హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని కొండాపూర్ “క్వాక్ ఏరినా” పబ్‌లో నిర్వహించిన నైట్ పార్టీ డ్రగ్స్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన డీజే బ్లాక్ కాఫీలో పాల్గొన్న ఈ ఈవెంట్‌కు 1500 మందికి పైగా హాజరైనట్లు సమాచారం. పార్టీలో పాల్గొన్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళాఐఏఎస్ అధికారి కుమారుడికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం బయటపడటంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. డ్రగ్స్ పరీక్షల్లో మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఆరుగురికి గాంజా, ఒకరికి, మరొకరికి మెథాంఫెటమైన్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అంటే ఈ పార్టీలో మొత్తం మూడు రకాల మత్తు పదార్థాల వినియోగం జరిగినట్లు నిర్ధారణ అయింది.
ఈ నైట్ పార్టీకి భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. టేబుల్ బుకింగ్ ధరలు రూ.10,000 నుంచి రూ.2 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. సౌత్ ఆఫ్రికాకు చెందిన డీజే బ్లాక్ కాఫీ ఒక్కో ఈవెంట్‌కు సుమారు రూ.2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే ముంబైలో ఈ ఈవెంట్ పూర్తి కాగా, ఇప్పుడు హైదరాబాద్ తర్వాత గోవాలో మరో ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో పాల్గొ న్న రితేష్, జ్యోతి రాదిత్య, రిత్విక్ వాసల, అభిషేక్ వర్మ, ఆకెల్ల హరిత్ సరంగ, రిషబ్ శ్రీవాస్తవ, పిట్ల పృథ్వీరాజ్, మోనిష్ సత్వాని లకు డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/drugs-positive-to-ias-officers-son-36-216638.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.