

సోదరి తన అన్న లేదా తమ్ముడి చేతికి కట్టే ఆ చిన్న దారప్పోగు కేవలం ఒక దారం మాత్రమే కాదు.  అది ప్రేమానురాగాలకు, రక్షణకు ప్రతీక. ఈ పండుగ రోజున సోదరి తన సోదరుడి శ్రేయస్సును, ఆయురారోగ్యాలను కోరుకుంటూ రాఖీ కడితే.. సోదరుడు ఆమె జీవితాంతం తోడుగా ఉంటానని, ప్రతి కష్టంలోనూ వెన్నుదన్నుగా నిలుస్తానని మాటిస్తాడు. రాఖీ కట్టే సమయానికి దారంతో పాటు మానసికంగా వారిని ముడివేసే అనుబంధం మరింత గట్టిపడుతుంది.

కాలం మారినా.. తరగని విశిష్టత..

ఆధునిక జీవనశైలిలో ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా తోబుట్టువులు వేర్వేరు నగరాల్లో, దేశాల్లో నివసిస్తున్నప్పటికీ రాఖీ పండుగ ఇచ్చే భావోద్వేగం మాత్రం మారలేదు. దూరాలు పెరిగినా రాఖీల రూపంలో ప్రేమ సందేశాలు చేరుతూనే ఉన్నాయి. ఈ రోజున పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం ద్వారా ప్రేమానురాగాలు నిత్యనూతనంగా నిలుస్తాయి.

బాధ్యతను గుర్తుచేసే వేడుక..

రక్షాబంధన్ అంటే కేవలం బహుమతులు మార్చుకోవడమే కాదు,  అది ఒక సామాజిక, కుటుంబ బాధ్యతను గుర్తుచేసే పండుగ. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు.. ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా ఉండటాన్ని ఈ రాఖీ పండుగ గుర్తు చేస్తుంది. 

రక్షణగా నిలవడం..

తోబుట్టువుకు ఏ సమస్య వచ్చినా 'నేనున్నాను' అనే నమ్మకాన్ని ఇవ్వడమే నిజమైన రక్ష. రాఖీ కట్టిన సందర్భంగా ప్రతి సోదరుడు తన సోదరికి ఇచ్చే నిజమైన బహుమానం.. నేనున్నాను అనే భరోసా ఇవ్వడమే.

గౌరవం..

సమాజంలో మహిళలను గౌరవించే సంస్కారాన్ని ఈ బంధం నుంచే ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. ఒక ఆడపిల్లను తన ఇంటి వారు గౌరవిస్తే.. బయటి వాళ్ళు కూడా ఆ ఆడపిల్లను గౌరవిస్తారు. 

సుఖదుఃఖాల్లో తోడు..

జీవితంలో వచ్చే ప్రతీ ఎత్తుపల్లాల్లో ఒకరికొకరు మానసిక ధైర్యంగా నిలబడాలి. ఆ ధైర్యం మనిషిని ఎంత కష్టంలో అయినా పోరాడేలా.. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా నిలబడేలా చేస్తుంది. 

కలకాలం నిలిచే అనుబంధానికి రాఖీలో ఉండే దారప్పోగు ఇచ్చే బలం ఎంతో గొప్పది. స్వచ్ఛమైన ప్రేమకు, బాధ్యతకు చిహ్నమైన ఈ రాఖీ పండుగ తోబుట్టువులందరి జీవితాల్లో సంతోషాలను నింపాలని కోరుకుందాం!

                                                                                                                                     *రూపశ్రీ

By
en-us Political News

  
ఇంట్లో ఇనా బయటకు వెళ్ళినప్పుడు అయినప్పుడు అయినా దాహం వేయగానే మొదట నీరు తాగుతారు.
మనిషి జీవితంలో సంపద కంటే విలువైనది జ్ఞానం. చాణక్య నీతి ప్రకారం జ్ఞానం మనకు ఎప్పటికీ తోడుగా ఉండే శక్తివంతమైన ఆయుధం.
శారీరక శ్రమ లేని మహిళలు సోషల్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే గాయాల ముప్పుపై లా ట్రోబ్ యూనివర్సిటీ సరికొత్త పరిశోధన వెల్లడించిన నిజాలు, గణాంకాలు మరియు నివారణ మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
చిన్న వయసులోనే పిల్లల్లో ఊబకాయం వేగంగా పెరగడానికి కారణాలు ఏమిటి జంక్ ఫుడ్, అధిక స్క్రీన్ టైమ్, సరిపడా నిద్రలేకపోవడం వంటి తల్లిదండ్రులు తెలియకుండా చేసే 5 ప్రధాన పొరపాట్లు మరియు పిల్లలను ఆరోగ్యంగా ఉంచే నివారణ మార్గాల సమగ్ర వివరాలు ఇవే.
విడాకులు అనేవి ఒకరి జీవితంలో మాత్రమే కాదు, రెండు కుటుంబాల భవిష్యత్తును మార్చే అత్యంత కీలకమైన నిర్ణయం.
స్నేహితులతో లేదా జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉండాలంటే నమ్మకం, పరస్పర గౌరవం చాలా ముఖ్యం.
నేటి వేగవంతమైన ప్రపంచంలో పరిగెత్తే జీవితం, ఉద్యోగ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు, సామాజిక మానసిక ఆందోళనలు మనిషిని నిరంతరం ప్రశాంతతకు దూరం చేస్తున్నాయి.
సమయం జీవితంలో అత్యంత విలువైన సంపద అని చాణక్యుడు చెబుతాడు. ఒక్కసారి గడిచిపోయిన సమయాన్ని తిరిగి తీసుకురావడం ఎవరి వల్లా సాధ్యం కాదు. అందుకే ప్రతి క్షణాన్ని మన భవిష్యత్తును మెరుగుపరచడానికి ఉపయోగించాలి.
శ్రీశైల క్షేత్రంలో భక్తులకు సౌకర్యవంతమైన పాఠాలగంగ రోప్‌వే సేవలు సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమయ్యాయి. కేవలం 5 నిమిషాల్లో పాఠాలగంగకు చేరుకునేలా పర్యాటక శాఖ చేసిన భద్రతా ఏర్పాట్లు మరియు వివరాలు తెలుసుకోండి.
హిందూ సంప్రదాయ నిత్య పూజల్లో ఆచమనం ఎందుకు చేస్తారు? 3 సార్లు నీటిని స్వీకరించడం వెనుక ఉన్న త్రివిధ దోషాల నివారణ, వైదిక మంత్రాలు, ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలు మరియు పాటించాల్సిన నియమాలను సమగ్రంగా తెలుసుకోండి.
ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మరియు అశ్విని వైష్ణవ్ సంస్కృత భాషా విశిష్టతను కొనియాడారు. సంస్కృత వారసత్వం మరియు ఏఐ యుగంలో దాని ప్రాధాన్యతపై సమగ్ర వివరాలు.
తీవ్రమైన ఎండలు మరియు విపరీతమైన చలి వల్ల గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) రోగులు ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం ఏ విధంగా పెరుగుతుందో నూతన అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. పూర్తి వివరాలు మరియు గణాంకాలు తెలుసుకోండి.
పిల్లల డిజిటల్ భద్రత మరియు మానసిక ఆరోగ్యంపై మెటా 18 బిలియన్ డాలర్ల భారీ రాజీ కుదుర్చుకుంది. రోజుకు 2 గంటల పరిమితి, నైట్ మోడ్, లైక్స్ కౌంట్ దాచడం వంటి సరికొత్త నిబంధనల సమగ్ర వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.