తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఎల్పీజీ నిల్వలు, మళ్లింపు కార్యకలాపాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే అధికారులు నిర్వహించిన దాడుల్లో భారీ స్థాయిలో సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో వేలాది సిలిండర్లు పట్టుబడగా,వాటి విలువ 1.10కోట్లు ఉంటుందని చెబుతున్నారు. గృహ వినియోగానికి సంబంధించిన మొత్తం 3,699 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా వాణిజ్య వినియోగానికి సంబంధించి 70 చిన్న ఎల్పీజీ సిలిండర్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నసిలెండర్ల విలువ 1.10 కోట్లు రూపాయలుగా అధికారులు అంచనా వేశారు. అక్రమ కార్యక లాపాలపై కఠిన చర్యలు తీసుకుంటూ అధికారులు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు.
ఎల్పీజీ సబ్సిడీ దుర్వినియోగం, గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడం వంటి అక్రమాలను కట్టడి చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు కొనసాగిస్తామన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/crore-rupees-value-lpg-cylenders-seized-36-216642.html
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.