హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ
Publish Date:Dec 13, 2025
Advertisement
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్‌ఫోర్టుకు చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. రాహుల్ నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ, రాహుల్, సీఎం రేవంత్ పాల్గొంటారు. మెస్సీ రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం పోలీసుల భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతానికి డొమెస్టిక్ అరైవల్స్ వద్దకు ప్రయాణికులను ఒక్కొక్కరిని అనుమతిస్తున్నారు. ప్రస్తుతానికి విజిటర్స్ అవర్స్‌ను కూడా డిస్మిస్ చేశారు. మొదటగా లియోనెల్ మెస్సి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి ప్రైవేట్ మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. కోల్‌కతాలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపధ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద 3 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం టికెట్ ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. ఉప్పల్ స్టేడియం, పరిసరాల్లో సీసీటీవీ కెమోరాలు డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు.
http://www.teluguone.com/news/content/rahul-gandhi-36-210945.html





