పెళ్ళయ్యాక అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల బంధం బాగుండాలంటే ఏం చేయాలి..!

Publish Date:Aug 25, 2026

Advertisement

పెళ్లి.. ఆడపిల్ల జీవితాన్ని, పుట్టింటితో గల బంధాన్ని కూడా చాలా వరకు మార్పులకు లోను చేస్తుంది. పెళ్లయ్యాక సొంత తోబుట్టువుల సంబంధ బాంధవ్యాల్లో కొన్ని మార్పులు రావడం సహజం.  పెళ్ళయ్యాక ఆడపిల్ల జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తాడు..  అప్పటి వరకు పుట్టింట్లో ఉన్న ఆడపిల్ల అత్తారింటికి వెళ్తుంది.  కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, కొత్త వాతావరణంలో ఉండాల్సి వస్తుంది. అది క్రమంగా అలవాటు అయినా పుట్టిల్లు మాత్రం దూరంగానే ఉంటుంది.  అయితే సరైన అవగాహన, ప్రేమానురాగాలు ఉంటే తోడబుట్టిన వాళ్ళతో బంధం ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటుంది.

పెళ్లయ్యాక అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధం మరింత బలంగా ఉండటానికి కొన్ని సలహాలు చాలా బాగా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుంటే..

సమయాన్ని కేటాయించుకోవడం..

ఎంత బిజీగా ఉన్నా రోజూ లేదా వారానికి ఒకసారైనా పలకరించుకోవడం ముఖ్యం. పండుగలు, పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాల్లో కలిసి గడపడానికి ప్రయత్నిస్తే దూరం అనే భావన తగ్గుతుంది.

స్పేస్  ఇవ్వడం, గౌరవించడం..

వివాహమైన తర్వాత తోబుట్టువుల జీవితాల్లో వారి భాగస్వామికి ప్రధాన స్థానం ఉంటుంది. ఆ మార్పును అర్థం చేసుకుని, వారి వ్యక్తిగత జీవితానికి , నిర్ణయాలకు తగిన గౌరవాన్ని ఇవ్వాలి.

భాగస్వాములతో మంచి సంబంధం..

ఆడపిల్లను చేసుకున్న వ్యక్తికి ఇచ్చే గౌరవాన్ని బట్టే.. తోడబుట్టిన వాళ్ళ బంధం ఆరోగ్యంగా ఉంటుంది. ఆడపిల్లను ఇచ్చినప్పుడు ఇంటి అల్లుడిని కుటుంబంలో ఒకరిగా ప్రేమగా చూడాలి. వారితో పాజిటివ్ వాతావరణం ఏర్పడితే అన్నాచెల్లెళ్ల/అక్కాతమ్ముళ్ల బంధం మరింత పటిష్టమవుతుంది.

పోలికలు,  నిష్టూరాలు..

పాతికేళ్ల క్రితం ఉన్న చిన్నప్పటి పరిస్థితులను, పెళ్లయ్యాక వచ్చే మార్పులను పోల్చి చూడకూడదు. భర్త రాగానే మారిపోయింది అని నిష్టూరం చేసుకోవడం లాంటివి కూడా చేయకూడదు.  ఆర్థికపరమైన విషయాల్లో లేదా ప్రాధాన్యతల్లో మార్పులు వచ్చినా పరస్పరం అర్థం చేసుకోవాలి.

సమస్యలను నేరుగా మాట్లాడుకోవడం..

ఏవైనా మనస్పర్థలు వచ్చినప్పుడు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, తోబుట్టువులతో నేరుగా ప్రేమగా మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవాలి. కుటుంబ విషయాల్లో హుందాగా ప్రవర్తించడం  చాలా అవసరం.

చిన్ననాటి జ్ఞాపకాలు.. 

అప్పుడప్పుడు చిన్నప్పటి సరదాలు, తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ద్వారా అనుబంధంలో పాత తీపిదనం, ఆప్యాయత ఎప్పటికీ తగ్గకుండా ఉంటాయి.

చివరగా.. 

బంధాలు నిలబడటానికి ప్రేమ ఎంత ముఖ్యమో.. పరస్పర గౌరవం, సర్దుబాటు తత్వం కూడా అంతే ముఖ్యం. మారుతున్న జీవిత పరిస్థితులకు అనుగుణంగా ఒకరికొకరు తోడుగా నిలిస్తే అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల బంధం కాలంతో పాటు మరిన్ని తీపి జ్ఞాపకాలను అందిస్తుంది.

                                                                                                                                                  *రూపశ్రీ.

 

                           

By
en-us Political News

  
చాణక్యుడు చెప్పిన ముఖ్యమైన నీతి సూత్రాల్లో రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదు అనేది ఒకటి. మన జీవితంలో కొన్ని విషయాలు మనకే పరిమితం కావాలి.
చికెన్ లివర్ తినడం వల్ల రక్తహీనత తగ్గి, కంటి చూపు మరియు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 100 గ్రాముల చికెన్ లివర్‌లో ఉన్న ఐరన్, విటమిన్ A, B12 మరియు ప్రోటీన్ల షాకింగ్ వివరాలు తెలుసుకోండి!
రోజూ ఆహారంలో చేపలను తీసుకోవడం వల్ల గుండెపోటు, కంటి చూపు లోపాలు మరియు జ్ఞాపకశక్తి సమస్యలకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసుకోండి. ఓమేగా 3 మరియు విటమిన్ డి అద్భుత ప్రయోజనాలు ఇవే!
గ్రీన్‌టీ తాగడం వల్ల ఎంత మంచి జరుగుతుందో, తప్పుగా తాగితే అంత ప్రమాదం. పరగడుపున తాగడం, పరిమితి దాటడం వల్ల కలిగే తీవ్ర దుష్ప్రభావాలు మరియు నిపుణులు సూచించిన పద్ధతులు తెలుసుకోండి!
రోజు ఉదయాన్నే పరగడుపున బార్లీ నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాక బరువు తగ్గడం, బ్లడ్ షుగర్ కంట్రోల్ మరియు కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడతాయి. నిపుణులు వెల్లడించిన నిజాలు ఇవే!
రోజు ఉదయాన్నే బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని మొండి కొవ్వు కరగడమే కాక బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. 96% నీరు, తక్కువ క్యాలరీలు ఉన్న ఈ ప్రకృతి ఔషధ ప్రయోజనాలు ఇవే!
సీఫుడ్ ప్రియులకు ఇష్టమైన ఆంధ్ర అండ్ రాయలసీమ ప్రత్యేక ఎండు రొయ్యల కారం పొడి తయారీ విధానం తెలుసుకోండి. పర్ఫెక్ట్ కొలతలతో నెల రోజులు నిల్వ ఉండేలా ఇంట్లోనే ఎంతో సులభంగా చేసుకోండి!
చక్కెర బదులు బెల్లం లేదా తేనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? డాక్టర్లు వెల్లడించిన షాకింగ్ నిజాలు, క్యాలరీలు మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
ఇంగ్లాండ్‌లోని అతిచిన్న కౌంటీ రట్లాండ్ తీవ్ర ఆర్థిక సవాళ్లు మరియు విలీనం భయాలను ఎదుర్కొంటోంది. 800 ఏళ్ల చరిత్ర, 41,000 జనాభా ఉన్న ఈ కౌంటీ తన స్వయంప్రతిపత్తిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి.
పిల్లలు గంటల తరబడి ఫోన్, టీవీ చూస్తున్నారా? అది వారి మెదడు ఎదుగుదలపై ఎలాంటి ప్రమాదకర ప్రభావం చూపుతుందో最新 పరిశోధనల ఆధారంగా తెలుసుకోండి. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక వివరాలు ఇవే!
రక్తసంబంధాలన్నింటిలోనూ అత్యంత విలక్షణమైనది, మధురమైనది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధం.
మహిళల్లో రక్తహీనత, తీవ్రమైన అలసటను తగ్గించి హిమోగ్లోబిన్ స్థాయిలను వేగంగా పెంచే ఐరన్ రిచ్ సూపర్ ఫుడ్ లడ్డూ తయారీ విధానం మరియు దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
డయాబెటిస్ రోగులకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు, మాత్రల బాధ తప్పించేందుకు చైనా శాస్త్రవేత్తలు జన్యుపరంగా మార్పు చేసిన గిఫ్ట్ స్మార్ట్ ప్రోబయోటిక్‌ను ఆవిష్కరించారు. కప్పు పెరుగు రూపంలో తీసుకునే ఈ మందు రెండేళ్లలో అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.