Publish Date:Feb 20, 2026
రీల్ సీన్.. అదేనండి సినిమాల్లో కనిపించే సీన్ రియల్‌గా జరిగితే ఎలా ఉంటుంది? తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో రియల్‌గా జరిగిన అలాంటి సీన్ చూసి ఇన్‌కం టాక్స్ అధికారులకే దిమ్మతిరిగిందంట. వారి సోదాలో ఓ వ్యాపారి ఇంట్లోని గోడ వెనుక రూ.కోట్ల విలువచేసే బంగారాన్ని దాచిన స్ట్రాంగ్ రూమ్ బయటపడింది. ఇదంతా చూసి ఐటీ సోదాలకు వచ్చిన అధికారులు కూడా షాకయ్యారు. రూ.100 కోట్ల ట్యాక్స్ ఎగవేత ఆరోపణల్లో భాగంగా కన్హా గ్రూప్ ఆఫీసుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు.
ప్రముఖ ఫుడ్ అండ్ బెవరేజ్ సంస్థ కన్హా గ్రూప్‌పై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా ఐటీ అధికారులు.. కన్హా గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఆరు నగరాల్లో ఉన్న 33 ప్రాంతాల్లో ఈ నెల ఫిబ్రవరి 18 నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. జైపూర్‌లో అత్యధిక సంఖ్యలో దాడులు జరిగాయి. తొలి రెండు రోజుల్లో గ్రూప్ యజమాని ఇల్లు, ఆఫీస్‌ల్లో పలు దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మూడో రోజైన శుక్రవారం నాటి సోదాల్లో అధికారులు సీక్రెట్ వాల్‌ను గుర్తించారు. దాన్ని బద్దలుకొట్టి చూడగా.. వెనక ఒక రహస్య గది ఉంది.
అందులో కోట్ల విలువచేసే బంగారు నగలు ఉన్నాయి. అంతేకాక రూ.50 లక్షల నగదు కూడా లభ్యమైంది. ప్రస్తుతం ఆ గది నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని లెక్కిస్తున్నారు. భారీగా వెలుగు చూసిన ఈ నల్ల ధనం.. దర్యాప్తు తీరునే మార్చి వేయనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ గ్రూప్‌నకు చెందిన పది బ్యాంక్ లాకర్లు బయటపడ్డాయి. వాటిలో కూడా లెక్కలోకి రాని నగదు, బంగారం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
2008లో ఈ కన్హా గ్రూప్‌ను నట్వర్‌లాల్ శారదా స్థాపించారు. ఈ సంస్థ స్వీట్స్, బేకరీ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. దీని యజమానులు రూ.100 కోట్ల వరకు పన్ను ఎగవేతకు పాల్పడి, ఆ మొత్తాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో పెట్టుబడి పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ హోటళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల వేళ కూడా ఈ గ్రూప్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో వాటిని కొనసాగించేందుకు అధికారులు అనుమతించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rajasthan-36-214418.html
రాత్రి సమయం కావడం, బావిలో నీరు నిండుగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. సమాచారం పోలీస్ లు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రెండు భారీ క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కారును బావిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారంతా మరణించారు.
మధ్యప్రాచ్యంలో శుక్రవారం ఒకేరోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేయడం అంతర్జాతీయం కలకలం రేపింది. ఇరాన్ యుద్ధ సామర్ధ్యంపై ప్రపంచ దేశాలు అబ్బురపడుతున్నాయి. అమెరికా అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయని అంటున్నాయి. ఇక పోతే ఇరాన్ దూకుడుతో అగ్రరాజ్యం డిఫెన్స్ లో పడింది.
ఐఆర్జీసీ సమాచారం మేరకు నైరుతి ఇరాన్ లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం ఇరాన్ గగతనలంలోకి ఇలా ప్రవేశించిందో లేదో.. అలా ఇరాన్ రక్షణ వ్యవస్థలు దానిని కూల్చివేశాయి. విమానం కూలిపోయే ముందే అందులోని ఇద్దరు సిబ్బంది ఎజెక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలనూ, విమానం శకలాలకు సంబంధించిన దృశ్యాలను కూడా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది.
ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో జనం ఉక్కపోతతో, ఎండ వేడితో అల్లాడిపోతున్నారు. అసలే భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్న ఏపీ జనాలకు వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. నేటి నుంచి రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు మరింత మండిపోతాయనీ, రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్లులు విస్తాయనీ ప్రకటించింది.
ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించింది. అమెరికా స్థావరాలు, జెట్లు లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది. గురువారం అమెరికా ఇరాన్ కు 48 గంటల కాల్పుల విరమణ శాంతి ప్రతిపాదనను పంపింది. ఆ ప్రతిపాదనకు సమాధానమా అన్నట్లు ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది.
ఢిల్లీతో సహా పంజాబ్‌లోని నోయిడా, ఛండీగఢ్, లూధియానాలో భూమి కంపించింది. అలాగే పూంచ్, శ్రీనగర్, ఉదమ్‌పూర్, జమ్ము కశ్మీర్‌లోనూ భూమి కంపించింది.
210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 5 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. పంజాబ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ లో నివాసం ఉంటున్న గచ్చు శ్రీశైలం అనే వ్యక్తి కి భార్య, ఇద్దరు కవల కుమార్తెలు. కుటుంబ కలహాల నేపథ్యం లో తరచూ భార్యాభర్తల మధ్య వివాదాలు సాగుతున్నాయి. ఆ క్రమంలోనే శుక్రవారం కూడా భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఆ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీశైలం.. ఐదేళ్ల వయసు ఉన్న తన ఇద్దరు కుమార్తెలకు గడ్డి మందు తాగించి బావిలో పడేశాడు.
రాజేంద్రనగర్ కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్‌కు చెందిన మహ్మద్ రహ్మత్ షరీఫ్ అనే వ్యక్తి గత నెల 31న కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో తమ ఇంట్లో బంగారం చోరీ అయ్యిందంటూ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు జనవరి 17న ఆయన భార్య, కుమార్తె బంగారు ఆభరణాలను బీరువాలో భద్రరిచారు. ఆ తరువాత గత నెల 29న ఓ ఫంక్షన్ కు వెళ్లేందుకు బంగారు ఆభరణాలు ధరించేందుకు బీరువాలోని నగల పెట్టె తెరిచి చూశారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రశాంత్ బోస్, మావోయిస్టు ఉద్యమంలో అత్యంత ప్రభావమంతమైన నాయకులలో ఒకరు. కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలో కీలక సభ్యుడిగా ఉండటంతో పాటు, ఆ సంస్థ యొక్క తూర్పు ప్రాంతీయ బ్యూరో కార్యదర్శిగా కూడా పనిచేశారు.ప్రశాంత్ కిషోర్ కిషన్ దాదా, మనీష్, బుద్ధ పేర్లతో కూడా గుర్తింపు పొందారు.
గృహ వినియోగానికి సంబంధించిన మొత్తం 3,699 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వాణిజ్య వినియోగానికి సంబంధించి 70 చిన్న ఎల్పీజీ సిలిండర్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నసిలెండర్ల విలువ 1.10 కోట్లు రూపాయలుగా అధికారులు అంచనా వేశారు.
పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను వన్‌వే మార్గంలో మాత్రమే అనుమతించనున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు కేబీఆర్ పార్క్, ఎన్‌టీఆర్ ట్రస్ట్ క్యాన్సర్ ఆస్పత్రి, టీఆర్ఎస్ భవన్, రోడ్ నెంబర్ 12, 45, 36 మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఫిలింనగర్, రోడ్ నెంబర్ 45 ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను సడలించే అవకాశముంది.
పార్టీలో పాల్గొన్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళాఐఏఎస్ అధికారి కుమారుడికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం బయటపడటంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.